'నిమిషం పట్టదు నా సూసైడ్ కి కారణం నువ్వే అని చెప్పడానికి, నిమిషం పట్టదు నాకు నిన్ను పర్మినెంట్ గా జైలుకి పంపడానికి.. ఎందుకో తెలుసా ఎక్కడ నీ పెళ్ళాం వేదకి నీ మీద ప్రేమ పొగుకొస్తుందో అని.. ఎక్కడ నీ పిల్లలకి నీ మీద సింపతీ పుట్టుకొస్తుందో ఇంకోసారి నా ముందు ఆ వేదని నెత్తిన పెట్టుకున్నావో, ఇంకోసారి దాని ముందు నన్ను అవమానించావో నేను పగబడితే మామూలుగా ఉండదు. ఎవరు ఆ వేద అదెంత? దాని బతుకు ఎంత? నీ పెళ్ళాం స్థానం నేను వదిలేశా అది వచ్చి దూరిపోతుందా? నీతో సంసారం చేయడం నేను క్యాన్సిల్ చేశాను ఆ వేద వచ్చి కంటిన్యూ చేస్తుందా చెయ్యకూడదు. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో నేను ఏం చేస్తానో ఏం చేయగలనో నీకు అర్థం అయ్యిందా' అని మాళవిక యష్ తో అంటుంది.


'ఆడవాళ్ళలో నీలాంటి వాళ్ళు బహుశా ఎక్కడా ఉండరేమో.. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా నువ్వు సూసైడ్ చేసుకుంటే నువ్వు లైఫ్ లో ఏం కోల్పోయావో తెలుసుకోవాలి అనుకున్నా కానీ వేరే వాళ్ళ లైఫ్ చెడగొట్టడానికి అని తెలుసుకోలేకపోయాను. నీతో ప్రాబ్లం ఏంటో తెలుసా ఏ రోజు అయితే మనం విడిపోయామో నువ్వు అక్కడే భార్యగా ఉండిపోయి ఆలోచిస్తున్నావ్, ఇద్దరు పిల్లల తల్లివని మర్చిపోయావ్. కానీ నేను తండ్రి స్థానంలోనే ఉన్నాను. ఖుషి, ఆదిలకు తండ్రిగానే నా ఆరాటం అంతా, వల్ల సంతోషాలు బాగోగులు అదే నాకు కావాల్సింది, నా బాధ్యత నేను ఫీల్ అవుతున్నా, నేను పిల్లల గురించి ఆలోచించాను నువ్వు ఆలోచిస్తున్నావా?


Also Read: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి


అసలు ఏం తెలుసు నీకు వేద గురించి, ఎంత సేపు వేద నువ్వు వదిలేసిన భార్య స్థానంలోకి వచ్చిందని ఆలోచిస్తావ్ ఏంటి? వేద నువ్వు వదిలేసిన తల్లి స్థానంలోకి వచ్చింది నాకు భార్యగా కాదు ఖుషికి తల్లిగా వచ్చింది. వెదకి ఇవ్వడమే తప్ప అడగటం చేతకాదు. నా నుంచి ఏమి ఆశించదు. నా దృష్టిలో కుంతి దేవితో సమానం నా వేద, లక్ష పురుడ్లు పోసుకున్న భూదేవితో సమానం నా వేద. వేద అంటే అమ్మ.. అమ్మ అంటే వేద' అని యష్ తన భార్య గురించి చాలా గొప్పగా చెప్తాడు. వేద యష్ కోసం ఎదురు చూసి చూసి లెటర్ లో ఉన్నదంతా కొట్టేస్తుంది. బాల్కనీలో నుంచి గదిలోకి వచ్చేసరికి యష్ ఉంటాడు. వేద వచ్చి నా గురించి పట్టించుకోవా అని లెటర్ ఇస్తుంది. అది చూసి యష్ బిత్తరపోతాడు.


మాళవిక సూసైడ్ చేసుకోబోయిందని చెప్తాడు. నా మీద పగ పట్టేసింది నాకు నరకం చూపించాలని డిసైడ్ చేసుకుంది. పోలీసులు ఒక పక్క ఆ అభిమన్యు మరో పక్క నన్ను టార్చర్ చేశారు. అన్నింటినీ తట్టుకున్నా కానీ ఒక్కటి మాత్రం తట్టుకోలేకపోయాను. నా కొడుకు ఆదిత్య అన్న మాటలు అవన్నీ నిజమే అనిపించాయి. నా వల్ల వాడు ఎంత బాధపడుతున్నాడో విన్నాక నా గుండె తరుక్కుపోయింది. ఆదిత్య అలా ప్రవర్తించడానికి కారణం నేనే అని చాలా ఎమోషనల్ అవుతాడు. పాపం వాడు అన్నం తిన్నాడో లేదో అంత చిన్న పిల్లాడు హాస్పిటల్ లో బిక్కు బిక్కుమంటూ అని చాలా బాధపడతాడు. ఇప్పుడు ఏం కావాలి మీ బిడ్డ కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి అంతే కదా అని వేద యష్ ని తీసుకుని హాస్పిటల్ కి వస్తుంది.


Also Read: దిమ్మ తిరిగేలా షాకుల మీద షాకులిచ్చిన దీప- కార్తీక్ ముందు అడ్డంగా బుక్కైయిపోయిన మోనిత


వేద నర్స్ కోట్ వేసుకుని ముఖానికి మాస్క్ వేసుకుని ఆదిత్య దగ్గరకి బొమ్మ తీసుకుని వచ్చి ఆడిస్తుంది. తర్వాత ప్రేమగా అన్నం తినిపిస్తుంది. అది చూసి యష్ చాలా సంతోషిస్తాడు. మీకు థాంక్స్ చెప్పాలి అని ఆదిత్య తన ముఖం మీద ఉన్న మాస్క్ తీస్తాడు. వేదని చూసి షాక్ అవుతాడు. నాకు ఖుషి ఎలాగో నువ్వు కూడా అలాగే నాన్న అని వేద అంటుంది. నేను ఒకటి అడుగుతాను అది మీరు చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని ఆదిత్య అంటాడు. మా నాన్నని వదిలిపెట్టి వెళ్లిపో. మా మామ్ సూసైడ్ చేసుకుంది మీ వల్లే. మా నాన్న, ఖుషిని మా మామ్ కి లేకుండా చేశావ్. వాళ్ళని నాకు ఇచ్చేయ్ నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్లిపో. నాకు మా మామ్ చెప్పింది నువ్వు వెళ్లిపోతే ఖుషి, డాడ్ మా దగ్గరకి వస్తారని మాకు దూరంగా వెళ్లిపో అని ఏడుస్తాడు.


తరువాయి భాగంలో..


సులోచన కోపంగా మాళవిక ఇంటికి వచ్చి తనని తిడుతుంది. నా కూతురి కాపురం జోలికి వస్తే మీ జాతకాలు తిరగబడతాయని సులోచన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే సులోచనని ఒక కారు గుద్దేస్తుంది.