ఎప్పటికప్పుడు వినియోగదారులకు చక్కటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్, మరో చక్కటి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఒకే డివైజ్ లో వాట్సాప్ వాడుకునే అవకాశం ఉండగా, ఇకపై ఒకే ఫోన్ నెంబర్ తో అనేక డివైజెస్ లో వాడుకునే వెసులు బాటు కల్పిస్తోంది.  ఆండ్రాయిడ్ తో పాటు ఐవోఎస్ లోనూ ఈ ఫీచర్ ను రోల్ అవుట్ చేస్తున్నట్లు వెల్లడించింది.


ఒకే వాట్సాప్ అకౌంట్ మల్టీఫుల్ డివైజెస్ లో వాడుకోవచ్చు!


వాట్సాప్ వినియోగదారులు ఒక WhatsApp అకౌంట్ ను ఉపయోగించి సైన్ అవుట్ చేయకుండానే మరో ఫోన్ లో వాడుకునే అవకాశం ఉంటుంది. రెడింటి నుంచి చాట్ చేసే అవకాశం ఉంటుంది. “గత సంవత్సరం,  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు వారి అన్ని పరికరాలలో ఒకే స్థాయిలో ప్రైవసీ, సెక్యూరిటీని కొనసాగిస్తూ మెసేజ్ లు పంపే అవకాశాన్ని పరిచయం చేశాము. ప్రస్తుతం మల్టీఫుల్ డివైజెస్ లో ఒకే WhatsApp అకౌంట్ ను ఉపయోగించే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం” అని WhatsApp తెలిపింది. త్వరలోనే ఈ అవకాశం వినియోగదారుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.


మల్టీఫుల్ డివైజెస్ లో ఒకే WhatsApp అకౌంట్ ను ఎలా వాడాలి?   


మీరు వెబ్ బ్రౌజర్లు, టాబ్లెట్లు,  డెస్క్‌ టాప్లలో WhatsAppతో ఎలా లింక్ చేస్తారో అలాగే మీరు మీ ఫోన్‌ని నాలుగు ఇతర డివైజెస్ కు లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ వాట్సాప్ అకౌంట్ ను ఎలా కనెక్ట్ చేస్తారో అదే విధంగా లింక్ చేసే ప్రక్రియ ఉంటుంది.  ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. లింక్డ్ డివైజెస్ మీద ప్రెస్ చేయాలి. ఆ లింక్ కు అలాగే ట్యాప్ చేయాలి. ఫీచర్ ను ఎనేబుల్ చేయడానికి  స్క్రీన్‌ మీద కనిపించే సూచనలను పాటించాలి.  


QR కోడ్‌ని స్కాన్ చేయకుండా, ఫోన్ లింక్‌ను ఓపెన్ చేయడానికి మీ ఫోన్‌ కు  వన్-టైమ్ కోడ్‌ వస్తుంది. దానిని ఉపయోగించి ఇతర డివైజెస్ కు లింక్ చేసుకోవచ్చు. WhatsApp వెబ్‌లో మీ ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేయవచ్చు. QR కోడ్ స్కాన్ ద్వారా ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..   


స్టెప్1: మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.


స్టెప్2: మోర్ ఆప్షన్స్ >  లింక్డ్ డివైజెస్ మీద క్లిక్ చేయండి.  


స్టెప్3: మీ ఫోన్ ను లింక్ చేయడంపై క్లిక్ చేయాలి.  


స్టెప్4: మీ ప్రైమరీ  ఫోన్‌ని అన్‌లాక్ చేయండి.


స్టెప్5: మీరు లింక్ చేయాలనుకుంటున్న ఫోన్ స్క్రీన్‌పై మీ ప్రైవరీ ఫోన్ ను పాయింట్ చేసి, QR కోడ్‌ని స్కాన్ చేయండి.


స్టెప్6: మీ వాట్సాప్ అకౌంట్ మరో ఫోన్ తో లింక్ అవుతుంది. ఇలా 4 డివైజెస్ తో లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది.


ప్రైవసీ సమస్యలు రావా?


లింక్ చేయబడిన ప్రతి ఫోన్ వాట్సాప్‌కు స్వతంత్రంగా కనెక్ట్ అవుతుంది. వినియోగదారు వ్యక్తిగత సందేశాలు, మీడియా, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయని WhatsApp వెల్లడించింది. "మీ ప్రైవరీ డివైజ్ చాలా కాలం పాటు యక్టివ్ గా లేకపోతే, కనెక్ట్ అయిన మిగతా డివైజెస్ నుంచి  ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ చేస్తాము" అని తెలిపింది.


వాట్సాప్‌లో ఈ అప్‌డేట్ ఎప్పుడు వస్తుంది?


వాట్సాప్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సరికొత్త మల్టీ-డివైస్ షేరింగ్ అప్‌డేట్‌ను అందించడం ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించింది. మరికొద్ది వారాల్లో అందరికీ చేరుతుందని వెల్లడించింది.


Read Also: వాట్సాప్ నుంచి మరో కీ ఛేంజ్, త్వరలో భారీ డిజైన్ మార్పు!