What Happens to Your Body When You Walk Every Day: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఫిట్ గా ఉండాలి. అలా ఫిట్ గా ఉండాలంటే.. ఎక్సర్ సైజ్ కచ్చితం. కానీ, చాలామంది హై ఇంటెన్స్ వర్కౌట్స్ చేయలేరు. అలాంటి వాళ్లు వాకింగ్ చేస్తే మంచిదని చెప్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. వాకింగ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని, వాకింగ్ చేయడం చాలా ఈజీ కూడా అని సూచిస్తున్నారు. బయటికి వెళ్లి వాకింగ్ చేయడం కుదరని వాల్లు ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేసినా మంచి లాభాలే ఉంటాయని, హెల్దీగా ఉంటామని అంటున్నారు. మరి వాకింగ్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఒకసారి చూద్దాం.
కేలరీలు కరిగిపోతాయి..
ప్రతి రోజు వాకింగ్ చేయడం వల్ల కేలరీలు ఎక్కువగా కరుగుతాయని అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జాగింగ్ చేయడం కంటే వాకింగ్ చేస్తేనే ఎక్కువ కేలరీలు కరుగుతాయని చాలా రిసెర్చ్ ల్లో తేలింది. మీరు ప్రతిరోజు చేసే ఎక్సర్ సైజ్ లకి, వర్కౌట్స్ కి వాకింగ్ జత చేస్తే కేలరీలు ఎక్కుగా కరుగుతాయి అని ఇంటర్నేషనల్ పర్సనల్ ట్రైనర్ అకాడమీ వెల్లడించింది.
కొవ్వు కరిగిపోతుంది..
వాకింగ్ చేయడం వల్ల కేలరీలు కరగడమే కాకుండా.. ఒంట్లోని కొవ్వు కూడా కరిగిపోతుంది. అయితే, అది మనం తినే తిండిని బట్టి కూడా ఉంటుందని అని చెప్తున్నారు నిపుణులు.
కండరాలు దృఢంగా అవుతాయి..
వాకింగ్ చేసినప్పుడు వివిధ కండరాలు పనిచేస్తాయి. దానివల్ల అవి గట్టిపడి దృఢంగా తయారు అవుతాయి. ముఖ్యంగా కాళ్లలోని కండరాలు, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి.
బీపీ తగ్గిస్తుంది...
ప్రస్తుతం చాలామందిలో బీపీ సమస్య ఉంది. అయితే, రోజు వాకింగ్ చేస్తే ఆ సమస్య తగ్గుందని అంటున్నారు. బీపీ కంట్రోల్ లో ఉండటం వల్ల హార్ట్ బాగా పనిచేస్తుందని, ప్రతి రోజు చేసే ఎక్సర్ సైజ్ లకి వాకింగ్ యాడ్ చేస్తే బ్లడ్ ప్రజర్ కంట్రోల్ ఉంటుందని రిసెర్చ్ లో తేలినట్లు నిపుణులు చెప్పారు.
ఎముక సాంద్రత పెరుగుతుంది..
ఎముక సాంద్రత పెరగాల్సిన వాళ్లు వాకింగ్ చేస్తే మంచిది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. పోస్ట్ మెనోపాస్ లో ఉన్న మహిళలు రోజు వాకింగ్ చేస్తే వాళ్ల ఎముక సాంద్రత బాగా పెరుగుతుంది. వాకింగ్ చేస్తే రేట్ ఆఫ్ బోన్ లాస్ తగ్గుతుందని, అస్థిపంజర సమగ్రత కూడా పెరుగుతుంది.
వర్క్ డే లో, అదే పనిగా కూర్చుని పని చేసేవాళ్లు కచ్చితంగా వాకింగ్ ని మెరుగుపరుచుకోవాలి. దాని వల్ల పోస్టురల్ కండరాల్లు బలపడతాయి. నిలబడినప్పుడు, నడిచినప్పుడు పోశ్చర్ కండరాళ్ల సపోర్ట్ కావాలి. కాబట్టి అవి స్ట్రాంగ్ అవ్వాలంటే కచ్చితంగా వాకింగ్ చేయాల్సిందే.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు అధ్యయనాలు, జర్నల్స్ నుంచి సేకరించిన అంశాలను యథావిధిగా ఇక్కడ అందించాం. ఇలాంటి సమస్యలపై నిపుణులను సంప్రదించాలని మనవి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’ లేదా ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.