ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆన్ లైన్ స్టోర్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను  ప్రారంభించబోతోంది.  మే 4 మధ్యాహ్నం 12 గంటలకు ఈ గ్రేట్ సమ్మర్ సేల్‌ షురూ కానుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ సేల్‌కి 12 గంటల ముందు నుంచే యాక్సెస్ పొందే అవకాశం ఉంది.

అమెజాన్ సమ్మర్ సేల్ లో అదిరిపోయే ఆఫర్లు

అమెజాన్ సమ్మర్ సేల్ లో ఆయా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపు ధరలతో పాటు పలు ఆఫర్లు లభించనున్నాయి. కొనుగోలుదారులు స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, హోమ్ నీడ్స్ ను తక్కువ ధరకు పొందే అవకాశం ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌ లపై ఆయా వస్తువుల కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును పొందే వెసులుబాటు కల్పిస్తోంది అమెజాన్. ఫ్లిప్ కార్డు సైతం ‘బిగ్ సేవింగ్ డే’ పేరుతో ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.  అంతేకాదు, సమ్మర్ సేల్ కంటే ముందే ఫోన్లు కొనుగోలు చేసుకొనేందుకు కూడా అవకాశం కల్పించింది.

స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు ధర

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి  అమెజాన్ సమ్మర్ సేల్ లో మంచి ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు, తక్కువ ధరకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు అవకాశం ఉంది. కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మీరు తప్పక చూడవలసిన కొన్ని ఆఫర్లను ఇప్పుడు పరిశీలిద్దాం..  

Samsung Galaxy S22

Samsung Galaxy S22 ప్రారంభ ధర రూ.72,999 కాగా,  అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా రూ. 51,999 నుంచి ప్రారంభ ధర మొదలువుతుందని వెల్లడించింది. ఈ ధర బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.57,999గా ఉంది.  

OnePlus Nord CE 2 Lite 5G

OnePlus Nord CE 2 Lite 5G ప్రారంభ ధర రూ. 18,999 ఉండగా, సేవల్ లో భాగంగా  రూ. 17,499కి అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.   

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G  భారత్ లో రూ. 13,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ సమ్మర్ సేల్ లో రూ. 12,499 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy S20 FE 5G

Samsung Galaxy S20 FE 5G ప్రారంభ ధర రూ. 34,999 కాగా, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ లో రూ. 24,999 నుంచి అందుబాటులో ఉంటుంది.   

OnePlus 11 5G

 OnePlus ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ ప్రస్తుతం రూ. 56,999కి అందుబాటులో ఉంది. అమెజాన్ సేల్ లో ఇది  రూ. 55,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Realme Narzo 50i ప్రైమ్

ఈ స్మార్ట్ ఫోన్ రూ. 8,999తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్  రూ.6,999కి లభించనుంది.    

Read Also: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, ఇకపై మల్టీపుల్ డివైజెస్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ వాడుకోవచ్చు!