మీ రైలు ఆలస్యమైందా? అయితే, ఆ రైలు లోకో పైలట్ (రైలు డ్రైవర్) ఏ చికెనో.. పెరుగో కొనుగోలు చేసేందుకు వెళ్లి ఉండవచ్చు. అదేంటీ.. అలా ఎక్కడైనా జరుగుతుందా? అలా చేస్తే ప్రమాదం కదా అని అంటారా? అలాంటివి ఇండియాలో జరగకపోవచ్చు. కానీ, పాకిస్థాన్‌లో మాత్రం కామన్. ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే.
పాకిస్థాన్‌లోని లాహోర్ నుంచి కన్హా రైల్వే స్టేషన్ మీదుగా కరాచీ వెళ్తున్న రైలు.. మార్గమధ్యలో ఆగింది. సిగ్నల్ ఇవ్వకపోయినా రైలు ఎందుకు మధ్యలో ఆపేశారని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇంతలో ఆ రైలు ఇంజిన్ నుంచి లోకో పైలట్ అసిస్టెంట్ కిందకు దిగాడు. ఆ తర్వాత నేరుగా ఓ షాప్ వద్దకు వచ్చి పెరుగు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ రైలు ఎక్కేశాడు. ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది అలా.. అలా.. చక్కెర్లు కొడుతూ.. అధికారులకు చేరింది. దీంతో ఆగ్రహించిన అధికారులు ఆ లోకో పైలట్‌ను, అతడి అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు.
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్
ఈ వీడియో చూసి.. నెటిజనులు వివిధ కామెంట్లు చేస్తున్నారు. ఇతడు లోకో పైలట్ కాపట్టి సరిపోయింది. అదే విమానం పైలట్ అయితే.. గాల్లో ఆపేసేవాడేమో అని అంటున్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ రైల్వే మంత్రి అజమ్ ఖాన్ స్వాతి స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని, ట్రైన్ డ్రైవర్ రానా మహమ్మద్ షెహజాద్, అతడి అసిస్టెంట్ ఇఫ్తికార్ హుస్సేన్‌లను సస్పెండ్ ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ చోటుచేసుకోకూడదని, జాతీయ సంపదను ఇలా వ్యక్తిగత అవసరాల గురించి వినియోగించకూడదని అన్నారు. పైగా రైలును ట్రాక్స్ మధ్యలో నిలిపేయడమంటే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన విషయమని అన్నారు. భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు. పాక్‌లో ఇలాంటి ఘటనలు ఇదివరకు ఎప్పుడూ చోటుచేసుకోలేదని, ఇదే తొలిసారని ఓ రైల్వే అధికారి మీడియాకు తెలిపారు.
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి