Actor Raj Tarun Case: రాజ్ తరుణ్  కేసులో మరో ట్విస్ట్- డ్రగ్స్ అలవాటు చేసిందని లావణ్యపై ఫిర్యాదు

Actor Raj Taruns case | రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, గర్భవతిని చేశాడని ఆరోపించి సంచలనం రేపిన లావణ్య.. ఆపై డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుపోతోంది. డ్రగ్స్ అలవాటు చేసిందని ఆమెపై ఫిర్యాదు చేశారు.

Continues below advertisement

Raj Tarun-Lavanya Case | హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, ఆయన ప్రియురాలు లావణ్య వ్యవహారం మరింత ముదురుతోంది. ఇదివరకే లావణ్య, రాజ్ తరుణ్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోగా, తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని ఉదయ్, ఓ యువతి పోలీసులను ఆశ్రయించారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్యపై ఫిర్యాదు చేశారు. లావణ్యతో తమకు కొన్నేళ్ల నుంచి పరిచయం ఉందని, అయితే డ్రగ్స్ విషయంలో ఇప్పటికీ తమకు ఫోన్ చేసి లావణ్య ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Continues below advertisement

రాజ్ తరుణ్ కి ప్రాణహాని ఉంది, లాయర్ సంచలన ఆరోపణలు 
రాజ్ తరుణ్ పై లావణ్య తప్పుడు ఆరోపణలు చేసిందని, నటుడికి ప్రాణహాని ఉందని రాజ్ తరుణ్ అడ్వకేట్ మధు శర్మ అన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద రాజ్ తరుణ్ అడ్వకేట్ మధు శర్మ మాట్లాడుతూ.. లావణ్యపై ఫిర్యాదు చేశాం. మూడు రోజుల్లో పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పిస్తాం. నిజంగానే లావణ్య ఆడపిల్లలకు డ్రగ్ అలవాటు చేస్తుంది. ఆమె డిమాండ్లకు ఒప్పుకోకపోతే లావణ్య నానా రకాలుగా సాధిస్తుంది. అశ్లీల వీడియోలు పెట్టి టార్చర్ పెట్టింది. ప్రస్తుం ఉదయ్ తో పాటు ఓ యువతికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అందుకే వారు కూడా లావణ్యపై నార్సింగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ సమయంలో నటుడు రాజ్ తరుణ్, ఆయన స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషా కూడా వెంట ఉన్నారు.

లావణ్య, రాజ్ తరుణ్ మధ్య చిచ్చురేపిన డ్రగ్స్..
డ్రగ్స్ ఎంకరేజ్ చేయకపోవడం వల్లే రాజ్ తరుణ్ పై మాజీ లవర్ లావణ్య కక్ష పెంచుకుందని లాయర్ తెలిపారు. నటుడు రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే లావణ్య ఇదంతా చేస్తుంది. రాజ్ తరుణ్‌తో పాటు పలువురిని డ్రగ్స్ విషయంలో లావణ్య ఇబ్బందులు పెడుతోంది. లావణ్య కొంతమందిని డ్రగ్స్ విషయంలో భయపెట్టి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తోందని’ ఆరోపించారు.  

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితంలా కావొద్దు..
లావణ్య కావాలనే రాజ్ తరుణ్ పై, మరికొందరిపై తప్పుడు ఆరోపణలు చేసిందని, ఈ కేసులో న్యాయ పరంగా ఎంత దూరమైనా వెళ్తామన్నారు. మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లా రాజ్ తరుణ్ జీవితం మారకుండా చూసుకోవాలన్నారు. లావణ్య, ఓ యువతికి సంబంధించిన వీడియోలు విడుదల చేసిన విషయంపై సైతం ఫిర్యాదులో పేర్కొన్నట్లు రాజ్ తరుణ్ అడ్వకేట్ మధు శర్మ వెల్లడించారు. 

Also Read: Raj Tarun: లావణ్యకు అబార్షన్ చేయించారా? - రాజ్‌ తరుణ్‌ ఏమన్నాడంటే.. 

లావణ్య చిన్న పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేస్తోందని, ఆమె డ్రగ్స్ తీసుకోవడంతో పాటు ఎందరో అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆర్జే శేఖర్ బాషా సంచలన ఆరోపణలు చేశాడు. రాజ్ తరుణ్ ‌కు మద్దతుగా శేఖర్ భాషా రంగంలోకి దిగిన తరువాత ఈ కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. వ్యక్తిగత చీటింగ్ కేసు, త్వరలో డ్రగ్స్ కేసుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనపై డ్రగ్స్ అలవాటు చేస్తుందన్న ఆరోపణలు చేసిన శేఖర్ బాషాను లావణ్య చెప్పుతో కొట్టడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో శేఖర్ బాషా ఆరోపణల్ని నిజం చేసేలా, ఓ యువతి, యువకుడు లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని, ఇప్పుడు వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. 

Also Read: Ajay Shastri: టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మృతి - మిస్ యూ బాబాయ్ అంటూ మంచు మనోజ్ నివాళులు

 

Continues below advertisement