ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతొంది. కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి చేసిన ప్రకటన తరువాత మంత్రి కాకాణి దానికి కౌంటర్ ఇవ్వటం, ఆ తరువాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహరంలో కామెంట్స్ చేశారు. దీనిపై ఘాటుగా రియాక్ట్ అయిన కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి నేరుగా ఆధారాలు ఇవిగో అంటూ ఇంటలిజెన్స్ చీఫ్‌ నెంబరే మీడియాకు చూపించారు. ఆయనతో జరిగిన సంభాషణను మీడియాకు వినించారు. 


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్...


ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశం తీవ్ర కలకలం రేపింది. పార్టీకి మొదటి నుంచి నమ్మిన బంటుగా ఉన్న కోటం రెడ్డి నుంచే ఇలాంటి కామెంట్స్ రావటంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అవి కాస్త ఇప్పుడు అధికార పార్టీలో మరింత ముసలాన్ని రాజేసేలా కనిపిస్తున్నాయి. తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నానని, ఆధారాలుకూడా కోటం రెడ్డి బయటపెట్టారు. 


ట్యాప్ చేసేందుకు ఏకంగా అధినాయకత్వమే ప్రయత్నించిందని ఆరోపించారు. కోటం రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటూ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి లైట్ తీసుకునే ప్రయత్నం చేసి, వాటిని డైవర్ట్ చేయటానికి చేసిన ప్రయత్నం కూడ కోటం రెడ్డి అంతే స్పీడ్ గా కౌంట్ ఇచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం ఈ ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు యత్నించినా కోటం రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. నమ్మకం లేని చోట ఉండలేమంటూ కోటం రెడ్డి చేసిన కామెంట్స్‌ వైరల్ కావటంతో, రాజకీయంగా ఈ వ్యవహరం మరింత హీట్ ను రాజేసింది.


అప్పుడు ...ఇప్పుడు....


ఫోన్ ట్యాపింగ్‌ల వ్యవహరం రాజకీయాల్లో కోత్తేమి కాదు. అయితే అధికార పార్టీలో అందులోనూ వైసీపీకి చెందిన నేతలు తమ సొంత పార్టీకి చెందిన నేతలు, ప్రభుత్వంలోని అధికారులపై విమర్శలు గుప్పించటం హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ రాజు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు. ఆయన ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ ఎంపీగానే కొనసాగుతున్నారు. దీంతో ఈ వ్యవహరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరకాటంగానే మారింది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఆనం రాంనారాయణ రెడ్డి కూడా మద్దతు పలికారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు. 


పార్టీ నేతల్లో చర్చ...


తాజా రాజకీయ పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ కు సంబందించిన అంశంపై దుమారం రేగిన తరువాత, నాయకులు సైతం కొంత అసహనానికి గురవుతున్నారు. ఎవరెవరు ఎవరితో ఫోన్ లో మాట్లాడారు అనే విషయాలు బయటకు వస్తాయనే సందేహాలు, అనుమాలు పార్టీ నేతల్లో సైతం చర్చ జరుగుతుంది. పార్టీకి చెందిన నేతలు ఎవరు కలుసుకున్నా, నవ్వుతూనే, సెటైర్లు వేసుకుంటున్నారు. ఇంతకీ అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటూ, చివరల్లో ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే, తాము ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి భయం ఏంటని కొందరు నేతలు అంటుంటే, అసలు అలాంటి పరిస్థితి రాదని ఇంకొందరు నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఎన్నికల సమయం కావటంతో ఇలాంటి పరిస్థితులు పార్టీ నేతలకు ఇరకాటమేనని మరి కొందలు వాదిస్తున్నారు.


టీడీపీ హయాంలో కూడా....


టీడీపీ హాయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వైసీపీ నేతలు తెరమీదకు తెస్తున్నారు. పెగాసెస్ వంటి సాఫ్ట్ వేర్ కొనుగోలుపై ఇప్పటికే హౌస్ కమిటి వేయటం, ఆ కమిటి నివేదికను కూడా సమర్పించిన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగి ఉంటే అదంతా కేంద్రం పరిధిలో ఉండే వ్యవస్ద కాబట్టి, పార్టీకి ఏం సంబంధం ఉంటుందని కూడా నేతలు తమ అభిప్రాయపడుతున్నారు.