వర్షా కాలంలో కండ్ల కలక లేదా పింక్ ఐ లేదా కన్జెక్టివైటిస్ అనే కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువ. తేమ ఎక్కువగా ఉన్న గాలి ద్వారా కంటికలకకు కారణమయ్యే బ్యాక్టీరియా త్వరగా వ్యాపిస్తుంది. కండ్లకలక ఇది చిన్నపాటి ఇన్ఫెక్షన్ గానే ఉంటుంది చాలా సందర్భాల్లో కానీ రోజువారీ జీవితాన్ని మాత్రం బాగా ప్రభావితం చేస్తుంది.
వర్షాకాలంలో వాతావరణంలో మురికి, కాలుష్య కారకాలు పెరిగి పోయి అలర్జీలు కూడా ఎక్కువవుతాయి. డాక్టర్ సూచించే మందులతో పాటు కండ్ల కలక చికిత్సగా కొన్ని ఇంటి చిట్కాలను కూడా పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాంటి కొన్ని చిట్కాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
వ్యక్తిగత శుభ్రత
ఇన్ఫెక్షన్ వ్యాపించకుడా ఉండేందుకు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవాలి. మురిక చేతులతో కళ్లను తాకకూడదు. ప్రతి రోజు తప్పనిసరిగా స్నానం చెయ్యాలి.
కళ్లను రుద్ద కూడదు
కళ్లు దురదగా అనిపించడం లేదా అసౌకర్యంగా ఉండడం కండ్ల కలకలో సాధారణం. అయినా సరే పదేపదే కళ్లను తాకకూడదు. అంతే కళ్లను పదేపదే తాకడం వల్ల మీ ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం పెరుగుతూనే ఉంటుంది. కళ్లు తుడుచుకునేందుకు శుభ్రమైన కాటన్ వస్త్రం లేదా టిష్ష్యూ పేపర్ వాడడం మంచిది.
హాట్ కంప్రెషన్
కంటి కలక వల్ల కలుగుతున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు, చికిత్స త్వరగా ఫలితాలను ఇచ్చేందుకు కళ్ల చుట్టు శుభ్రమైన వెచ్చని కంప్రెషన్ ఇచ్చేందుకు ప్రయత్నించండి. దీని వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది. హాట్ కంప్రెసెస్, ఆర్టిఫిషియల్ టియర్స్ కంటికి రోజంతా కూడా అవసరమవుతాయి.
మేకప్ వద్దు
కంటి మేకప్ అలవాటున్న వారు ఇన్ఫెక్షన్ తగ్గేవరకు మానెయ్యాలి. మేకప్ మందులు పనిచెయ్యకుండా చేస్తుంది.
ఆర్టిఫిషియల్ టియర్స్
మెడికల్ షాప్ లో దొరికే ఆర్టిఫిషియల్ టియర్స్ ని వాడడం వల్ల అసౌకర్యాన్ని నివారించవచ్చు. అయితే ప్యాక్ మీద ఉన్న సూచనలు తప్పకుండా పాటించాలి.
శుభ్రమైన టవల్స్
బ్యాక్టీరియా పేరుకుపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా టవల్స్, షీట్స్ వంటివి ప్రతిరోజూ మార్చుకోవడం మంచిది. వీలైనంత వరకు ఒంటరిగా గడిపేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తుంది.
వస్తువులు పంచుకోవద్దు
వీలైనంత వరకు వ్యక్తిగత వస్తువులు ఇతరులు తాకకుండా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా కూడా పాటించాలి.
ఐ డ్రాప్స్
కండ్ల కలక చాలా తీవ్రంగా ఉంటే యాంటిబయాటిక్ లేదా యాంటీ వైరల్ ఐడ్రాప్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు వీటిని కచ్చితంగా వాడాలి.
ఈత వద్దు
వర్షాకాలంలో వీలైనంత వరకు స్విమ్మింగ్ కి దూరంగా ఉండడమే మంచిది. పూల్ లోని నీటిలో ఇన్ఫెక్షణ్ కలిగించే బ్యాక్టీరియా ఇతర కారకాలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది.
డాక్టర్ సలహా తప్పదు
ఇంటి చిట్కాలు ఎన్ని పాటించినప్పటికీ లక్షణాలు తగ్గక పోతే లేదా తీవ్రంగా మారుతుంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించి సరైన వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.
కండ్లకలక లక్షణాలు
- కళ్లు ఎర్రబారడం
- కళ్లు దురదగా ఉండడం
- కంటి రెప్పల్లో వాపు
- కంటి నుంచి నీరు కారడం
- కంటి నుంచి డిశ్చార్జ్ అంటే ఊసులు రావడం
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడడం అవసరం. లేదంటే ఇది వేగంగా అందరికీ వ్యాపిస్తుంది.
Also read : Travel Sickness: ప్రయాణాల్లో వాంతులు ఆపేందుకు ఇలా చేస్తున్నారా? ప్రాణాలు పోతాయట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.