Uncovering the Origins of Vanilla Flavoring : కొందరు వెనిల్లా ఫ్లేవర్​ని చాలా ఇష్టంగా తింటారు. ఐస్​క్రీమ్స్​ నుంచి బిస్కెట్లు, వేఫర్స్ వరకు ఇలా ఏవి తినాలన్నా వెనిల్లా ఫ్లేవర్ కావాలంటూ ఉంటారు. పిల్లలనుంచి పెద్దలవరకు ఈ ఫ్లేవర్​ని చాలా ఇష్టంగా తింటారు. అయితే ఈ ఫ్లేవర్​ని ఏవిధంగా తయారు చేస్తే తెలిస్తే.. అస్సలు దాని జోలికి వెళ్లరు. మరి ఈ ఫ్లేవర్​ని ఎలా తయారు చేస్తారో.. దాని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఆ జంతువునుంచి సేకరిస్తారట.. 


ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్​లో దీనిగురించిన డిస్కషన్ ఎక్కువైంది. వెనీల్లా ఫ్లేవర్​ను బీవర్ అనే జంతువునుంచి సేకరిస్తున్నారనేది దీని సారాంశం. ఈ జంతువునుంచి వచ్చే కాస్టోరియం అనే పదార్థాన్ని సేకరిస్తారు. ఇదే వెనిల్లాకు మంచి వాసనను అందిస్తుందని చెప్తున్నారు. ఈ ఫ్లేవర్స్​ను కుక్కీలు లేదా ఐస్​క్రీమ్​లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కృత్రిమంగా ఉపయోగించే వెనీల్లో ఫ్లేవర్​ను బీవర్​ అనే జంతువునుంచి సేకరిస్తారట. 


వైరల్ అవుతోన్న పోస్టులు


బీవర్​ అనే జంతువు వెనుకభాగం నుంచి గ్లూ వంటి దానిని స్రవిస్తుందట. దీనినే కాస్టోరియం అంటారు. ఈ స్రవం మంచి సువాసనను అందిస్తుందట. అందుకే దీనిని కృత్రిమ వెనీల్లా ఫ్లేవర్​గా వినియోగిస్తున్నారట.  స్వీట్స్​లో, కేక్స్​లో దీనిని ఎన్నో ఏళ్లుగా ప్రజలు తింటున్నారనే పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలా అని ఇది అబ్ధమని చెప్పే వాదనలు కూడా ఏమి లేవు. ఎందుకంటే బీవర్​ల పాయువుల దగ్గర నుంచి తీపి వాసనతో కూడా కాస్టోరియంను విసర్జిస్తాయి. 


ఆ వాసనవల్లే..


ఈ కాస్టోరియం పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుందట. బీవర్స్ పెల్విస్​ నుంచి ఇది వస్తుందట. ఈ జంతువులు నది ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయట. అవి తిరిగే ప్రాంతాల్లో దిబ్బలపై.. ఈ కాస్టోరియంను బీవర్స్ స్రవిస్తాయి. వాటినుంచి వచ్చే వాసనల ద్వారా వాటిని చాలా సులభంగా గుర్తించవచ్చట. అందుకే ఈ జంతువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో వీటిని కొనాలంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుందట. వీటిని వెనీల్లా ఎసెన్స్​లో వినియోగిస్తున్నందుకే అంత డిమాండ్ ఉందంటున్నారు. 


రియల్​గా చెట్ల నుంచి వచ్చే వెనీల్లా ఫ్లేవర్ చాలా అరుదుగా లభిస్తుందట. దానివల్లే ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి మార్కెట్​లో డిమాండ్​ ఎక్కువగా ఉంటుందని ఆహార శాస్త్రాన్ని అధ్యయనం చేసే బ్రైన్ మావర్ కాలేజ్ ప్రొఫెసర్స్ తెలిపారు. అందుకే తక్కువ ధరకు వచ్చే కాస్టోరియంను బీవర్​లనుంచి సేకరించి దానిని స్వీట్స్​కోసం వినియోగిస్తున్నారనే వాదన బలంగా ఉంది. 


ఈ కాస్టోరియం మంచిదేనా?


బీవర్​ స్రవించే కాస్టోరియంను 2000 సంవత్సరాలకు పైనుంచి వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారట. తలనొప్పి, చెవినొప్పి, పంటి నొప్పి, జ్వరం, గట్ సమస్యలను దూరం చేయడానికి దీనిని ఉపయోగిస్తారట. అందుకే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కాస్టోరియంను సేఫ్టీ ఫుడ్​గా తెలిపింది. అయితే బీవర్స్​ నుంచి కాస్టోరియం సేకరించాలంటే కష్టమట. అవి విసర్జిస్తే ఓకే కానీ.. వాటినుంచి సేకరించాలంటే.. జంతువులకు మత్తమందు ఇచ్చి సేకరిస్తారట. చనిపోయన బీవర్స్​ నుంచి కూడా ఈ స్రవాన్ని సేకరిస్తున్నారని నేషనల్ జియోగ్రాఫిక్​కి చెందిన వన్యప్రాణి పర్యావరణ శాస్త్రవేత్త జోవాన్ క్రాఫోర్డ్ తెలిపారు. 



20వ శతాబ్దంలో కాస్టోరియం వినియోగం బాగా తగ్గిందని.. అప్పటినుంచి ఫ్లేవర్ ఎక్స్​ట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. ఇప్పుడు దీనిని స్వీడిష్ మద్యం, ఫుడ్​లలో కనిపిస్తుంది. వెనిల్లాలో 99 శాతం వెనిలిన్ వంటి సింథటిక్ మూలాల నుంచి సేకరిస్తున్నారట. వెనిల్లా గింజలు నుంచి కూడా ఇప్పుడు ఎక్స్​ట్రాక్ట్​ను చేస్తున్నారట. 


Also Read : మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి జిమ్​ కూడా ఓ కారణమేనా? అధ్యయనంలోని షాకింగ్ విషయాలు ఇవే