వేద నిద్రలో ఆదిత్య మాటలు తలుచుకుని ఉలిక్కిపడి లేస్తుంది. ఖుషి అది చూసి భయపడుతుంది. ఏమైందని ఖుషి అడుగుతుంది కానీ వేద ఏమి లేదని అంటుంది. మాళవిక ఆలోచిస్తూ ఉంటే అభి వస్తాడు. ఈరోజు నువ్వు చాలా అద్భుతమైన పని చేశావ్.. ఇలా దొరికిన యష్ ని అలా వదిలేశావ్. నువ్వు ఇంకా వాడిని మర్చిపోలేదు కదా వాడి మీద మోజు తీరలేదు కదా అని అభి అంటాడు. స్టాపిడ్ అభి అని మాళవిక అరుస్తుంది. చావాలని అనుకున్నావ్ ఎందుకు ఆ వేద ముందు నీ మాజీ మొగుడు నిన్ను అవమానించాడనే కదా అని అభి అడుగుతాడు. పోలీసులు వచ్చి నిన్ను అడిగినప్పుడు నా మాజీ మొగుడు టార్చర్ చేశాడు అందుకే సూసైడ్ చేసుకోబోయాను అని ఒక్క మాట చెప్పొచ్చు కదా అని అంటాడు.


అభి: ఎందుకు బతికావ్ బంగారం నువ్వు.. చస్తే ఎంత బాగుండేది నీ చావుకి కారణం వాడే అని నేనే కేసు పెట్టి ఈ పాటికి లోపల వేయించే వాడిని. నువ్వు బతికి నా కొంప ముంచావ్


మాళవిక: అభి నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా


అభి: అడుక్కో కుండ బాధలు కొట్టినట్టు చెప్తాను


మాళవిక: నువ్వు నన్ను చెరదీసింది నా మీద ప్రేమతోనా యష్ మీద పగతోనా


అభి: 50-50 సగం నీ మీద ప్రేమతో, సగం వాడి మీద కోపంతో.. ఆగాగు చిన్న కరెక్షన్ నీ మీద ప్రేమతో కాదు మోజుతో


మాళవిక: అంటే నువ్వు నన్ను లవ్ చేయలేదా


అభి: నువ్వేమైనా నన్ను లవ్ చేశావా, నన్ను ప్రేమించి నా దగ్గరకి వచ్చావా కాదే నేను నీ అందం మీద మోజు పడ్డాను నువ్వు నా డబ్బు మీద మోజు పడ్డావ్. నేను నిన్ను లేపుకురాలేదు నీకు నువ్వే నీ మొగుడిని వదిలేసి వచ్చేశావ్


మాళవిక: నా ప్రేమకి వాల్యు లేదా మీ మగబుద్ధి అంతా అంతే


Also Read: సత్యకి తెలియకుండా రుక్మిణి వెంట ఆదిత్య- మాధవ్ చేతికి చిక్కిన పవర్ ఫుల్ అస్త్రం


నేను నిన్ను లవ్ చెయ్యను అని ఎలా అనుకున్నావ్ బంగారం కానీ ఇలా ఉన్న మాళవికని కాదు.. నేను లవ్ చేసే మాళవికలో ఆ పొగరు తెగింపు ఉండేవి, ఇలా ఛాన్స్ దొరికితే మిస్ చేసే మాళవిక కాదు. నువ్వు వేదని, నేను యష్ ని కలిసి ఓడించాలి. ఉమ్మడిగా ఫైట్ చేసి వాళ్ళిద్దరినీ ఓడిద్దాం అప్పుడు కడతా నీ మెడలో నేను తాళి అని అభి మాయమాటలు చెప్తాడు.


వేద పరధ్యానంగా ఉంటుంది. అది మాలిని గమనిస్తుంది. రత్నం కూడా ఏమైంది ఒంట్లో బాగోలేదా అని అడుగుతాడు. అది చూసి ఏమైంది నీకు అని ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు. సులోచన వేద దగ్గరకి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. ఏం లేదమ్మా అని వేద ఏడుస్తుంది. నా భర్తని, బిడ్డని దూరం చెయ్యాలని ఆ మాళవిక కుట్ర చేస్తుంది. అది నాకు చాలా బాధగా ఉంది. రోజు రోజుకి ఆ మాళవిక పెట్టె క్షోభ భరించలేకపోతున్నానమ్మా అని వేద గుండెపగిలేలా ఏడుస్తుంది. నీ దగ్గరే తప్పు ఉందమ్మా.. కానీ ఒకే ఒక్క బలహీనత ఉంది. అది ఏంటో తెలుసా అతి మంచితనం. అది అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు. నీ కన్న తల్లిని నేను ఉండగా నీ జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నీ దగ్గరకి రావాలంటే ముందు ఈ పండితారాధ్యుల సులోచనని దాటాలి అని అంటుంది.


Also Read: ఆదిత్య కోరిక- వేద గుండె ముక్కలు, సులోచనకి యాక్సిడెంట్ చేయించిన మాళవిక


సులోచన కోపంగా మాళవిక ఇంటికి వస్తుంది. ఈ సారి వేదని దెబ్బ కొట్టబోతున్నా అని అభి మాళవికతో చెప్తాడు. అప్పుడే సులోచన మాళవిక అని అరుస్తూ వస్తుంది. ఎంత ధైర్యమే నీకు నా కూతురు మీదే కుట్రలు చేస్తావా ఎన్ని గుండెలు నీకు నా కూతురు కాపురంలో నిప్పులు పోస్తావా అని అరుస్తుంది.