రైస్ పేపర్.. చూడటానికి చాలా పల్చగా ఉంటుంది. టిష్యూ లాగానే కనిపిస్తుంది కానీ దానికంటే కూడా ఇంకా పల్చగా ఉంటుంది. ఆసియా వరి మొక్క పై తొక్క నుంచి తయారు చేస్తారు. బియ్యం మాత్రమే కాదు రైస్ పేపర్ ని మల్బరీ, జనపనార వంటి అనేక ఇతర మొక్కల నుంచి కూడా తయారుచేస్తారు. ఇది చాలా సన్నగా, మెత్తగా, తేలికగా ఉంటుంది. తొక్కతో చేసే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అలంకార వస్తువులను తయారు చేయడం, ఆహారాన్ని రోల్స్ గా చేసే డానికి ఈ రైస్ పేపర్ ని ఉపయోగిస్తారు. దీన్ని వివిధ రకాల వంటలలో కూడా ఉపయోగించవచ్చు. ఇందులో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది వంటలకు మంచి ఆకృతి ఇవ్వడమే కాదు రుచిని కూడా జోడిస్తుంది.


ఎలా ఉపయోగించాలి?


సూపర్ మార్కెట్స్ లో ఈ రైస్ పేపర్ కొనుగోలు చేసుకోవచ్చు. సన్నగా, రౌండ్ షేప్ లో కనిపిస్తుంది. ఎండబెట్టిన రైస్ పేపర్స్ విక్రయిస్తారు. అవి గట్టిగా ఉంటాయి. వాటిని మృదువుగా చేయడం కోసం ముందుగా వాటిని రీహైడ్రేట్ చేయాలి. ఒక గిన్నెలో చల్లని లేదా వెచ్చని నీటిని తీసుకుని అందులో ఈ రైస్ పేపర్ ఉంచాలి. తడి తగలడం వల్ల ఆ షీట్ మెత్తగా అవుతుంది. ఎక్కువగా నీటిని పీల్చుకుందని అనిపిస్తే దాన్ని 1-2 నిమిషాల పాటు గాలికి ఆరబెట్టాలి. లేదంటే కిచెన్ టవల్ కాసేపు దాని మీద ఉంచినా ఆరిపోతుంది. తర్వాట వాటిని కావలసిన ఆకారంలోకి మౌల్డ్ చేసుకోవచ్చు.


వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలను తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దోసకాయ, క్యారెట్ వంటి తాజా కూరగాయాలని ఇందులో పెట్టుకుని స్ప్రింగ్ రోల్స్ లా చేసుకుని తినొచ్చు. చేపలు లేదా చికెన్ స్ట్రీమ్ చేసుకోవడానికి కూడా దీన్ని వాటికి చుట్టుకోవచ్చు. కుడుములు, సమోసాలతో పాటు ఇతర రుచికరమైన స్నాక్స్ చేసేందుకు వాటి మీద దీన్ని లేయర్ లాగా ఉపయోగించుకోవచ్చు. సాండ్ విచ్, బర్రిటోక కోసం చుట్టడానికి కూడా ఈ రైస్ పేపర్ ను ఉపయోగించుకోవచ్చు. సుషీ కోసం కూడా  చాలా మంది దీన్ని వినియోగిస్తారు.


ఆర్ట్, క్రాఫ్ట్ గా


ఇది సాంప్రదాయకంగా ఆసియా చేతి పనులు, కళలతో ముడిపడి ఉంది. జపాన్, చైనా వంటి దేశాల్లో దశాబ్దాలుగా దీన్ని కళాకృతికి సంబంధించిన పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఎక్కువ మంది కళాకారులు వీటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తారు. పారదర్శకంగా ఉండటం వల్ల మెరుస్తూ కనిపిస్తుంది. దీన్ని ఆహారంతో పాటు కలిపి తీసుకోవచ్చు. ఇది తినదగిన పదార్థం. చక్కగా స్ప్రింగ్ రోల్స్, సాండ్ విచ్ రోల్స్, చికెన్ రోల్స్ ని వీటితో కలిపి చుట్టేసుకుని తినొచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఉపవాసం ఆరోగ్యానికి మంచిదేనా? ఆయుష్షు పెంచుతుందా? అధ్యయనంలో ఏం తేలింది?