ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మధ్య మంచి స్నేహం ఉంది. 'బావ... బావ' అని పిలుచుకునే చనువు ఉంది. అది అందరికీ తెలుసు. బావను ఎన్టీఆర్ పార్టీ అడిగితే... అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...


అల్లు అర్జున్ (Allu Arjun Birthday) పుట్టినరోజు సందర్భంగా శనివారం స్టార్స్ చాలా మంది సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు. అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. తనకు విషెస్ చెప్పిన వాళ్ళకు రిప్లై ఇస్తూ ఇస్తూ... ఎన్టీఆర్ బావకు కూడా థాంక్స్ చెప్పారు బన్నీ. ఆ తర్వాత మొదలైంది అసలు కథ!






పార్టీ లేదా పుష్ప?
'హగ్గులు మాత్రమేనా? పార్టీ లేదా పుష్ప?' అంటూ ఎన్టీఆర్ అడిగారు. 'పుష్ప'లో విలన్ రోల్ చేసిన మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ చెప్పిన ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. సోషల్ మీడియా ఒక్కసారిగా హోరెత్తింది. ఆ తర్వాత అల్లు అర్జున్ 'వస్తున్నా' అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఓ టీజర్ కూడా విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ చెప్పే ఆఖరి డైలాగ్... వస్తున్నా. అదీ సంగతి! ఇప్పుడు అర్థమైంది కదా!






పుట్టినరోజు శుభాకాంక్షలతో మొదలైన ట్విట్టర్ సంభాషణ... ఆ తర్వాత హీరోల సినిమాల్లో సూపర్ హిట్ డైలాగులను కూడా గుర్తు చేసింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా చాలా మంది స్టార్స్ బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పారు.


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?


సినిమాలకు వస్తే... అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'పుష్ప 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ కొత్తగా కనిపించారు. తిరుపతిలో గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా పాల్గొంటారో, ఆ విధంగా కనిపించి ఔరా అనిపించారు. ఆ లుక్ రికార్డులు క్రియేట్ చేసింది.


సోషల్ మీడియాలో లైకులే లైకులు!
అల్లు అర్జున్ 'పుష్ప 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... ట్విట్టర్‌లో 207కె, ఫేస్‌బుక్‌లో 5 మిలియన్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 850కె లైక్స్ వచ్చాయి. ఎక్కువ మంది లైక్ చేసిన లుక్ కింద 'పుష్ప 2' రికార్డు క్రియేట్ చేసింది. 


యూట్యూబ్‌లో 'వేర్ ఈజ్ పుష్ప' టీజర్ అయితే 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమా టీజర్లలో 'ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్' మూడో స్థానంలో నిలిచింది. దీనికి 22.52 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీ వెర్షన్ టీజర్ 30 మిలియన్ వ్యూస్ కు చేరువలో ఉంది. యూట్యూబ్‌లో 24 గంటల్లో ఎక్కువ మంది లైక్ చేసిన టీజర్లలో రెండో స్థానంలో ఉంది. 793కె లైక్స్ వచ్చాయి. అదీ సంగతి!


Also Read 'జూబ్లీ' వెబ్ సిరీస్ రివ్యూ : స్టార్ హీరోయిన్ ఎఫైర్... సెక్స్ వర్కర్‌తో డైరెక్టర్ లవ్... అదితి రావు హైదరి నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?