These creatures have Regenerative system: స్వభావ సిద్ధంగా ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. దాని అవసరానికి అనుగుణంగా పరిస్థితులను బట్టి రక్షణ కోసం వాటి నిర్మాణం ఉంటుంది. ఈ ప్రత్యేకతలు పక్షులు, చెట్లు, జంతువులు, చిన్న చిన్న జీవుల్లో సైతం కనిపిస్తాయి. కొన్ని చెట్లకు ముళ్లుంటాయి. కొన్ని చెట్లు అల్లుకుంటాయి. కొన్ని చెట్ల కాండానికి కాయలు కాస్తాయి. వేరుసెనగ వంటి వాటికి భూమిలో కాయలు పెరుగుతాయి. అలాగే కొన్ని జంతువులు బలంగా పరిగెత్తగలవు, పులులు, సింహాలు వంటి వాటికి పంజాలుంటే, ఎద్దులు, దున్న, గేదెలు, జింకలు వంటి జంతువులకు కొమ్ములుంటాయి. అయితే మనం చెప్పుకున్న ఈ జాతులన్నీ దెబ్బతగిలితే గాయమైన చోట తిరిగి చర్మం ఏర్పడే వరకు సమయం పడుతుంది. కానీ కొన్ని రకాల జంతువులు, సముద్ర జీవులు అవసరాన్ని బట్టి తమ శరీరాన్ని తామే విసర్జించడం తిరిగి పునరుత్పత్తి చేసుకోవడం చేస్తుంటాయి. ఇది వాటి ప్రత్యేకత.. అందుకే సృష్టి చాలా విచిత్రమైనది అంటాం. మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే ప్రత్యుత్పత్తి వ్యవస్థ కలిగిన కొన్ని జీవుల గురించి చూద్దాం.
ఆక్సోలోట్స్
మెక్సికోకి చెందిన ఆక్సోలోటల్స్ అనేది ఒక రకమైన సాలమండర్ జాతి చేప. ఇవి జీవితాంతం అవయవాలు, వెన్నుపాము, హృదయాలు, మెదడులోని భాగాలను కూడా పునరుత్పత్తి చేయగలవు.
పీతలు
పీతలు కోల్పోయిన పంజాలు, కాళ్ళను పునరుత్పత్తి చేయగలవు. గాయపడినప్పుడు దెబ్బతిన్న భాగాలను వదిలేస్తుంది. తన తదుపరి మౌల్టింగ్ చక్రంలో కొత్తదాన్ని తిరిగి ఉత్పత్తి చేసుకుంటుంది.
జింక
సంభోగం సీజన్ కోసం సంసిద్ధంగా ఉండేందుకు మగ జింకలు ఏటా తమ కొమ్ములను తొలగిస్తాయి. ఆ తర్వాత మళ్లీ వాటిని మునుపటి సెట్ కంటే మరింత విస్తృతంగా తిరిగి పెంచుతాయి
బల్లులు
మాంసాహార జంతువుల నుంచి తప్పించుకోవడానికి అనేక బల్లి జాతులు తమ తోకలను వేరు చేసుకోగలవు. కాలక్రమేణా కోల్పోయిన తోకను తిరిగి పెంచుతాయి. అయితే కొత్తది భిన్నంగా కనిపించవచ్చు.
న్యూట్స్
సాలమండర్లకు సంబంధించి న్యూట్స్, వాటి అవయవాలు, కళ్ళు, వెన్నుపాము, హృదయాలు, ప్రేగులు, ఎగువ దిగువ దవడలను పునరుత్పత్తి చేయగలవు.
ప్లానరియన్లు
ఇది జలగ వలే ఉంటుంది. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు వాటి పునరుత్పత్తి శక్తికి ప్రసిద్ధి చెందినది. ముక్కలుగా కత్తిరించిన ప్రతి భాగం కూడా తిరిగి అన్ని అంతర్గత అవయవాలతో పూర్తి ప్లానేరియన్‌గా పెరగడం దీని గొప్పదనం.
కుకుంబర్స్
చూసేందుకు మొక్క మాదిరిగా ఉండే ఈ జీవి తనను తాను కాపాడుకునేందుకు వాటి అంతర్గత అవయవాలను త్యజించగలవు. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అవయవాలను అంతే త్వరగా తిరిగి పెంచగలవు.
స్టార్ ఫిష్
స్టార్ ఫిష్ శాస్త్రీయ నామం ఆస్టెరియాస్ రూబెన్స్. స్టార్ ఫిష్ కోల్పోయిన అవయవాలను పునరుత్పత్తి చేయగలదు. కొన్ని సందర్భాల్లో, సెంట్రల్ డిస్క్‌లో కొంత భాగం మిగిలి ఉంటే, ఒక వేరుచేయబడిన చేయి నుండి పూర్తిగా కొత్త స్టార్ ఫిష్ అభివృద్ధి చెందుతుంది. ఇది దాని ప్రత్యేకత.
Also Read : హస్తప్రయోగం ఎక్కువగా చేస్తే ఆ సమస్యలు తప్పవట.. అపోహలు, వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే