ప్రమాదకరమైన రోగాల్లో బై పొలార్ డిజార్డర్ ఒకటి. దీని వల్ల మనసు కకావికలం అయిపోయి ఒక్కోసారి ఉన్మాదిలా మారి ఇతరులకు హాని చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా బయట పడిన అధ్యయనం ఈ వ్యాధి గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టింది. బైపొలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు యాక్సిడెంట్లు, హింస, ఆత్మహత్య వంటి కారణాల వల్ల చనిపోవడానికి 6 రెట్లు ఎక్కువగా ఇష్టపడతారట. అంటే బలవంతంగా తమ ప్రాణాలు తామే తీసుకోవడంలో ఆనందం వెతుక్కుంటున్నారు. గుండె, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి శారీరక అనారోగ్యాల వల్ల చనిపోయే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. ఇక ఆల్కహాల్ దీనికి మరింత ప్రమాదాన్ని జోడిస్తుందని ఫిన్నిష్ అధ్యయనం కనుగొంది.


బైపొలార్ డిజార్డర్ తో బాధపడుతున్న వ్యక్తులు అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఎదుర్కొంటారు. ఫిన్ ల్యాండ్ లోని ఒక హాస్పిటల్, ఇతర సంస్థల పరిశోధకులతో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. వాళ్ళు ఈ వ్యాధితో బాధపడుతున్న 47,018 మంది వ్యక్తుల్ని పరిశీలించారు. 2004-2018 వరకు వారిని పర్యవేక్షించారు. వీరిలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. బైపొలార్ తో బాధపడుతున్న వాళ్ళు బాహ్య కారణాల వల్ల మరణించే ప్రమాదం 6 రెట్లు శారీరక అనారోగ్యాల వల్ల 2 రెట్లు ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంది. మరణ సమయంలో వారి వయసు 50 సంవత్సరాలుగా ఉంటుంది. దాదాపు మూడింట రెండు వంతుల మంది పురుషులు ఉంటున్నారు.


ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన 3300 మరణాల్లో 2027 మంది అంటే 61 శాతం భౌతికంగా, 39 శాతం ఇతర ప్రమాద కారణాల వల్ల సంభవించినవే. శారీరకంగా మరణించిన వారిలో ఆల్కహాల్ ఎక్కువగా కారణమైంది. వీటిలో కాలేయ వ్యాధి దాదాపు సగం వరకు ఉంది. మిగిలిన భౌతిక మరణాలు గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, శ్వాస కొస వ్యాధి, మధుమేహం ఇతర కారణాల వల్ల సంభవించినట్టు పరిశోధకులు కనుగొన్నారు. బాహ్యంగా సంభవించే మరణాలలో ఆత్మహత్యలే ఎక్కువగా చనిపోతున్నారు. వీటిలో దాదాపు సగం బైపొలార్ డిజార్డర్ కి చికిత్స చేసేందుకు ఉపయోగించిన ఔషధాలు అధిక మోతాదు కారణంగా సంభవించాయి.


బైపొలార్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు ఎప్పుడు ఏ విధంగా ప్రవరిస్తారో చెప్పడం చాలా కష్టం. ఒక టైమ్ లో ఉన్న మూడ్ కొన్ని క్షణాల్లోనే మారిపోతుంది. ఉన్మాద లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్ళకి వాళ్ళు హాని చేసుకోవడానికి ఇష్టపడతారు. అందుకే ఈ వ్యాధితో ఉన్న వాళ్ళు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: బాదం Vs వేరుశెనగ: ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఎంపిక


Join Us on Telegram:https://t.me/abpdesamofficial