Chandrababu Politics : ప్రత్యేకహోదా విషయంలో మాత్రమే విబేధించాం.. ఇక అన్ని విషయాల్లోనూ మోదీ విధానాలను సమర్థిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేరుగా ప్రకటించారు. అంతే కాదు ఎన్డీఏలో చేరిక విషయంలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అంటే... ఖచ్చితంగా ఆయన ఖండించలేదు. చాన్స్ ఉందన్నట్లుగా చెప్పారు. తన వైపు నుంచి ఆయన సంకేతాలు పంపినట్లుగానే భావించవచ్చని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు కీలకం కావొచ్చు. ఎందుకంటే.. ఏపీలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా చివరికి బీజేపీకే మద్దతుగా నిలుస్తుంది. కానీ టీడీపీతో ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే నేరుగా అలయెన్స్ కలుపుకోవచ్చు. వైఎస్ఆర్‌సీపీతో అలాంటి అవకాశం ఉండదు.
బీజేపీతో పొత్తుకు సిద్ధమని చంద్రబాబు సంకేతాలు
2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు భారతీయ జనతా పార్టీ విషయంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రత్యేకహోదా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను బీజేపీపై తీవ్రంగా పోరాడినా ప్రజల మద్దతు లభించలేదు. దీంతో తన స్ట్రాటజీ తప్పు అయిందని డిసైడయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. జాతీయ రాజకీయాల జోలికి కూడా వెళ్లలేదు. ముందుగా తన పార్టీకి పూర్వ వైభవం తెప్పించుకునేందుకు కష్టపడుతున్నారు. వైసీపీతో మాత్రం తెగించి పోరాడుతున్నారు. మరో వైపు చూడటం లేదు. అదే సమయంలో ఎన్నికలు ఫెయిర్‌గా జరగితేనే విజయం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అలా జరగాలంటే బీజేపీ మద్దతు ముఖ్యమనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు బీజేపీ విషయంలో సానుకూలంగా ఉంటున్నారని చెబుతున్నారు. అందుకే టీవీచానల్ చర్చ తర్వాత ..గ్యాప్ పిల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారంటూ ఇంగ్లిష్ చానల్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పారు.
బీజేపీతో కలవాల్సిన అవసరం టీడీపీకి ఉందా?
ఆంధ్రప్రదేశ్ విషయం వరకూ వస్తే భారతీయ జనతా పార్టీ .. వైఎస్ఆర్‌సీపీతో కలిసి ఉందన్న అభిప్రాయం జనాల్లో ఎక్కువగా ఉంది. బీజేపీ నేతలు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. కానీ వైసీపీతో తాము లేమని ఆ పార్టీపై యుద్ధం ప్రకటిస్తున్నామని రెండు రోజుల కిందటే కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. వారు యుద్ధం చేస్తారా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. ఆ పార్టీతో నేరుగా పొత్తులు పెట్టుకునే అవకాశం లేదు. బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వైఎస్ఆర్‌సీపీ అంగీకరించకపోవచ్చని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఆ పార్టీ కోర్ ఓట్ బ్యాంక్ అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉండటమే. పరోక్షంగా పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు సిద్దంగా ఉంటారు. కానీ టీడీపీకి మాత్రం పొత్తులు పెట్టుకునే వెసులుబాటు ఉంది. టీడీపీ ప్రస్థానంలో బీజేపీతో పలుమార్లు కలిసింది. టీడీపీతో పొత్తు బీజేపీకి చాలా సార్లు కలసి వచ్చింది. టీడీపీతో కూటమి కట్టడం వల్ల గతంలో బీజేపీకి కేంద్రంలో అధికారం కూడా దక్కింది. అయితే ఏపీకి సంబంధించినంత వరకూ ఓటు బ్యాంక్ పరంగా చూసుకుంటే రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క జనసేన కలిస్తే చాలని టీడీపీ అనుకుంటోంది.
జాతీయంగా నమ్మకమైన మిత్రుల కోసం బీజేపీ వెదుకులాట !
ఎన్డీఏలో ఇప్పుడు నమ్మకమైన మిత్రులు ఎవరూ లేరు. బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి ఎన్డీఏ అనేది ఉనికిలో ఉంది కానీ.. పెద్దగా ప్రచారంలోకి రావడంలేదు. కానీ వచ్చే ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ సాధిస్తున్న ఏకపక్ష ఫలితాలతోనే రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి ఏ కొద్దిగా తేడా పడినా ఇబ్బంది పడుతుంది. అందుకే సౌత్ నుంచి నమ్మకమైన మిత్రులు ఆ పార్టీకి అవసరం. వైఎస్ఆర్‌సీపీ ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి. నేరుగా కలవదు..ఎన్నికలైన తర్వాత మద్దతు కూడా.. ఖచ్చితంగా అవసరం అయితే అ పార్టీ ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. అదే టీడీపీ అయితే నేరుగా ఎన్డీఏలో చేరిపోతుంది. అందుకే బీజేపీ , టీడీపీ విషయంలో కాస్త సాఫ్ట్ గా ముందుకెళ్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
టీడీపీతో పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఆలోచన ఎలా ఉంది ?
ఇటీవల అండమాన్‌లో మేయర్ పోస్టును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించి బీజేపీ. అక్కడ టీడీపీకి ఉంది రెండే రెండు సీట్లు. అయినా మేయర్ సీటిు ఇచ్చింది. బీజేపీ అధ్యక్షుడు నడ్డా ట్విట్టర్‌లో టీడీపీ, బీజేపీ కూటమికి శుభాకాంక్షలు అని ప్రకటించేశారు. కీలకమైన రాష్ట్రాల్లో కూడా అలాంటి ఆలోచన ఉండబ్టటే ఇలా హైలెట్ చేశారన్న చర్చ అప్పట్నుంచి జరుగుతోంది. అందుకే ముందు ముందు కొన్ని కీలక నిర్ణయాలు రాజకీయంగా వెలువడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.