KFC చికెన్ ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి? కరకరలాడే.. కమ్మని చికెన్ పీసులు తినేకొద్ది తినాలనిపిస్తాయని ఆహార ప్రియులు చెబుతుంటారు. అయితే, ఒక్కోసారి ఊహించని ట్విస్టులు కూడా ఎదురవుతాయి. ఇదిగో ఈ మహిళకు ‘కోడి తల’ వచ్చినట్లు.
అదేంటీ.. కేఎఫ్‌సీలో చికెన్ హెడ్స్ కూడా విక్రయిస్తున్నారా? ఒకసారి టేస్ట్ చూడాలని అనుకుంటున్నారా? కంగారు పడకండి. ఇప్పటివరకు అలాంటిది ఏదో వారి మెనూలో లేదు. ఇటీవల ఇంగ్లాండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గ్యాబ్రిల్లే అనే మహిళ.. కేఎఫ్‌సీ ఔట్‌లెట్‌లో చికెన్ హాట్ వింగ్స్ మీల్‌ను ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత ఎంతో ఆత్రుతతో హాట్ వింగ్స్ బాక్సును ఓపెన్ చేసి తినడం మొదలుపెడితే.. దోరగా వేయించిన కోడి తల కనిపించింది. అంతే.. ఆమెకు ఒక్కోసారే కోడి మొత్తాన్ని తినేసినంత ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత మళ్లీ ఆ మీల్స్‌ను ముట్టుకుంటే ఒట్టు.
ఆ కోపంతో ఆమె ఫ్రైడ్ చికెన్ హెడ్ ఫొటోను తీసి.. ఆ సంస్థకు 2 రేటింగ్ ఇచ్చింది. ఆమె పోస్ట్ వైరల్ కావడంతో ఆ సంస్థ నిర్వాహకులు దిగిరాక తప్పలేదు. అంతేకాదు.. మొత్తం చికెన్ తల మొత్తం ఫుడ్‌లోకి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయింది. ఆమె తమకు 2 స్టార్ ఇవ్వడంలో తప్పులేదని పేర్కొంది. ‘‘మేం ఆ ఫొటో చూసి సర్‌ప్రైజ్ అయ్యాం. ఇది ఎలా జరిగిందో తెలుసుకోడానికి మేం ఆమెను సంప్రదించాం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తాం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకుంటాం. మా సప్లయర్స్, సిబ్బందితో మాట్లాడి ఈ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతాం’’ అని తెలిపాడు. చికెన్ హెడ్ బాధితురాలికి కేఎఫ్‌సీ.. ఫ్రీ ఫుడ్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆమె తన కుటుంబంతో కలిసి తమ టేక్‌ఎవే ప్లేస్, తమ కిచెన్‌లో మీల్స్ ఎలా తయారు చేస్తారో చూడాలని ఆహ్వానించింది. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే.. తిట్టేసి ఊరుకోకండి. సోషల్ మీడియా ద్వారా సంస్థ దృష్టికి తీసుకెళ్తే.. ఆ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క
Read Also: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
Read Also: ఈ ఏడాది మనదేశంలో ఎక్కువ మంది వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే
Read Also: ఏడవండి.. గట్టిగా ఏడ్చి మీ బాధను తగ్గించుకోండి, కొత్తగా ఏడుపు గదుల ప్రాజెక్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి