Viral Video: కరెంట్ స్తంభానికి కట్టేసి, చితక్కొట్టిన పోలీసులు- వైరల్ వీడియో!

ABP Desam   |  Murali Krishna   |  05 Oct 2022 10:21 AM (IST)

Viral Video: కొందరు ఆకతాయిలను కరెంట్ స్తంభానికి కట్టేసి పోలీసులు చితక్కొట్టారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Image Source: Twitter)

Viral Video: గుజరాత్‌లో కొంతమంది ఆకతాయిలను పోలీసులు.. కరెంట్ స్తంభానికి కట్టేసి చితక్కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు, చిన్నారులంతా కలిసి గార్బా ఆడుతుండగా కొందరు ఆకతాయిలు వాళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వాళ్లను పట్టుకుని ఇలా దేహశుద్ధి చేశారు.

ఇదీ జరిగింది

ఖేడా జిల్లాలో దసరా నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు రోడ్డుపై గార్బా నృత్యం చేస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది కుర్రాళ్లు.. వారిపై రాళ్లు రువ్వారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆకతాయిలను పట్టుకున్నారు.

వారికి బుద్ధి చెప్పేందుకు కరెంట్ స్తంభానికి కట్టేసి లాఠీలతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

ఆకతాయిలను కొడుతున్న సమయంలో పోలీసులు యూనిఫాంలో లేరు. అయితే అక్కడున్న ఇన్‌స్పెక్టర్‌ దగ్గర రివాల్వర్‌ ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దేహశుద్ధి తర్వాత నిందితులు అక్కడున్న వారికి క్షమాపణలు చెప్పారు.

మహిళలంతా ఒక్కచోట చేరి గార్బా నృత్యం చేస్తుండగా దాదాపు 150 మంది ఆకతాయిలు వాళ్లపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 43 మందిపై కేసులు నమోదు చేశాం. వీరిలో 10 మందిని అదుపులోకి తీసుకున్నాం.. హిందూయేతర వర్గానికి చెందిన చెందిన ఇద్దరు వ్యక్తులు వేడుకల్లో ప్రవేశించి సమస్యను సృష్టించారు.                          - రాజేశ్‌ గధియా, ఖేడా ఎస్పీ 

Also Read: Amit Shah Jammu Kashmir Visit: జమ్ముకశ్మీర్‌లో అమిత్ షా కీలక ప్రకటన- ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ!

Also Read: Nobel Prize 2022 in Physics: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Published at: 05 Oct 2022 10:11 AM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.