వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మెసేజింగ్ యాప్ ను లాక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఒకవేళ యాప్ మొత్తానికి లాక్ చేసుకోవడం ఇష్టం లేకపోతే, సెలెక్ట్ చేసిన చాట్ లను మాత్రమే లాక్ చేయడానికి వాట్సాప్ ఈ ఫీచర్ ను రూపొందిస్తోంది.  పాస్‌కోడ్, ఫింగర్ ఫ్రింట్, ఫేస్ IDలో ఏదో ఒకదానిని ఉపయోగించి యాప్ ను లేదంటే, వ్యక్తిగత చాట్ లను లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..






వాట్సాప్ చాట్‌లను ఎలా లాక్ చేయాలంటే?


తాజాగా ఆండ్రాయిడ్ బీటా అప్‌ డేట్‌ వాట్సాప్ టిప్‌ స్టర్ వెబ్ బీటా ద్వారా గుర్తించబడింది.  ఇందులో వాట్సాప్   కొత్త ‘చాట్ లాక్’ ఫీచర్ మీద పని చేస్తున్నట్లు తేలింది. ఈ ఫీచర్ మీ వ్యక్తిగత చాట్‌లను భద్రంగా దాచుకోవడంలో ఉపయోగపడుతుంది.లాక్ చేయబడిన చాట్‌లను ఓపెన్ చేయడానికి, టిఫికేషన్‌లను చదవడానికి  మీరు మీ ఫింగర్ ఫ్రింట్ లేదంటే పాస్ కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.


అంతేకాదు, వాట్సాప్ లో ఆర్కైవ్ చేసిన చాట్‌ల మాదిరిగానే, ఈ లాక్ చేయబడిన చాట్‌లు ప్రత్యేక విభాగానికి తరలించబడతాయి. ఈ ఫీచర్ వ్యక్తిగత, గ్రూప్ చాట్‌లకు అందుబాటులో ఉంటుంది. ఇది మీ మెసేజ్ లను దాచడమే కాకుండా మీడియా ఫైల్స్ ను కూడా ప్రైవేట్‌గా ఉంచుతుంది. లాక్ చేయబడిన చాట్‌లలో మీరు పంపే ఫోటోలు, వీడియోలు, ఆడియో డీఫాల్ట్ గా ఫోన్ గ్యాలరీలో సేవ్ చేయబడవు. దీని ద్వారా మీరు మరింత ప్రైవసీని పొందే అవకాశం ఉంటుంది.


అలా ఓపెన్ చేస్తే చాట్ హిస్టరీ క్లియర్ అవుతుంది!


ఇక  వాట్సాప్‌లోని ‘చాట్ లాక్’ ఫీచర్ గురించి WABetaInfo ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. “ఎవరైనా మీ ఫోన్‌ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించి, అవసరమైన పాస్ కోడ్ అందించడంలో విఫలమైతే పూర్తి చాట్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ లాక్ చేయబడిన చాట్‌ను ఎవరైనా బలవంతంగా ఓపెన్ చేస్తే మీ చాట్ హిస్టరీ క్లియర్ అవుతుంది.  బీటా బిల్డ్‌లలో కూడా ఓపెన్ కాదు.


త్వరలో అందుబాటులోకి ‘చాట్ లాక్’ ఫీచర్


ఈ ‘చాట్ లాక్’ ఫీచర్ ఇంకా అభివృద్ధిలో ఉంది.  త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వాట్సాప్ బీటాలో టెస్టింగ్ కోసం అందుబాటులోకి రానుంది. అటు ఇతర గోప్యతా ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.  వాట్సాప్ ఎఫెమెరల్ ఆడియో మెసేజ్‌లు (ఒక్కసారి మాత్రమే ప్లే చేయవచ్చు), గ్రూప్‌ల కోసం గ్రాన్యులర్ అడ్మిన్ నియంత్రణలు సహా పలు ఫీచర్లను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతోంది.  


Read Also: ఫొటోగ్రఫీ కోసం డ్రోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.10 వేల లోపు లభించే బెస్ట్ డ్రోన్స్ ఇవే!