వేసవి అంటే అందరికీ ఆట విడుపే. పిల్లలకు సెలువులు వచ్చేస్తాయి. మూకుమ్మడిగా హాలిడే మూడ్ లో ఉంటారు. చాలా మంది సమ్మర్ లో ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు. పిల్లలకు సెలవులైపోయే లోగా ఏదో ఒక చోటుకి తిప్పి చూపించుకురావలనే అనుకుంటారు. ఎక్కడికైనా ప్రయాణం అంటేనే రకరకాల జాగ్రత్తలు అవసరమవుతాయి. ప్రయాణం సొంత వాహనంలో అయినా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంటే బస్సు, రైలు, ఫ్లైట్ ఎలా ప్లాన్ చేసుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు, మరికొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి.



  • గమ్య స్థానం చేరిన తర్వాత ఏర్పాట్ల గురించి ఆలోచించడం కాకుండా ముందుగానే అక్కడి బస ఏర్పాట్లు, ఇతర వివరాలు ముందుగా తెలుసుకుని అరేంజ్ చేసుకుని బయలు దేరితే అక్కడకు వెళ్లిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటుంది.

  • ఒక వేళ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగించుకోవాలని అనుకుంటే అందుకు కూడా ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలి. అక్కడ లోకల్ చూడాల్సిన ప్రదేశాలు, పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాతే ప్రయాణ సన్నాహాలు చేసుకోవడం మంచిది.

  • ఎండ వేడికి త్వరగా అలసిపోతుంటారు. ప్రయాణ సమయంలో అలసట మరీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీళ్ల, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

  • వేసవిలో శరీరానికి ఎక్కువ నీరు అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. అయినా సరే నీళ్లు తాగడం మరిచిపోతుంటాము. ప్రయాణాల్లో నీళ్లు తాగడం తరచుగా మరచిపోతుంటాం. అందుకే ప్రయాణంలో మెత్తగా ఉండే కొలాప్సబుల్ వాటర్ బాటిళ్లు వాడుకోవడం మంచిది.

  • కొలాప్సబుల్ బాటిళ్లను నీళ్లున్నంత వరకే మడచి పెట్టుకోవడచ్చు, నీళ్లు అయిపోగానే మడిచి బ్యాగ్ లోకూడా పెట్టేసుకోవచ్చు.

  • సొంత వాహనంలో ప్రయాణం చేసేవారు ఇంటి నుంచే ఎక్కువ మొత్తంలో నీళ్లు నింపి తీసుకెళ్లాలి. ఆరోగ్యం మాత్రమే కాదు నీటి ఖర్చు చాలా తగ్గుతుంది.

  • చర్మ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు అవసరం. ఎస్పీఎఫ్ 30 వరకు ఉన్న సన్ స్క్రీన్ తప్పక వెంట ఉంచుకోవాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి వాడాలి కూడా.

  • వీలైనంత వరకు లేత రంగుల బట్టలు ధరించాలి. లోదుస్తులు కూడా లేత రంగులవైతే మంచిది. శరీరాన్ని కప్పి ఉంచే వదులైన దుస్తులు ధరించడం మంచిది.


వేడిగా ఉందని స్లీవ్ లెస్ దుస్తులు, షార్ట్స్ వేసుకుంటారు కానీ నేరుగా ఎండ తగిలి చర్మం ట్యాన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. లాంగ్ స్కర్టులు, వదులుగా ఉండే ప్యాంట్లు, వదులైన కాటన్ కుర్తాలు వేసవి ప్రయాణాలకు చాలా అనుకూలం.



  • సొంత వాహనంలో ప్రయాణాలు చేసేవారు తెలిసినా అశ్రద్ధ చేసే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మందులు అన్ని సామాన్లతో పాటు డిక్కిలో వేసేస్తుంటారు. అలా వద్దు డిక్కీలో వేడిఎక్కువ గా ఉండడం వల్ల మందులు చెడిపోవచ్చు. కనుక మందులు, ఏవైనా వండిన పదార్థాలు వెంట ఉంచుకుంటే అవి తప్పకుండా కారులో ఏసి నడిచే చోట పెట్టుకుంటే ఎక్కువ సమయం పాటు చెడిపోకుండా ఉంటాయి.

  • ప్రయాణ సమయంలో దారిలో కనిపించినవన్నీ తినెయ్యడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అలా చెయ్యడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. కనుక వీలైనంత వరకు సహజమైన పండ్లు, తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం మంచిది.

  • కొంత మందికి మోషన్ సిక్నెస్ సమస్య ఉంటుంది. ఇలాంటి వారు మీ బృందంలో ఉంటే వారికి తగిన మందులు వెంటపెట్టుకునేలా జాగ్రత్త పడండి లేదంటే ప్రయాణం పొడవునా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఫన్ చెడిపోతుంది.

  • ద్రవపదార్థాల వినియోగం ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఇది శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.


Also Read: లిప్ స్టిక్ వల్ల పెదాలు నల్లగా మారిపోతున్నాయా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు