ఆకలి రుచెరుగదు, నిద్ర సుఖమెరగదని మన పెద్దలు అంటుంటారు. నిద్రకు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. మరి ఈ రోజుల్లో ఎవరు హాయిగా నిద్రపోగలుగుతున్నారని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఉండదు. ఎందుకంటే.. డబ్బున్నవాడు తన సంపద ఎక్కడ తరిగిపోతుందనే భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతాడు. అలాగే, డబ్బులు లేనోడు.. తన భవిష్యత్తు ఏమిటో అనే ఆలోచనతో నిద్రపోలేడు. అయితే, ఆ దేశీయులు మాత్రం ఈ విషయంలో చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. వారు కంటి నిండా ఎనిమిది గంటలు నిద్రపోతున్నారు.
పిన్లాండ్ ప్రజలు ప్రపంచంలోనే అత్యుత్తమ నిద్రను ఆస్వాదిస్తున్నారట. అందుకే ఆ దేశం అత్యంత ఆనందరకర దేశాల జాబితాలో కూడా స్థానం పొందింది. ఇక్కడ నివసిస్తున్న వారు ప్రతి రాత్రి ఎనిమిది గంటల పాటు నిద్రిస్తున్నారని అధ్యయనకారులు వెల్లడించారు.
ఇక వీరి తర్వాత స్థానం ఫ్రెంచి వారిది. ఫ్రెంచి వారు దాదాపుగా 7 గంటల 45 నిమిషాల పాటు ప్రతి రాత్రి సౌండ్ స్లీప్ లో ఉంటున్నారట. ఇక మూడో స్థానం అగ్రరాజ్యం సొంతం చేసుకుంది. వీరు దాదాపు 6 గంటల 51 నిమిషాల పాటు నిద్రను ఏలేస్తున్నారట.
ఈ అధ్యయనం కోసం యూకే, కొరియా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు 11 దేశాల్లోని 30,082 మంది స్లీప్ ప్యాటర్న్ ను గమనించారట. ఎంపిక చేసుకున్న వ్యక్తుల నిద్రా విధానాలను 2014 నుంచి 2017 వరకు స్మార్ట్ వాచీలు, సర్వేల వివరాలను ఉపయోగించి పర్యవేక్షించారట. సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో ప్రచురించిన ఫలితాలు సగటున అర్థరాత్రి నిద్రకు ఉపక్రమించి ఉదయం 7.42 కి మేల్కొంటున్నట్టు గమనించారట. అయితే నిజంగా నిద్రలో గడిపే సమయం విషయంలో దేశాల మధ్య అంతరం ఉందని వారు వివరిస్తున్నారు.
ఫిన్లాండ్ కు చెందిన వారు మొత్తం భూమండలంలో ఉల్లాసంగా గడుపుతున్న జనాభాగా ఇది వరకే అధ్యయనకారులు రుజువు చేశారు. రాత్రి 11.43 నిమిషాల నుంచి మరుసటి ఉదయం 7.43 వరకు ఎనిమిది గంట ఒకనిమిషం పాటు సగటున నిద్రపోయి అగ్రస్థానంలో నిలిచారు.
ఇక రెండో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ ప్రజానీకం అర్థరాత్రి 12.06 నుంచి మరుసటి ఉదయం 7.53 వరకు దాదాపు 7 గంటల 45 నిమిషాల పాటు నిద్రలో గడిపుతున్నారు. యూకే వారు రాత్రి 11.52 నుంచి ఉదయం 7.38 నిమిషాల వరకు నిద్రపోతూ ఒకే ఒక నిమిషం తేడాతో మూడోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. స్వీడన్, జర్మనీ, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రియా, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలన్నీ కూడా నిద్ర విషయంలో ఎక్కడో మధ్యలో ఉన్నాయి. జపాన్ వాసులు సగుటున 6 గంటల 51 నిమిషాలు మాత్రమే నిద్రకు కేటాయించగలుగుతున్నారట.
ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లోని వారు చాలా తక్కువ మొత్తంలో నిద్రపోతున్నట్టు కనిపించారని కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నోకియా బెల్ ల్యాబ్స్ కి చెందిన ఎక్స్ పర్ట్స్ నిర్ధారిస్తున్నారు. ఇందుకు వారికి ఎక్కువ సమయం పాటు పనిలో గడపాల్సి రావడం, కఠినమైన షెడ్యూల్స్ అమలులో ఉండడం, లేదా వినోదానికి, టెక్నాలజీ ప్రభావం ఎక్కువగా ఉండడం వంటి అంశాలు కారణం కావచ్చని అంటున్నారు.
ఈ అధ్యయనంలో క్రమం తప్పని వ్యాయామ షెడ్యూల్ కలిగిన వారు రోజులో ఎక్కువ సమయం పాటు కాలినడకలో గడిపేవారు మెరుగైన నిద్ర కలిగి ఉంటున్నట్టు నిర్ధారణ అయ్యింది. అంటే కాలి నడక ఎక్కువగా ఉన్న వారు, తరచుగా వ్యాయామం చేసే వారు రాత్రి సమయం మేల్కొని ఉండేది తక్కువ నిద్రపొయ్యేది ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.
ప్రపంచంలో ప్రజలు హాయిగా నిద్రిస్తున్న దేశాలివే
ఫిన్లాండ్ – 8.01 గంటలు
ఫ్రాన్స్ – 7.45 గంటలు
యూకే – 7.44 గంటలు
స్వీడన్ – 7.41 గంటలు
జెర్మని – 7.39 గంటలు
స్వీడన్ – 7. 39 గంటలు
కెనడా – 7. 38 గంటలు
ఆస్ట్రియా – 7.35 గంటలు
యూఎస్ఏ – 7.34 గంటలు
స్పెయిన్ – 7.28 గంటలు
జపాన్ – 6.51 గంటలు
Also read : Mosquito Bites: దోమలు మిమ్మల్నే ఎందుకు కుడుతున్నాయని ఫీలవ్వుతున్నారా? బ్లడ్ గ్రూప్ వల్ల కాదు, అసలు రహస్యం ఇదీ!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.