ఎప్పుడు ఆఫీసు పనులు బయట పనులే ఉంటే మరి ఇంట్లో సత్య పరిస్థితి ఏంటి అని దేవుడమ్మ కోపంగా అడుగుతుంది. నాకు వర్క్ ప్రెజర్ తగ్గగానే నేనే బయటకి ప్లాన్ చేస్తాను అని ఆదిత్య సత్యతో అంటాడు. ఆఫీసుకి లీవ్ పెట్టి వెళ్లమని దేవుడమ్మ చెప్తుంది కానీ ఆదిత్య మాత్రం కుదరదని తెగేసి చెప్తాడు. ఆ మాటకి సత్య చాలా బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. జానకమ్మ నిద్రపోతుంటే మాధవ్ సైలెంట్ గా వచ్చి తనని భయపెడతాడు. ‘నీకు మాట రాకుండా దేవుడు మంచి పని చేశాడు లేదంటే నా గురించి అంతా చెప్పేస్తావ్ కదా. అయినా కన్న కొడుకుని నా మీద లేని ప్రేమ ఆ రాధ మీద ఎందుకు? నాది కూడా రాధ మీద ప్రేమే కదా. తనని ప్రేమిస్తున్నా అనే కదా అంతగా తను కావాలని వెంటపడుతున్నా. అది అర్థం చేసుకోకుండా ఏంటమ్మా నువ్వు.. నా ప్రేమని అర్థం చేసుకుని నువ్వు అన్న సపోర్ట్ గా ఉంటావనుకుంటే నాన్నకి చెప్తావా.


నీకు తగ్గితే వాడికి ఎందుకు తగ్గకపోతే వాడికి ఎందుకు? కన్న కొడుకుని నేనే కామ్ గా ఉంటే వాడు ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నా. ఆఫీసర్ కదా అని ఊరుకున్నా ఇక ఊరుకోను నా వల్ల కాదు రేపు మనతో పాటు ప్రకృతి చికిత్సాలయానికి వస్తున్నాడు కదా వాడిని ఏదో ఒకటి చేస్తాను’ అని ఆవేశంగా రగిలిపోతాడు. అది విని జానకి చాలా టెన్షన్ పడుతుంది. ఆదిత్య బ్యాగ్ తీసుకుని బయల్దేరతాడు. ముఖ్యమైన పని మీద వెళ్తున్న అది ఏంటి అనేది వచ్చాక చెప్తాను అని ఆదిత్య దేవుడమ్మకి చెప్తాడు. ఆదిత్య రామూర్తి ఇంటికి వస్తాడు. దేవి, చిన్మయి ఆదిత్య కారులో వస్తామని చెప్తారు. రాధని కూడా ఆఫీసర్ సార్ కారులోనే రమ్మని పిల్లలు అడుగుతారు. ఆ మాటకి మాధవ్ ఉడికిపోతాడు.


Also Read: ఆదిత్య కోరిక- వేద గుండె ముక్కలు, సులోచనకి యాక్సిడెంట్ చేయించిన మాళవిక


సత్య రుక్మిణి దగ్గరకి బయల్దేరుతుంది. విషయం ఏంటో అక్కనే తేల్చుకుంటాను నాతో మంచిగా మాట్లాడి ఇప్పుడు ఆదిత్యని తన ఇంటి చుట్టూ తిప్పుకుంటుందా. ఇన్ని రోజులు నువ్వు ఎవరో తెలిసినా నిన్ను ఇబ్బంది పెట్టకూడదని మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు బతికే ఉన్నావని మాకు దూరంగా రాధలా కొత్త జీవితం మొదలుపెట్టావని  ఆనందపడ్డాను. కానీ నను ఇబ్బంది పెడతావని అనుకోలేదు. ఎందుకు ఆదిత్యకి దేవిని దగ్గర చేస్తున్నావ్ పదే పదే ఇంటికి పంపిస్తున్నావ్. ఆదిత్య క్యాంప్ నుంచి వచ్చేసరికి ఆదిత్య నిన్ను కలవకుండా నీతో మాట్లాడకుండా చేసుకుంటా అని సత్య ఆవేశంగా మాధవ్ ఇంటికి వెళ్తుంది. ఇల్లు తాళం వేసి ఉండటం చూసి షాక్ అవుతుంది.


ఆదిత్య వాళ్ళు జానకమ్మని ప్రకృతి వైద్యశాలకి తీసుకుని వస్తారు. ఒక నాలుగు రోజులు ఇక్కడే ఉంచితే ఈమెలో తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుందని అక్కడి డాక్టర్ చెప్తుంది. ఇంతక ముందు కూడా ఒక డాక్టర్ వచ్చి నయం అవుతుందని చెప్పి ఇంక రాలేదు మీ ప్రయత్నం మీరు చెయ్యండి అని మాధవ్ అంటాడు. ఇంతకంటే దారుణమైన పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నయం అయి వెళ్లిపోయారు. త్వరలో ఈమెలో కూడా మార్పు వస్తుందని డాక్టర్ చెప్తుంది. మాధవ్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు. సత్యకి తెలియకుండా నా వెనుక వచ్చావ్ తనకి తెలిస్తే ఏమవుతుంది అని రుక్మిణి ఆదిత్యతో అనడం మాధవ్ వింటాడు. చిన్న బిడ్డ దేవమ్మ ఇంటికి వస్తుందనే తప్పుగా అర్థం చేసుకుంది ఇప్పుడు నువ్వు ఇలా వచ్చావంటే ఊరుకుంటుందా? అని రుక్మిణి తన మనసులో ఉన్న భయాన్ని బయటపెడుతుంది.


Also Read: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి