Thyroid Hormone Imbalance Menstrual Cycle : మహిళల్లోని థైరాయిడ్ సమస్య పీరియడ్స్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్తున్నారు నిపుణులు. థైరాయిడ్ హార్మోన్స్ శరీరంలోని హార్మోన్ బ్యాలెన్స్‌ను కంట్రోల్ చేస్తాయి కాబట్టి.. వాటిలో మార్పులు వచ్చినప్పుడు పీరియడ్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. మరి థైరాయిడ్ వల్ల పీరియడ్స్ ఎలా ప్రభావితం అవుతాయో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు అదుపులో ఉంటాయో, నిపుణుల సూచనలు ఏంటో తెలుసుకుందాం.

Continues below advertisement

పీరియడ్స్ ఆలస్యం

థైరాయిడ్ హార్మోన్స్ అసమతుల్యం అయితే పీరియడ్స్ టైమ్‌కు రావు. కొన్నిసార్లు చాలా గ్యాప్ తర్వాత మాత్రమే వస్తాయి.

బ్లీడింగ్లో మార్పులు

హైపో థైరాయిడిజం ఉంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉండొచ్చు. హైపర్ థైరాయిడ్ ఉంటే బ్లీడింగ్ చాలా తక్కువగా ఉండొచ్చు. పీరియడ్స్ మిస్ అవడం కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ పూర్తిగా ఆగిపోవచ్చు. ఇది హార్మోన్ అసమతుల్యత వల్ల జరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్స్​ను బాగా ప్రభావితం చేస్తుంది.

Continues below advertisement

ఫెర్టిలిటీపై ప్రభావం..

థైరాయిడ్ సమస్యల వల్ల అండం విడుదల సరిగ్గా జరగకపోవచ్చు. దీని వల్ల ఫెర్టిలిటీపై ప్రభావం ఉంటుంది. థైరాయిడ్ సరిగ్గా కంట్రోల్‌లో లేకపోతే కన్సీవ్ కావడం కష్టమవుతుంది లేదా ప్రెగ్నెన్సీకి రిస్క్ ఉంటుంది.

ఇవే కాకుండా హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా అనిపించవచ్చు. అలాగే చిరాకు, డిప్రెషన్, అలసట పెరుగుతాయి. అయితే థైరాయిడ్ వల్ల పీరియడ్స్ డిస్టర్బ్ అవుతుంటే.. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే..

రెగ్యులర్‌ టెస్టులు

TSH, T3, T4 లెవల్స్‌ను రెగ్యులర్​గా చెక్ చేయించుకోవాలి. దీంతో పరిస్థితి కంట్రోల్‌లో ఉందో లేదో తెలుస్తుంది. అలాగే వైద్యులు సూచించిన థైరాయిడ్ మందులు టైమ్‌కు తీసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కరోజు మిస్ అయినా హార్మోన్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది.

హెల్తీ డైట్

థైరాయిడ్ కంట్రోల్ చేయడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది. ఐయోడిన్ తీసుకోవడంతో పాటు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచిది.

ఒత్తిడి తగ్గించుకోండి..

అధిక ఒత్తిడి కూడా హార్మోన్స్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేస్తే మంచిది. దీనితో పాటు రోజూ 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది.

బరువు నియంత్రణ

థైరాయిడ్ వల్ల బరువు పెరగడం/తగ్గడం జరుగుతుంది. కాబట్టి హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. బరువు పెరగడం మరింత ప్రమాదకరం కావచ్చు.

ఇవేకాకుండా పీరియడ్స్ రెగ్యులర్​గా వస్తున్నాయో లేదో ట్రాక్ చేసుకోవాలి. రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అధికంగా ప్రాసెస్ చేసిన ఫుడ్, సోయా ప్రొడక్ట్స్ తగ్గించాలి. పీరియడ్స్​లో మార్పులు గమనిస్తే గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రినాలజిస్ట్‌ను సంప్రదించాలి. వారి సూచనలతో సరైన జాగ్రత్తలు తీసుకుంటే థైరాయిడ్​ కంట్రోల్ అవ్వడంతో పాటు పీరియడ్ సమస్యలు దూరమవుతాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.