నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) మరణించి ఈ రోజుకి సరిగ్గా 50 రోజులు. ఇటు సినిమాల్లో మళ్ళీ బిజీ అవుతున్న సమయంలో, అటు రాజకీయాల్లో క్రియాశీలకంగా తిరుగుతూ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో... చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు ఆయన వెళ్ళిపోయారు. తారక రత్న మరణం నుంచి ఆయన భార్య అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy Nandamuri) ఇంకా బయటకు రాలేకపోతున్నారు. లేటెస్టుగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు.


ఒక్క సెకన్ కూడా మర్చిపోను!
''నిన్ను ఒక్క సెకన్ కూడా మర్చిపోను'' అని ఇన్‌స్టాగ్రామ్‌లో అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు. అందులో తారకరత్నతో పిల్లలు గడిపిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఆ రోజు ఎప్పటికీ గుర్తు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.  


ఇషా ఫౌండేషన్‌లో అలేఖ్య!
కొన్ని రోజుల క్రితం అలేఖ్యా రెడ్డి కోయంబత్తూరులో వెళ్లారు. సద్గురు (Sadhguru) ఇషా ఫౌండేషన్ (Isha Foundation Coimbatore)కు పెద్దమ్మాయి నిష్కతో కలిసి రెండు మూడు రోజులు ఉన్నారు. తారక రత్న మరణించిన నెల రోజులు పూర్తి అయిన సందర్భంగా నెల మాసికం కార్యక్రమాలు, పూజలు చేసినట్టు సమాచారం.


Also Read : పార్టీ లేదా పుష్ప? వస్తున్నా బావా! - ఎన్టీఆర్, బన్నీ బ్రోమాన్స్ చూశారా?






తారక రత్న భౌతికంగా ప్రజల మధ్య లేరు. అయితే, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రజలతో ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి పిల్లలలో భర్తను చూసుకుంటున్నారు. తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి పేరు నిష్క. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఎంట్రీ ఇచ్చారు. నిష్క తర్వాత కవలలు జన్మించారు. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. తండ్రి మరణం తర్వాత తొలిసారి తారక రత్న వారసుడి ఫోటోను అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.


పెద్దైన తర్వాత తండ్రిలా...
కొన్ని రోజుల క్రితం అబ్బాయి ఫోటోలను అలేఖ్యా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేశారు. అందులో తండ్రి ఫోటోతో వారసుడు ఉన్నారు. పెద్దైన తర్వాత తండ్రిలా కావాలని అబ్బాయి అంటున్నట్లు అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. అదీ సంగతి!


హిందూపూర్ వెళ్ళడానికి ముందు...
తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిష్క (Taraka Ratna Daughter Nishka) తర్వాత కవలలు (అబ్బాయి, అమ్మాయి) జన్మించారు. ఇప్పుడు తారక రత్న పెద్దమ్మాయి నిష్క సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేశారు. తండ్రితో గేమింగ్ ఆడుతున్న వీడియో షేర్ చేశారు.


తండ్రి తారక రత్నతో దిగిన ఫోటోను నిష్క పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె తొలి పోస్ట్ అదే. ఆ ఫోటోకి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ రెండు లవ్ ఎమోజీలను యాడ్ చేశారు. ఆ తర్వాత తారక రత్న, అలేఖ్యా రెడ్డి ఫోటో పోస్ట్ చేశారు. ''మై పేరెంట్స్! వీళ్ళే నా బలం, నా ప్రేమ'' అని నిష్క పేర్కొన్నారు. ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలో అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?