టీ, కాఫీ వంటి పానీయాల దగ్గర నుంచి డెజర్ట్ వరకు చక్కెర లేకుండా ఏది రుచి రాదు. తీపి పదార్థాల్లో చాలా మంది బెల్లం కంటే చక్కెరకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. చక్కెర ఎక్కువ ఉన్న ఆహారాలు గ్లైసెమిక్ ఇండెక్స్ కిందకి వస్తాయి. ఇవి మధుమేహం, స్థూలకాయాన్ని ఎక్కువగా అభివృద్ధి చేస్తాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చివరికి మనం తీసుకునే వైట్ రైస్ లో కూడా చక్కెర కంటెంట్ ఉంది. అందుకే మధుమేహులు తెల్ల అన్నం తక్కువగా తినాలని వాటికి బదులు వేరే వాటిని తినమని వైద్యులు సూచిస్తున్నారు.


ఆహారం నుంచి చక్కెరని పూర్తిగా తొలగించడం కష్టం. అందుకే తెల్ల పంచదారకి బదులుగా బ్రౌన్ షుగర్ ఉపయోగించవచ్చని అంటున్నారు. తెల్ల పంచదార కంటే ఇది కొన్ని అదనపు ఖనిజ లవణాలను అందిస్తుంది. ముఖ్యంగా దీన్ని తీసుకోవడం వల్ల కాల్షియం అందుతుంది. అయితే వీటిని తీసుకోవడం వల్ల ప్రత్యేకంగా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉండవని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ కంటే ఎక్కువ ఖనిజాలు కలిగి ఉన్నప్పటికీ రుచి, రంగు, పరిమాణం తప్ప వేరే మార్పులు ఏమి ఉండవు.


బ్రౌన్ షుగర్ భిన్నంగా ఎలా ఉంటుంది?


మొలాసిస్‌ అనే దాని వల్ల బ్రౌన్ షుగర్ గోధుమ రంగులో ఉంటుంది. ఇది సహజంగా ఉత్పత్తి చేయబడుతుంది. బేకింగ్ వంటకాల్లో బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ కంటే మెరుగ్గా ఉంటుంది. బ్రౌన్ షుగర్ అరేన్, కెలాపా, సివాలన్ వంటి తాటి మొక్కల నుండి వస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్, జింక వంటి కొన్ని ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది కొంతవరకి ఆరోగ్యానికి మంచే చేస్తుంది. మినరల్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని అది పూర్తిగా ఆరోగ్యం అని అతిగా తీసుకుంటే మాత్రం అనార్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


ఎంత మోతాదులో తీసుకోవాలి?


ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులకి ప్రధాన కారణం చక్కెర అని వైద్యులు స్పష్టం చేశారు. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చక్కెరని మితంగా మాత్రమే తీసుకోవాలి. మహిళలు రోజుకి 6 టీ స్పూన్ల కంటే ఎక్కువ చక్కెర తినకూడదు.ఇక పురుషులు 9 టీ స్పూన్లకి మించి లేదా 150 కేలారీల పరిమితి దాటకూడదని నిపుణులు వెల్లడించారు. పానియాల రూపంలో అయితే 2 టేబుల్ స్పూన్లు చక్కెర సిఫార్సు చేయబడింది.


పంచదార వల్ల అనర్థాలు


బ్రౌన్ షుగర్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రత్యేక దుష్ప్రభావాలు లేవు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అధికంగా తీసుకుంటే ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మితంగా తీసుకుంటే మాత్రం సురక్షితంగా ఉపయోగాలు అందిస్తుంది. అలాగే అతిగా తినడం వల్ల అధిక బరువు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!


Also Read: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు