'కెజియఫ్' సినిమాకు ముందు ప్రశాంత్ నీల్ పేరు కన్నడ మినహా మిగతా భాషల్లో కొంత మంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. రాఖీ భాయ్ పాత్రలో యష్ (Yash)ను ఆయన చూపించిన తీరుకు దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు సలామ్ కొట్టారు. వసూళ్ళ రూపంలో కోట్లు కుమ్మరించారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు, హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మరి, దీపికా పదుకోన్ (Deepika Padukone) ఓకే అంటారో? లేదో? ఎందుకంటే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. 


ప్రశాంత్ నీల్ కథ...
హీరో ఏమో చిన్నోడు!
ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా 'సలార్' సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రభాస్. దీని తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వినికిడి. వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కేవలం కథ మాత్రమే ప్రశాంత్ నీల్ ఇస్తారట. 


ప్రశాంత్ నీల్ కథతో ఆయన శిష్యులలో ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... 'కెజియఫ్', 'కాంతార' సినిమాలు తీసిన హోంబలే ఫిలిమ్స్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇదొక ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని టాక్. అందులో ప్రధాన పాత్రకు దీపికా పదుకోన్ అయితే బావుంటుందని దర్శక, నిర్మాతల ఆలోచన. ఆమెతో సంప్రదింపులు చేయడం స్టార్ట్ చేశారు. 


ఇప్పటి వరకు హీరోయిజం ఎలివేట్ చేస్తూ భారీ కథలు రాసిన ప్రశాంత్ నీల్ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ రాయడం విశేషం. ఇందులో కథానాయకుడిగా ఆదర్శ్ బాలకృష్ణ (Aadarsh Balakrishna)ను ఫైనలైజ్ చేశారని తెలిసింది. ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్ కూడా చేశారట. దీపికా పదుకోన్ ఓకే చెప్పిన తర్వాత అధికారికంగా సినిమా వివరాలను అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 


ఆదర్శ్ బాలకృష్ణ తెలుగులో చాలా సినిమాలు చేశారు. కొన్ని సినిమాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించారు. ఒకవేళ దీపికా పదుకోన్ ఈ సినిమా చేయడానికి ఓకే చెబితే... స్టార్ హీరోయిన్ పక్కన నటించిన గుర్తింపు ఆయనకు వస్తుంది. కెరీర్ పరంగా అది పెద్ద బూస్ట్. దీపికాను ప్రధాన పాత్రకు ట్రై చేస్తూ... ఆదర్శ్ బాలకృష్ణను హీరోగా తీసుకోవడం ఏమిటి? అని ఆలోచిస్తున్నారా!? అతను ఎవరో కాదు... ప్రశాంత్ నీల్ సొంత చిన్నాన్న కుమారుడు. తమ్ముడి కోసం ప్రశాంత్ నీల్ ఈ కథ రాశారేమో!? అదీ సంగతి! 


Also Read : మళ్ళీ లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్ - 'ఉస్తాద్' సెట్స్ నుంచి లీకైన లుక్ చూశారా?






'కెజియఫ్'లో ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించినది ఎవరో కాదు... ప్రశాంత్ నీల్ బాబాయ్, ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం! దర్శకుడిగా తాను ఎదగడంతో పాటు తన వాళ్ళను పైకి తీసుకు వెళ్ళడానికి ప్రశాంత్ నీల్ ట్రై చేస్తున్నారు.


ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఆలస్యం అవుతుందా?
'సలార్' పూర్తి అయ్యాక... సెప్టెంబర్ లేదా ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అవుతుందని వినిపించింది. కొరటాల శివ సినిమా తర్వాత హిందీలో హృతిక్ రోషన్ 'వార్ 2' చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకోవడంతో, ఆయన లైనప్ మారే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా కొంత ఆలస్యంగా స్టార్ట్ కావచ్చని టాక్. 


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?