టైటానిక్.. . సముద్ర గర్భంలో దాగిన ఓ చరిత్ర. ఒకప్పుడు ప్రపంచంలో అతి పెద్ద నౌక ఇది. ఏప్రిల్ 15, 1915న ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో సమాధి అయిపోయింది. ప్రమాదవశాత్తూ మంచు కొండను ఢీకొన్న ఆ ఘటనలో పదిహేను వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా నిలిచిపోయింది.  అప్పుడు మునిగిన నౌక శిధిలాలు 1985 వరకు లభించలేదు. సముద్ర మట్టానికి రెండు మైళ్ల లోతులో టైటానిక్ అవశేషాలు కనుగొన్నారు. ఇప్పుడు ఆ అవశేషాలను చూసేందుకు చాలా మంది సముద్రగర్భంలోకి టూర్ కి వెళుతున్నారు. అలా ఓ మహిళ ఏకంగా 30 ఏళ్ల పాటూ కష్టపడిన సొమ్మును దాచి టైటానిక్ చూసి వచ్చింది. దీనికి ఆమె ఖర్చు పెట్టింది అక్షరాలా రెండు కోట్ల రూపాయలు. 


చిన్నప్పటి కల
మెక్సికోకు చెందిన రెనాటా అనే మహిళ ఊహ తెలిసినప్పట్నించి టైటానిక్ ఓడ గురించి వింటూనే ఉంది. ఆమె చిన్నప్పుడు టైటానిక్ శిధిలాలను కనుగొనలేదు. దీంతో ఆమె ఓషనోగ్రఫీ ఎంచుకుని తానే వాటిని కనుక్కోవాలని అనుకుంది. కానీ కాలేజీలో చేరిన వారం రోజులకే  టైటానిక్ శిధిలాలను కనుగొన్నారు. దీంతో ఆమె ఆ చదువును వదిలి బ్యాంకింగ్ రంగం వైపు వచ్చింది. టైటానిక్ శిధిలాలను చూడాలని ఆశ పడింది. అందుకు కేవలం జలాంతర్గాముల్లోనే వెళ్లాలి. జలాంతర్గాములకు చాలా అధిక మొత్తంలో చెల్లిస్తేనే తీసుకువెళతారు. దీంతో విలాసాలన్నీ మానేసి పొదుపు చేయడం మొదలుపెట్టింది. కారు, ఇల్లు కూడా కొనుక్కోలేదు. పెళ్లి, పిల్లలు... ఇలా బాధ్యతలు లేవు. దాదాపు 30 ఏళ్ల పాటూ ఉద్యోగం చేస్తు డబ్బులు దాస్తూనే ఉంది. ఈ మధ్యనే తన కలను నెరవేర్చుకుంది. ఆమె గురించి తెలిసి బీబీసీ సంస్థ ఆమె ఆనందాన్ని వీడియో రూపంలోకి మార్చింది. అందులో టైటానిక్ ఓడను చూసి రెనాటా ఎంతగా భావోద్వేగాలకు లోనైందో చూడొచ్చు. అన్నేళ్ల కల నెరవేర్చుకున్నప్పుడు ఆకాశమంత ఆనందం కలగడం సహజం. 


ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నప్పటి కలను నెరవేర్చుకనేందుకు ఆమె ఎంతగా కష్టపడిందో తెలిసి అందరూ మెచ్చుకుంటున్నారు. నీటి అడుగున ఉన్న టైటానిక్ శిధిలాలు ఉన్న ప్రాంతాన్ని యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. డబ్బు చెల్లిస్తే జలాంతర్గామిలో చూసి వచ్చే సదుపాయాలను కూడా కల్పించారు. 






Also read: ఆరోగ్యవంతమైన బిడ్డను కనాలనుకుంటున్నారా? అయితే మీరు చేయకూడని అయిదు పనులు ఇవే