ప్రపంచంలో వింత వింత మనుషులు కనిపిస్తుంటారు. వారు చేసే వింత పనులు సైతం ఒక్కోసారి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొస్తాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం సౌతాఫ్రికా యువతి అచ్చం ఇలాంటి పనే చేసింది. తను సాధించిన ఈ అరుదైన ఫీట్ చూస్తూ వావ్.. అంటూ ఆశ్చర్యపోవాల్సిందే!


సాధారణంగా ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలకు మంచి గుర్తింపు వచ్చేందుకు ఫుడ్  వేగంగా తినే పోటీలను ఏర్పాటు చేస్తుంటారు. తక్కువ సమయంలో ఎవరు ఎక్కువ ఫుడ్ తిన్న వారినే  విజేతగా ప్రకటిస్తారు. సాధారణంగా చికెన్ తినే పోటీలు కూడా నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఈ పోటీల్లో పాల్గొన్న వారు క్షణాల్లో కోడిని లాగించే వారిని కూడా చూసే ఉంటారు. కానీ, కేవలం కోడి కాళ్లు మాత్రమే తినే పోటీని ఎప్పుడైనా చూశారా? అదీ ఉడకబెట్టిన కాళ్లను మాత్రమే తినడం. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. ఓ సౌతాఫ్రికా యువతి ఒక్క నిమిషంలో ఏకంగా మూడున్నర కోడి కాళ్లను కసకస నమిలేసి గిన్నిస్ రికార్డు దక్కించుకుంది.   


సౌతాఫ్రికాకు  చెందిన ఉయోల్వేతు సిమానైల్ అనే మ‌హిళ కోడి కాళ్లు తిన‌డంలో ప్ర‌పంచ రికార్డును నెలకొల్పింది.  ఒకే ఒక్క నిమిషంలో ఆమె మూడున్న‌ర కోడి కాళ్లు తిని గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది.  స్టంబో రికార్డు బ్రేక‌ర్స్ అనే ఎపిసోడ్‌ లో భాగంగా సిమానైల్‌ తో పాటు మ‌రో ముగ్గురు యువతులు  కోడి కాళ్లు తినే పోటీలో పాల్గొన్నారు.  ఈ పోటీలో సిమానైల్  ఒక్క నిమిషంలో మూడున్న‌ర కోడి కాళ్ల‌ను నమిలి మింగేసింది. మిగ‌తా ముగ్గురిలో ఏ ఒక్క‌రూ ఆమె తిన్న దాంట్లో సగం కూడా తినలేకపోయారు.


నీడ కాదు మనిషే, తెల్లగా మల్లెపువ్వులా ఉండేవాడు ఇలా మారిపోయాడు, ఎందుకో తెలుసా?


డ‌ర్బ‌న్‌  ఉమ్లాజీ ఏరియాలోని  మ‌షాంప్లేన్స్ లాంజ్ రెస్టారెంట్ అండ్ బార్‌ లో ఈ పోటీ జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న వారికి  ఇచ్చిన ఒక్కో కోడి కాలు 35 గ్రాముల బ‌రువును కలిగి ఉంది. దీన్ని బట్టి చూస్తే  సిమానైల్ నిమిషంలో దాదాపు 120 గ్రాములకు పైగా  కోడి కాళ్లు నమిలేసింది అన్నమాట. వాస్తవానికి నిమిషంలో 120 గ్రాముల చికెన్ తినడం సులభమే. కానీ, గట్టి ఎముకలు ఉండే కాళ్లను తినడం అంత ఈజీ కాదు. అంతేకాదు, ప్రతి వేలుకు పదునైన గోళ్ల కూడా ఉంటాయి. వాటిని కొరికి మింగడం సులభం కాదు. ఈ కఠినమైన పోటీలో పాల్గొని ఎక్కువ కోడికాళ్లను తిన్నది కాబట్టే సిమానైల్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది.