ఇంటి పనులు, ఉద్యోగాల్లో పడి మహిళలు తమ ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా ఉంటున్నారు. అందుకే 40 ఏళ్లు రాగానే ఎక్కువ మంది మహిళలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. బ్రిటిష్ కి చెందిన మూడవ వంతు మంది మహిళలు మధుమేహం, గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో జీవిస్తున్నారు. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ శారీరక శ్రమ తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. 40 ఏళ్లు పైబడిన మహిళలు టం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ కీలకమైన పరీక్షలు చేయించుకోవాలి.  


డాక్టర్‌తో చెకప్ తప్పనిసరి


ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పని సరిగా ముందు డాక్టర్‌తో చెకప్ చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందే. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఊబకాయం, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, మద్యం సేవించడం వంటి అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు పలకరిస్తాయి. సరైన సమయంలో వాటిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే అవి దీర్ఘకాలిక సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. ఈ చెకప్ లో రక్తపరీక్షలు మీ శరీరంలోని అవయవాల పనితీరుకి సంబంధించి పరీక్షలు ఉంటాయి.


మధుమేహం


గతంలో అయితే వయసు మళ్లిన వారిలోనే ఎక్కువగా మధుమేహం కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే మధుమేహం వచ్చేస్తుంది. పురుషుల్లో కంటే ఎక్కువగా మహిళలే మధుమేహంతో బాధపడుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో 40 శాతం మంది మధుమేహం బారిన పడినట్లు కొత్తగా చేసిన పరిశోధనలో తేలింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది మధుమేహ బాధితులు ఉండే అవకాశం ఉంది. అధిక దాహం, తరచూ మూత్ర విసర్జన, మైకం, బరువు తగ్గడం, అస్పష్టంగా దృషి లోపం వంటి లక్షణాలు కొత్తగా మధుమేహం బారిన పడుతున్న వారిలో కనిపిస్తున్నాయి.


రొమ్ము క్యాన్సర్


ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రొమ్ము క్యాన్సర్. రొమ్ములో కొత్తగా గడ్డలు కనిపిస్తే అసలు అశ్రద్ధ చేయడం శ్రేయస్కరం కాదు. మహిళలు తరచూ తమ బ్రెస్ట్ చెక్ చేసుకోవాలి. వాటి ఆకృతిలో అనుమానం కలిగినా, కొత్తగా గడ్డలు ఏర్పడినట్టు అనిపించినా వెంటనే వైద్యులని సంప్రదించాలి. వంశరపారపర్యంగా కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.  


గర్భాశయ క్యాన్సర్


బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత మహిళల్లో ఎక్కువగా కనిపించేది గర్భాశయ క్యాన్సర్. 30 నుంచి 50 ఏళ్ల మధ్య మహిళల్లో ఇది ఎక్కువగా వస్తుంది. గర్భాశయ స్పెర్మ్ తీసుకుని పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధి నిర్థారణ తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలో గర్భాశయంలోని కణాలలో మార్పులకి కారణం అయ్యే కొన్ని రకాల hpv కనిపిస్తే అది ప్రమాదకరం కాకుండా చూసుకోవాలి. ఈ కణాలు గర్భాశయ క్యాన్సర్ గా మారడానికి ముందే వాటిని గుర్తించి చికిత్స తీసుకోవాలి.


పేగు క్యాన్సర్


ఇటీవల కాలంలో పేగు క్యాన్సర్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. మలంలో రక్తం కనిపించడం, తరచూ కడుపు నొప్పి, పేగుల్లో మంట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త వహించాలి. 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా పేగు క్యాన్సర్ వస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 



Also read: ఇద్దరు అమ్మాయిలు - రెండు శునకాలు, రెండో శునకం కనిపించిందా? ఎక్కడుందో వెతికి పట్టుకోండి


Also read: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?