➥జూన్ 1 వరకు తరగతులు నిర్వహించొద్దని ఇంటర్ బోర్డు వార్నింగ్
➥ అయినా పట్టని ప్రైవేటు కాలేజీలు
ఏపీలో ఒకవైపు ఇంటర్మీడియట్ కళాశాలలను జూన్ ఒకటి వరకు ప్రారంభించొద్దని, ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఇంటర్ విద్యామండలి ఆదేశించింది. ప్రవేశాలను సైతం నిర్వహించొద్దని సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు కార్పొరేట్ కాలేజీలు ఇవేమీ పట్టడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుండే అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. వాస్తవానికి ఫిబ్రవరి నుండే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు పోటీపడేవారు కార్పొరేట్ కాలేజీల్లో ముందే ప్రవేశాలు తీసుకుంటున్నారు. ముందుగా రూ.10,000 ఫీజు కట్టి అడ్మిషన్ ఖరారు చేసుకుంటున్నారు. నిబంధనలు పేరుకే ఉన్నాయి కానీ కార్పొరేట్ కాలేజీలకు కళ్లెం వేయలేకపోతున్నాయి.
జేఈఈ, నీట్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకు వీలైనంత త్వరగా సిలబస్‌ను పూర్తి చేయాలని కార్పొరేట్ కాలేజీలు లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకోసం రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు క్లాసులు, స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తాయి. ఒక్కో క్లాసు మూడు గంటల పాటు ఉంటుంది. ఇంటర్ ఫస్టియర్‌లో ఈవిధమైన బిజీ షెడ్యూల్‌తో విద్యార్థులు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు.
ఇంటర్ ఫస్టియర్‌లో సిలబస్ పూర్తి చేసుకోవడానికి డిసెంబర్ వరకు సమయం ఉంటుంది. అదే సెకండియర్‌లో అయితే అగస్టు చివరి నాటికే సిలబస్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకుంటారు. అప్పటి నుండి జనవరి వరకు రివిజన్ చేయిస్తేనే, జనవరిలో జరిగే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్‌కు విద్యార్థులు సన్నద్ధమవుతారన్నది కార్పొరేట్ కాలేజీల భావన. దీంతో వీలైనంత త్వరగా సిలబస్‌ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ముగిసిన తర్వాత నాలుగు రోజులు సెలవులు ఇచ్చి వెంటనే క్లాసులు ప్రారంభించారు. మే మొదటి వారం వరకు ఈ క్లాసులు జరగనున్నాయి. ఆ తర్వాత కూడా 15 నుండి 20 రోజులు వరకు సెలవులు ఇస్తున్నప్పటికీ అన్‌లైన్‌లో క్లాసులు ఉంటాయని చెబ్తున్నారు. దీంతో కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ చదివే విద్యార్ధులకు వేసవి సెలవులే లేని పరిస్థితిగా మారింది.
Also Read:
పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు, చివరితేది ఎప్పడంటే?
తెలంగాణలో పాలిసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.200 ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు గడువు పెంచినట్లు పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ ఏప్రిల్ 25న ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఏప్రిల్ 25తో ముగియగా.. రూ.200 ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పదోతరగతి పూర్తయిన, చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 17న పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు.
పాలిసెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏడీసెట్-2023' నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
కడపలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వివిధ ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 'ఆర్ట్ & డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏడీసెట్)-2023' నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్‌ఏ), బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్ ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాాగా.. మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..