చాలా మందికి ప్రయాణాలు చెయ్యడం చాలా అసౌకర్యంగా ఉంటుంది. తలనొప్పి, తల తిరగడం, వాంతులు ఇలా రకరకాల బాధలు పడుతుంటారు. ఇది పిల్లలు, పెద్దలు అందరిలో ఉంటుంది. కానీ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా కార్లో వెనుక సీట్లో కూర్చుంటే ఇక వీరి పరిస్థితి చెప్పతరం కాదు.
ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలకు ప్రయాణ సమయంలో వాంతులు ఆగేందుకు కొన్ని సాధారణ మందులు ఇస్తుంటారు. కానీ ఇవి పిల్లల ప్రాణాలకే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు. ఇలా మందులు కూడా కొంత మంది వ్యక్తులలో ప్రాణాంతక పరిస్థితులకు కారణమవుతున్నాయని అంటున్నారు.
స్కూపోడెర్మ్ ప్యాచెస్ ను శరీరం మీద అతికించుకుని క్రూయిజ్ ప్రయాణంలో సీ సిక్ నెస్ నుంచి కాపాడుకునేందుకు వాడుతారు. వీటిని డాక్టర్లు చాలా విరివిగా సిఫారసు చేస్తారు. వీటిని సరైన పద్ధతిలో వాడితే సురక్షితమైనవి కూడా.
కానీ చాలా మంది మందులను సరైన పద్ధతిలో వాడరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలోపు పిల్లలకు ఇలాంటి ప్యాచెస్ వెయ్యడం, వాటిని తొలగించడం మాత్రమే కాదు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉపయోగించడం, నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం పాటు అవి శరీరం మీద ఉండడం వంటి విషయాల్లో తప్పులు చేస్తుంటారు. ఇలాంటి దుర్వినియోగంతో ఈ మందుల వల్ల హైపర్ థెర్మియాకు దారి తీస్తుంది. ఇది ప్రాణాంతకమైన స్థితి. శరీర ఉష్ణోగ్రతలు మోతాదుకు మించి తగ్గిపోవడాన్ని హైపర్ థెర్మియా అంటారు. శరీరం తిరిగి తనకు తానుగా ఈ ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేసుకోలేదు.
ఇలా ప్యాచ్ లు గా ఉపయోగించే మందులను యాంటికోలినెర్జిక్ మందులు అంటారు. ఇవి శరీరానికి, మెదడు మధ్య ప్రసారమయ్యే కొన్ని రసాయన సంకేతాలను నిరోధిస్తాయి. తద్వారా తలతిగడాన్ని నిరోధించి మోషన్ సిక్ నెస్ ను నివారిస్తాయి. వీటి వినియోగంలో తప్పులు జరిగితే ఈ మందులు ఊపిరితిత్తుల్లో పక్షవాతం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూర్చరావడం, బ్రాంతి కలగడం వంటి తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించే ప్రమాదం ఉంటుంది. అలాగే వాంతులు, వికారం రాకుండా నివారించే మందులు కూడా ఇలాగే పనిచేస్తాయి. కాబట్టి, అవి కూడా ప్రమాదకరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక వీటిని పిల్లలకు ఉపయోగించే మందు పూర్తి అవగాహనతో ఉండాలి తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి
- జ్వరంగా ఉండడం
- మూత్ర విసర్జన చెయ్యలేకపోవడం
- కన్ఫ్యూజన్
- ఏకాగ్రత లోపించడం
- బ్రమలు కలుగడం
- ఫిట్స్ రావడం
- మగతగా ఉండడం
- శ్వాసలో ఇబ్బంది
ఇలాంటి లక్షణాల్లో కొన్ని కనిపించినా సరే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ప్యాచ్ వెంటనే తొలగించాలి. ఒకవేళ జ్వరం తీవ్రంగా ఉంటే వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. మందుకు సంబంధించిన ప్యాకింగ్ మీద దుష్ప్రభావాల జాబితాలో హైపర్ థెర్మియాను కూడా చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్యాచ్ లు సరైన పద్ధతిలో వాడుకుంటే సురక్షితమైనవి. కానీ పూర్తి అవగాహనతో ఇవి పిల్లలకు వాడాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు అంత పెద్ద నష్టం వీటివల్ల జరగలేదని చెబుతున్నారు. అలాగే వాంతులు ఆపే ఔషదాలను కూడా ఇవ్వకపోవడం ఉత్తమం. మీ పిల్లలకు ప్రయాణం పడకపోయినట్లయితే కారు ముందు సీట్లో కూర్చోబెట్టడం బెటర్. లేదా ఒక కర్ఛీఫ్‌ను ఇచ్చి ముక్కుకు అడ్డుగా పెట్టుకోమనండి. తాజా గాలి తగిలేలా కారు విండోస్ ఓపెన్ చేయండి.
Also read : ప్రపంచంలో హాయిగా 8 గంటలు నిద్రపోయేది ఆ దేశీయులే, లక్కంటే వాళ్లదే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.