ABP  WhatsApp

Watch Video: ఆ వాచ్ విలువ రూ.27 కోట్లు- అవాక్కయ్యారా? ఇదీ సంగతి!

ABP Desam Updated at: 07 Oct 2022 11:47 AM (IST)
Edited By: Murali Krishna

Watch Video: ఆ వాచ్ విలువ అక్షరాలా రూ.27 కోట్లు. అవును అంతటి ఖరీదైన వాచ్‌ను అక్రమంగా తరలిస్తోన్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

ఆ వాచ్ విలువ రూ.27 కోట్లు- అవాక్కయ్యారా? ఇదీ సంగతి!

NEXT PREV

Watch Video: సాధారణంగా ఓ వాచ్ విలువ ఎంత ఉంటుంది? వేలల్లో ఉంటుంది, మరీ రిచ్ అయితే లక్షల్లో ఉంటుంది. కానీ వాచ్ విలువ రూ.27 కోట్లు అంటే నమ్ముతారా? అవును దిల్లీ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తోన్న ఓ వాచ్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ వాచ్ విలువ అక్షరాలా రూ.27 కోట్లు. 


షాక్!


అత్యంత ఖ‌రీదైన చేతి గడియారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న వాచీల్లో ఒకటి బంగారంతో వజ్రాలు పొదిగినదని, దాని విలువ రూ.27.09 కోట్లు అని అధికారులు గురువారం తెలిపారు. 



విలువ పరంగా చూస్తే మేం పట్టుకున్న అతిపెద్ద విలాసవంతమైన వస్తువుల్లో ఇది ఒకటి. ఈ వాచీల విలువ దాదాపు 60 కిలోల బంగారంతో సమానం. దుబాయ్ నుంచి మంగళవారం ఇక్కడికి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర ఇవి దొరికాయి.     





                               -   జుబైర్ రియాజ్ కమిలి, కస్టమ్స్ కమిషనర్ 


ఇలా దొరికాడు!


సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీ చేసినపుడు ఈ వాచీలు బయటపడ్డాయి. నిందితుడు భారత పౌరుడు. అతని వద్ద మొత్తం ఏడు చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  స్వాధీనం చేసుకున్న గడియారాల్లో జాకబ్ & కో (మోడల్: BL115.30A), పియాజెట్ లైమ్‌లైట్ స్టెల్లా (SI.No.1250352 P11179), రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచ్యువల్ డేట్ జస్ట్ బ్రాండ్లకు చెందిన ఈ వాచీలు అత్యంత ఖరీదైనవి.


వాటిలో  జాకబ్ అండ్ కంపెనీ(మోడల్ బిఎల్115.30ఎ) విలువ రూ. 27.09 కోట్లని తెలిపారు. ఏడు రిస్ట్ వాచీలతోపాటు వజ్రాలు పొదిగిన బంగారం బ్రేస్‌లెట్, ఒక ఐఫోన్ పిఆర్‌ఓ 256 జిబి కూడా ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.28.17 కోట్లని ఆయన చెప్పారు. వాచీలను స్వాధీనం చేసుకుని ప్రయాణికుడిని అరెస్టు చేశారు.


నిందితుడు ఓ ట్రావెలర్ కాగా, అతని మామకు దుబాయ్‌లో ఖరీదైన గడియారాల షోరూమ్ ఉందని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని ఇతర ప్రదేశాలలో దీనికి శాఖలు ఉన్నాయని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారి తెలిపారు.


ప్రాణ భయం!


గుజరాత్‌కు చెందిన ఓ క్లయింట్ వీటిని అందచేయాల్సి ఉందని నిందితుడు చెప్పినట్లు సమాచారం. నిందితుడు ఇప్పటి వరకు కస్టమర్ పేరు వెల్లడించలేదని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పాడని తెలిపారు. 



దిల్లీ విమానాశ్రయంలో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు భారీ ట్రాఫిక్ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ ఈ వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్న‌ారు. దిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్న క‌స్ట‌మ‌ర్‌కు ఈ వ‌స్తువుల‌ను అందించాల‌ని నిందితుడు చెప్పాడు. కానీ ఇప్పటి వరకు కస్టమర్ పేరు వెల్లడించలేదు. తనకు ప్రాణ భయం ఉందని చెప్పాడు.                                      -   సూర్జిత్ భుజ్‌బల్, దిల్లీ కస్టమ్స్ జోన్ చీఫ్ కమిషనర్ 

Published at: 07 Oct 2022 11:47 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.