మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ చేంజర్' (Game Changer Movie) ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. ఆ సినిమా సంగీత దర్శకుడిగా ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ పేరు వినబడుతోంది. 


రెహమాన్ సంగీతంలో 'ఆర్.సి16'?
AR Rahman Music For RC16 Movie : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్టు టాలీవుడ్ టాక్. కొన్ని రోజులుగా ఆయన పేరు వినబడుతోంది. ఇటీవల చర్చలు పూర్తి అయ్యాయట. త్వరలో ఈ వివరాలు వెల్లడించనున్నారని సమాచారం. 


సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. అంతే కాదు... ఆయన శిష్యుల సినిమాలకూ దేవి సంగీతం అందిస్తూ వస్తున్నారు. అంత  ఎందుకు? 'ఉప్పెన' సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. పాన్ ఇండియా అనుకున్నారో? కథకు రెహమాన్ అయితే బావుందని భావించారో? ఆయన్ను సంప్రదించారు బుచ్చిబాబు.      


సెప్టెంబర్ నుంచి షూటింగ్ షురూ!
ఈ  సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని రామ్ చరణ్ గతంలో తెలిపారు. ఇందులో తనది పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అన్నారు. 'రంగస్థలం' కంటే బెటర్ సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్ అని ఇండియా కాన్‌క్లేవ్‌లో రామ్ చరణ్ తెలిపారు. 


నటుడిగా రామ్ చరణ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్యారెక్టర్లలో 'రంగస్థలం' సినిమాలో చిత్తుబాబు క్యారెక్టర్ ముందు వరుసలో ఉంటుంది. దాని కంటే బెటర్ క్యారెక్టర్ అని చెప్పడంతో... ఆ ఒక్క మాటతో సినిమాపై మరింత హైప్ పెంచేశారు ఆయన. ఆ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ (ఫారినర్స్)ను కూడా ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ తెలిపారు. 


Also Read : 'కెజియఫ్' దర్శకుడి కథకు దీపికా పదుకోన్ ఓకే అంటుందా?


'రంగస్థలం' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. సానా బుచ్చి బాబు ఆయన శిష్యుడే. 'ఉప్పెన' సినిమాతో  భారీ విజయం అందుకున్నారు. తొలి సినిమాతో వంద కోట్లు వసూలు చేసిన సినిమాలు తీసిన దర్శకుల జాబితాలో చేరారు. ఆ సినిమా వెనుక సుకుమార్ అండదండలు ఉన్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా చేయబోయే సినిమాకు కూడా అండదండలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే... తొలుత ఈ కథను ఎన్టీఆర్ హీరోగా చేయాలని ప్లాన్ చేశారు. అయితే, ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో రామ్ చరణ్ దగ్గరకు వచ్చింది. దాని కంటే ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య ఆ విషయమై డిస్కస్ చేసుకున్నారట.  


సతీష్ కిలారు నిర్మాణంలో...
రామ్ చరణ్ - సానా బుచ్చి బాబు సినిమాతో సతీష్ కిలారు (Satish Kilaru) నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌గ‌ర్వ సమర్పణలో ఆయనకు చెందిన వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నిర్మిస్తున్నారు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని దర్శక నిర్మాతలు తెలియ‌జేశారు.


Also Read : మళ్ళీ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ - 'ఉస్తాద్' సెట్స్ నుంచి లీకైన లుక్ చూశారా?