Heart Attack: పిడికెలంత గుండె కొట్టుకుంటేనే ప్రాణం నిలబడేది. రోజుకు లక్షసార్లు, నిమిషానికి 72 సార్లు కొట్టుకునే ఈ గుండె పనితీరులో ఏదైనా తేడా వచ్చినా, రక్తం, ఆక్సిజన్ వంటివి సరిగా అందకపోయి గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. కొందరికి కాస్త మైల్డ్‌గా వస్తుంది,వీరు కోలుకుని  తిరిగి సాధారణ జీవితం గడపగలరు. వీరికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం. 


గుండెపోటు రాకముందు, వచ్చాక కూడా కొవ్వు అధికంగా ఉంటే పదార్థాలు తగ్గించాలి. వెన్న తీసిన పాలు, గుడ్డులోని తెల్లసొన, చికెన్, చేపలు, చిక్కుళ్లు, పప్పులతో వండిన  పదార్థాలు అధికంగా పెట్టాలి. ప్రొటీన్లు అధికంగా ఉంటే ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వల్ల మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. గుండె ఆరోగ్యానికి ఏ ఆహారాలు మంచివో వైద్యుడిని అడిగి తెలుసుకుని మరీ తినాలి.  ముఖ్యంగా ఉప్పును తగ్గించాలి. ఉప్పును తగ్గించడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అది కూడా అన్నీ తాజాగా ఉండేలా చూసుకోవాలి. 


ఒమెగా 3 ఆమ్లాలు...
గుండెకు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మేలు చేస్తాయి. అవి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, బాదం పప్పులు, అవిసె గింజలు, వాల్‌నట్స్ వంటి వాటిలో ఇవి అధికంగా ఉంటాయి.వీటిని రోజూ ఓ గుప్పెడు తినడం వల్ల 
గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 


ఇవి వద్దు
రెడ్ మీట్, కొవ్వు అధికంగా ఉంటే మాంసం, నెయ్యి, డాల్డా, వెన్న, ప్యాక్ చేసి నిల్వ చేసిన ఆహారాలు, కేకులు వంటి బేకరీ ఉత్పత్తులు దూరంగా పెట్టాలి. వీటిని తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి ప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే వేపుళ్లు తగ్గించాలి. గ్రిల్డ్, బేకింగ్, రోస్టింగ్ చేసిన ఆహారాన్ని తినకూడదు. అలాగే రోజూ వ్యాయామం చేయాలి. కనీసం అరగంట పాటూ వాకింగ్ చేయాలి. అలాగే గుండెకు మేలు చేసే తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవాలి. 


పండ్లలో నిమ్మ, నారింజ, బత్తాయిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. టమోటా, క్యారెట్, బొప్పాయిని తినాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. 


Also read: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి


Also read: ఒంటరితనం డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని పెంచేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.