Male Infertility : ఫెర్టిలిటీ సమస్యలు మగవారిలో.. ఆడవారిలో ఇద్దరిలోనూ ఉంటాయి. అయితే గతంలో ఈ సమస్య కేవలం ఆడవారికే ఉంటుందనుకునేవారు. మగవారు ఈ తరహా టెస్ట్​లు చేయించుకునేందుకు ముందుకు వచ్చేవారు కాకపోవడంవల్ల కేవలం ఆడవారికే ఈ సమస్య ఉన్నట్లు భావించేవారు. అయితే నిపుణుల ప్రకారం ఫెర్టిలిటీ సమస్యలు ఇద్దరిలోనూ ఎక్కువగానే ఉంటాయట. అయితే వివిధ కారణాలవల్ల వంధ్యత్వం కావొచ్చని చెప్తున్నారు. ఈ కారణాల్లో ఫిట్​నెస్ కూడా ఒకటని చెప్తున్నారు. ఎందుకంటే.. 


పురుషుల్లో వంధ్యత్వ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో స్పెర్మ్ కౌంట్​పై ఫిట్​నెస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయంపై జరిపిన అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడమనేది చాలా కామన్ విషయం. అయితే ఫిట్​నెస్ పరిశ్రమలో ఉన్నవారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని పలు అధ్యయనాలు ఇప్పటికే వివరించాయి. 


సంతానోత్పత్తిపై ప్రభావం


జిమ్​లో ఎక్కువ సమయం గడిపేవారిలో ఈ సమస్య వస్తుందని నిపుణులు చెప్తున్నారు. నిపుణలు అభిప్రాయం ప్రకారం యూకేలోని 7 జంటల్లో ఒకరిని వంధ్యత్వం ప్రభావితం చేస్తోందట. యూకేలో జరిపిన అధ్యయనంలో సంతానోత్పత్తి చికిత్స అవసరమైన పురుషుల సంఖ్య భారీగా పెరిగినట్లు గుర్తించారు. మహిళల్లో అయితే లేట్​ ఫ్యామిలీ స్టార్ట్ చేయడం, స్టీమ్ బాత్స్, ల్యాప్ టాప్​లు ఎక్కువగా వినియోగించడమనేది సహజకారణాలుగా మారిపోయాయట. అదే మగవారిలో జిమ్​కి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 



అక్కడ వేడి ఎక్కువైపోవడం వల్లే


స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం.. స్పెర్ప్ కౌంట్ ఎక్కువగా ఉన్నా.. అవి యాక్టివ్​గా లేకపోవడం వంటివి ఎక్కువైనట్లు గుర్తించారు. ఫిట్​నెస్ కోచ్​లు లేదా ఫిట్​నెస్​కి ప్రాధన్యతనిచ్చేవారు ఎక్కువగా టైట్ జిమ్ వేర్ వేసుకుంటారు. లెగ్గింగ్స్, షార్ట్స్ వేసుకుంటారు. జిమ్​లో వర్క్ చేసేవారు సుమారు 12 నుంచి 16 గంటలు జిమ్​లోనే ఉంటారు. వారానికి ఆరు రోజులు అలాంటి దుస్తులే వేసుకుంటారు. ఇలా కంటిన్యూ టైట్​గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల ఆ ప్రాంతంలో వేడి ఎక్కువ అవుతుందని.. ఇది ఫెర్టిలిటీ సమస్యను పెంచుతుందని తెలుసుకున్నారు. 


అలా చేస్తే కంట్రోల్ అవ్వొచ్చు..


మగవారి శరీరంలో దాదాపు హీట్ ఎక్కువగానే ఉంటుంది. రోజులో ఎక్కువగా వర్క్ అవుట్ చేయడం వల్ల మరింత హీట్ జెనరేట్ అవుతుంది. దీనితో వారు యాక్టివ్​గా ఉంటారు కానీ.. ఆ వేడికి స్పెర్మ్ కణాలు కిల్ అయిపోతున్నాయంటూ నిపుణులు చెప్తున్నారు. అయితే జిమ్​కి వెళ్లడాన్ని తగ్గించి.. వదులుగా ఉండే దుస్తులు వేసుకునేవారిలో స్పెర్మ్ సంఖ్య పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. దాని నాణ్యత కూడా పెరిగిందని చెప్తున్నారు. అయితే ఈ అధ్యయనం ప్రకారం అధిక వ్యాయామం స్పెర్మ్ ఉత్పత్తికి హానికరమవుతుందని తెలిసేలా చేసింది. 


టెస్టోస్టెరాన్ థెరపీ..


హైపోథాలమస్ పిట్యూటరీ గోనాడల్ యాక్సిస్ పనితీరు, ఆక్సీకరణ ఒత్తిడిలో పెరుగుదల, మంట వంటివి మగవారిలో ఫెర్టిలిటీకి కారణమవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. వీటివల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల వీర్యం నాణ్యత తగ్గుతుందని.. క్రమంగా అది వంధ్యత్వానికి దారితీస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు టెస్టోస్టిరాన్ సమస్యలు ఎదుర్కొంటున్న వారు టెస్టోస్టెరాన్ రిప్లేస్​మెంట్ థెరపీలు తీసుకోవచ్చని కూడా సూచించారు. 


ఇవి ఫాలో అవ్వాలట


తగినంత నిద్రపోవడం, జింక్, మెగ్నీషియం ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం.. శుభ్రమైన, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే జిమ్​కోసం ఎక్కువ కష్టపడటం కాకుండా.. పరిమితిగా దానిని చేయాలని సూచిస్తున్నారు. అలాగే శరీరంలో కొత్త స్పెర్మ్ క్రియేట్ అవ్వడానికి దాదాపు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఈలోపు లైఫ్​ స్టైల్ ఛేంజ్ చేసుకుంటే ఈ మార్పులు మంచి రిజల్ట్స్ ఇస్తాయని చెప్తున్నారు. 



Also Read : మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లల్లో వైకల్యం తప్పదా? పెళ్లికి ముందు, తర్వాత చేయించుకోవాల్సిన టెస్ట్​లు ఇవే