మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ద్వారా అన్ని పనులను చక్కదిద్దుకుంటున్నారు. అయితే, వాట్సాప్ కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


మెటా యాజమాన్యంలోని వాట్సాప్, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌లో డిజైన్ మార్పును పరిచయం చేయడానికి కృషి చేస్తోంది. వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo ప్రకారం, ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ ఫారమ్ ఇప్పుడు దాని యూజర్ ఇంటర్‌ ఫేస్‌ లో మార్పులను తీసుకురావడానికి పని చేస్తోంది.


యూజర్ ఇంటర్‌ ఫేస్‌ లోకీలక మార్పులు


"కొంత కాలంగా వినియోగదారులు వాట్సాప్ ఇంటర్‌ ఫేస్‌ ను రీడిజైన్ చేయమని అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే, ప్రస్తుత ఇంటర్‌ ఫేస్ పాతది. ఆండ్రాయిడ్ ఇటీవలి అప్‌ డేట్స్ తర్వాత యూజర్ ఫ్రెండ్లీగా లేదని వారు భావిస్తున్నారు. వినియోగదారులు మరింత ఆధునికమైన, సహజమైన మార్పులను కూడా కోరుకుంటున్నారు. యాప్‌ ను నావిగేట్ చేయడానికి మార్గం, iOS యాప్‌ లాగానే చాట్స్, కాల్స్, కమ్యూనిటీలు,  స్టేటస్ లాంటి ముఖ్యమైన ఫీచర్‌లను సులభంగా, వేగంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పించేందుకు వాట్సాప్ కృషి చేస్తుంది" అని WABetaInfo తన పేజీలో వెల్లడించింది. "వాట్సాప్ వినియోగదారు అభ్యర్థనల ఫలితంగా, ఆండ్రాయిడ్ 2.23.8.4 అప్‌ డేట్ విడుదల చేసింది. దిగువ నావిగేషన్ బార్‌ను కలిగి ఉన్న యాప్ కోసం WhatsApp ఎట్టకేలకు సర్దుబాటు చేయబడిన ఇంటర్‌ ఫేస్‌ లో పని చేస్తోందని మేం గుర్తించాం" అని WABetaInfo తెలిపింది.


కొత్త వాట్సాప్ ఇంటర్‌ ఫేస్‌లో ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న దిగువ నావిగేషన్ బార్ ఉంటుంది. యాప్ కు సంబంధించిన తదుపరి అప్ డేషన్ లో కొత్త ఫీచర్ విడుదలయ్యే అవకాశం ఉంది. WhatsApp ఇటీవల మెసేజ్‌లను పంపిన తర్వాత కూడా వాటిని సవరించడానికి వినియోగదారులను అనుమతించే అవకాశం కల్పిస్తున్నట్లు WABetaInfo ఇటీవల తెలిపింది. iOS 23.6.0.74 అప్‌ డేట్ కోసం WhatsApp బీటా ప్రకారం, WhatsApp చాటింగ్ లో ప్రతి ఒక్కరికీ వారి ఎడిట్ చేసిన మెసేజ్ ను పంపబడినప్పుడు వినియోగదారులకు తెలిసేలా అప్ డేట్ ఇవ్వనుంది.


డిసప్పియర్ మెసేజ్ లుపైనా ఫోకస్


అటు  మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ ఫారమ్ డిసప్పియర్ మెసేజ్ లపైనా పని చేస్తోంది. 15 రోజుల వ్యవధిలో మెసేజ్ లు డిసప్పియర్ అయ్యేలా ఓ ఫీచర్ ను తీసుకువచ్చే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం, వాట్సాప్ డిసప్పియర్ మెసేజ్ ల కోసం మూడు విధాలను సపోర్ట్ చేస్తుంది. ఈ మెనులో 15 రకాల డిసప్పియర్ మెసేజ్ లు ఉన్నాయి. వాటిలో 1 సంవత్సరం, 180 రోజులు, 60 రోజులు, 30 రోజులు, 21 రోజులు, 14 రోజులు, 6 రోజులు, 5 రోజులు, 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు, 12 గంటలు, 6 గంటలు, 3 గంటలు, 1 గంట వ్యవధిని కలిగి ఉన్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు 15 రోజులను యాడ్ చేయనుంది.


Read Also: ఇకపై మీ చాట్ లాక్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్