పొగలు కక్కే కాఫీ లేదా టీ తాగడం అంటే చాలా మందికి ఇష్టం. వేడి కాస్త తగ్గినా కూడా అసలు తాగకుండా పక్కన పెట్టేస్తారు. పొద్దున్నే లేవగానే వేడి వేడి కాఫీ తాగడం వల్ల శక్తిగా రోజంతా ఉత్సాహంగా ఉంటుందని అనుకుంటారు. కానీ మీరు తాగే కప్పు టీ లేదా కాఫీ వల్ల క్యాన్సర్ అనే ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి ఉంటుందని ఎవరు పట్టించుకోరు. రోజంతా చాలా వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని 90 శాతం వరకు పెంచుతుందని ఇటీవల అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్లలో ఒకటి.


వేడి పానీయాలు తాగితే ఏమవుతుంది?


రోజంతా టీ, కాఫీ లేదా వేదినీరు వంటి వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతింటుంది. గొంతు నుంచి పొట్ట వరకు వెళ్ళే పొడవాటి బోలుగా ఉండే గొట్టాన్ని అన్నవాహిక అంటారు. వేడి పదార్థాలు ఎక్కువగా తగలడం వల్ల కాలక్రమేణా క్యాన్సర్ ప్రమాదానికి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. 2016 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం వేడి ద్రవాలు క్యాన్సర్ కారకమని హెచ్చరించింది. ముఖ్యమలో 60 సెల్సియస్ కంటే ఎక్కువ లేదా 140 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద తాగే పానీయాలు చాలా ప్రమాదకరం. పానీయం వేడి ఎంత వేడిగా ఉందో క్యాన్సర్ ముప్పు అంత ఎక్కువగా పెరుగుతుందని డబ్యూహెచ్ఓ ఓ హెచ్చరిక నివేదికలో వెల్లడించింది. అయితే కేవలం వేడి పానీయాలు తాగడం వల్లే క్యాన్సర్ రాదని నిపుణులు చెబుతున్నారు.


ఇతర కారణాలు


☀సిగరెట్లు తాగడం


☀అతిగా మద్యం సేవించడం


☀పొగాకు నమలడం


☀అనారోగ్యకరమైన ఆహారం


☀వాయు కాలుష్యానికి గురి కావడం


అన్నవాహిక క్యాన్సర్ అంటే ఏంటి?


ఎసోఫాగియల్ క్యాన్సర్ సాధారణంగా అన్నవాహిక లోపలి భాగంలో ఉండే కణాలలో మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ అన్నవాహికలో ఎక్కడైనా సంభవించవచ్చు. ఇది ఎక్కువగా స్త్రీల కంటే పురుషులను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో అన్నవాహిక క్యాన్సర్ ఆరోది.


లక్షణాలు


☀ఆహారం మింగడంలో ఇబ్బంది


☀ఊహించని విధంగా బరువు తగ్గడం


☀ఛాతిలో విపరీతమైన నొప్పి


☀అజీర్ణం


☀దీర్ఘకాలిక దగ్గు


శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?


హార్వర్డ్ హెల్త్ ప్రకారం అన్నవాహిక కణజాలంలో క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభవమవుతుంది. చివరికి కణితి మాదిరిగా ఏర్పడుతుంది. కణితి పెరిగేకొద్ది అన్నవాహిక తెరవడం ఇబ్బందిగా మారుతుంది. దీని వల్ల ఆహారం మింగడంలో చాలా బాధగా ఉంటుంది. అన్నవాహిక క్యాన్సర్ లో రెండు రకాలు ఉన్నాయి. అవేంటంటే..


అడేనోకార్సినోమా: ఇది యూఎస్ లో అత్యంత సాధరణమైన అన్నవాహిక క్యాన్సర్. ఆహారం మింగడానికి సహాయపడే శ్లేష్మం చేస్తే కణజాలంలో ఇది అభివృద్ధి చెందుతుంది.


పొలుసుల కణ క్యాన్సర్: అన్నవాహికలో ఉండే పొలుసుల కణాలలో ప్రారంభమవుతుంది.


ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?


అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి 15 ఓ డిగ్రీల ఫారిన్ హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద పానీయాలు తాగాలని సిఫార్సు చేస్తున్నారు. వేడిగా ఉన్నవి తాగే బదులు గోరువెచ్చని పానీయాలు తాగాలి. ఇది ఆరోగ్య సమస్యలకు కారణం కాదు. పొగాకు ఉపయ్యయోగించడం, మద్యం సేవించడం వంటివి నివారించడం వల్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. HPV ఇన్ఫెక్షన్ కలిగి ఉండటం కూడా అన్నవాహిక క్యాన్సర్‌కు ప్రమాద కారకం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు