RCB vs KKR Preview: 81 రన్స్‌ లాస్‌! చిన్నస్వామిలో కేకేఆర్‌పై కింగ్‌ కోహ్లీ పగ తీర్చుకుంటాడా!

RCB vs KKR Preview: ఐపీఎల్‌ 2023లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు రెండో మ్యాచ్‌ జరుగుతోంది.

Continues below advertisement

RCB vs KKR Preview:

Continues below advertisement

ఐపీఎల్‌ 2023లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య నేడు రెండో మ్యాచ్‌ జరుగుతోంది. తొలి పోరులో 81 రన్స్ తేడాతో ఓడిన ఆర్సీబీ ఈసారి ప్రతీకారం కోసం పట్టుదలగా ఉంది. వరుస ఓటములతో వెనకబడ్డ కేకేఆర్ మళ్లీ గెలుపు బాట పట్టాలని ప్రయత్నిస్తోంది. మరి ఇద్దరిలో విజయం ఎవరిదో!

కోహ్లీ కెప్టెన్సీతో జోష్‌!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు (Royal Challengers Bangalore) విరాట్‌ కోహ్లీ (Virat Kohli) జోష్‌ తీసుకొస్తున్నాడు. డుప్లెసిస్‌కు ఫిట్‌నెస్‌ ఇబ్బందులు ఉండటంతో చివరి రెండు మ్యాచుల్లో సారథ్యం వహించాడు. తనదైన అగ్రెషన్‌తో రెండింట్లోనూ విజయం అందించాడు. ఏదేమైనా టాప్‌ ఆర్డర్‌ ఆడినంత వరకు ఆర్సీబీకి ఫర్వాలేదు. జట్టు చేసిన మొత్తం పరుగుల్లో కోహ్లీ, డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ వాటానే ఎక్కువ! మిడిల్‌ నుంచి లోయర్‌ వరకు ఎవరూ కంట్రిబ్యూట్‌ చేయడం లేదు. కేకేఆర్‌ స్పిన్నర్లు వరుణ్‌, నరైన్‌ ఈ ముగ్గుర్నీ ఔట్‌ చేస్తే ఇబ్బందులు తప్పవు. బౌలింగ్‌ యూనిట్‌ మాత్రం ఫర్వాలేదు. మహ్మద్‌ సిరాజ్‌ (Mohammad Siraj) కెరీర్‌లోనే బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నాడు. స్క్రాంబుల్‌ సీమ్‌తో పవర్‌ప్లేలో వికెట్లు అందిస్తున్నాడు. టైట్‌ లెంగ్తుల్లో బంతులేస్తున్నాడు. హర్షల్‌ పటేల్‌ తోడుగా ఉన్నాడు. హసరంగ తన స్పిన్‌తో మాయాజాలం చేస్తున్నాడు. ఆసీస్‌ పేసర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ వస్తే తిరుగుండదు.

వరుసగా 4 ఓటములు!

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (Kolkata Knight Riders) ఈ సీజన్లో ప్లేఆఫ్ చేరాలంటే అద్భుతమే చేయాలి! ఎందుకంటే వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలై విన్నింగ్‌ మూమెంటమ్‌ కోల్పోయింది. ఎంత కష్టపడ్డా.. ఏదో ఒక దశలో వెనకబడుతోంది. వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపికలో పదేపదే తప్పులు జరుగుతున్నాయి. ఈ సీజన్లో కేకేఆర్‌ ఓపెనింగ్‌ జోడీ కాంట్రిబ్యూషన్‌ ఏమీ లేదు! వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, రింకూ సింగ్‌ (Rinku Singh) మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నారు. జేసన్‌ రాయ్‌ విధ్వంసకరంగా ఆడుతున్నాడు. శార్దూల్‌ నిలబడితే బాదగలడు. ఆండ్రీ రసెల్‌ ఇప్పటి వరకు తన స్థాయి ఇన్నింగ్స్‌ ఆడనేలేదు. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ వీక్‌గా ఉంది. వికెట్లు తీయడం లేదు. పైగా విపరీతంగా పరుగులు ఇస్తున్నారు. ప్రత్యర్థులు భారీ స్కోర్లు చేస్తుండటంతో బ్యాటర్లకు ప్రెజర్‌ పెరుగుతోంది. కొన్నిసార్లు వరుణ్ చక్రవర్తి, సునిల్‌ నరైన్‌ వికెట్లు పడగొడుతున్నారు. కానీ వారినీ బ్యాటర్లు అటాక్‌ చేస్తున్నారు. ఈ సీజన్లో ఏ పేసర్‌ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, రజత్ పటీదార్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, మహి పాల్ లోమ్రార్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్ధార్థ్ కౌల్, ఆకాష్ దీప్, సోను యాదవ్, అవినాష్ సింగ్, రాజన్ కుమార్, మనోజ్ భాండాగే, విల్ జాక్వెస్, హిమాన్షు శర్మ,  రీస్ టాప్లీ.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు:  నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.

Continues below advertisement