నలో చాలా మంది నిద్ర త్వరగా లేవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకు కారణాలు లేకపోలేదు పని ఒత్తిడి, రాత్రి లేట్ గా నిద్రపోవడం, నిద్రపోకుండా ఫోన్ ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వంటి కారణాల వల్ల పొద్దునే నిద్ర సమయానికి లేవలేకపోతాం. ఇలా చేయడం వల్ల మన శరీర పనితీరు మందగిస్తుంది. దాని వల్ల మనం శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రపోవడం, నిద్రలేవడం సరైన సమయానికి జరగకపోతే అది మన శరీరంలోని జీవగడియారాన్ని తారుమారు చేయడంతో పాటు దాని ప్రభావం మన మెదడు మీద పడుతుంది. ఈ గడియారం సక్రమంగా లేకపోతే మన ఆకలి, మానసిక పరిస్థితి, చురుకుదనం, శరీర అవయవాల పని తీరుని మందగించేలా చేస్తుంది. దీని వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది.


మన జీవ గడియారానికి అంతరాయం కలిగిస్తే అది మన జీర్ణక్రియని దెబ్బతీస్తుంది. సరైన సమయానికి నిద్రలేవకపోవడం వల్ల మన శరీరం ఎలాంటి సమస్యలని ఎదుర్కొంటుందనే దాని మీద పలు అధ్యయనాలు కూడా జరిగాయి. జీవగడియారం గాడితప్పితే వచ్చే అనార్థాలేంటో చూద్దాం..


మయోకార్డినల్ ఇన్ ఫ్రాక్షన్(హార్ట్ ఎటాక్): మీరు నైట్ షిఫ్ట్ లో పని చేస్తూ ఒక్కసారిగా మార్నింగ్ షిఫ్ట్ కి మారుతున్నారా? అయితే మీరు జాగ్రతగ్గా ఉండాల్సిందే. ఇలా చేయడం వల్ల గుండె నొప్పి వచ్చే సూచనలు ఎక్కువగా ఉనాయని అధ్యయనాలు చెప్తున్నాయి.


మధుమేహం: ఒక్కసారిగా మన జీవ గడియారంలో వచ్చే మార్పుల వల్ల మనం మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయిని అంటున్నారు నిపుణులు. దీని వల్ల మన రక్తంలో ఉండే చక్కెర స్థాయిలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి.


జ్ఞాపకశక్తి మందగింపు: బ్రెయిన్ నుంచి శరీరానికి వెళ్ళే సంకేతాలు తారుమారు అవుతాయి. అంతే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మందగిస్తుంది.  మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నిద్ర లేవగానే ఉత్సాహంగా ఉండలేము. నీరసంగా ఉంటుంది.


ఒత్తిడి: శరీర గదీయరంలో మార్పులు వస్తే అది మన మీద తీవ్ర ఒత్తిడి చూపిస్తుంది. ఏ  పని మీద శ్రద్ధ చూపించలేము. కాసేపు పని చేస్తేనే తీవ్ర అలసటకి గురైపోతాం. ఏకాగ్రత దెబ్బతినడంతో పాటు అనేక సమస్యలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రాత్రి వేళ మన శరీరం నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల బాగా నిద్రపడుతుంది. పొద్దునే దాని ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మెదడు వేగంగా పనిచేస్తుంది.


Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?


Also Read: తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లను కొనొచ్చా? ఏయే రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి?