Daily Horoscope for 3 August 2024

మేష రాశి

ఈ రోజు మీరు ఇంటి సమస్యలను పరిష్కరిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు. సానుకూల స్వభావం ఉన్న వ్యక్తులతో సమయం గడపండి. వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. కళారంగంతో అనుబంధం ఉన్నవారికి శుభసమయం

వృషభ రాశి 

మీరు సమర్థతకు అనుగుణంగా పని చేయడం ద్వారా ప్రయోజనాలను పొందుతారు. దూర ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటారు.  సోదరులు, సోదరీమణుల నుంచి మద్దతు పొందుతారు. ఆశించిన ఫలితాలు రావడంతో ఉత్సాహంగా ఉంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. 

మిథున రాశి

ఈ రోజు మీరు పెద్దల నుంచి ఆశీర్వాదం పొందుతారు. రాజకీయ పరిచయాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ పిల్లల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. మీ నుంచి మార్గదర్శకత్వం ఆశిస్తారు. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. 

Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!

కర్కాటక రాశి

ఈ రోజు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ పనిని చక్కగా చేయడానికి ప్రయత్నించండి. మీరు వ్యాపారంలో భారీ లాభాలను పొందవచ్చు. పదవి, అధికార కాంక్ష పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. 

సింహ రాశి 

ఈ రోజు మీరు చేపట్టే పనిలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. వైవాహిక సంబంధాలలో విభేదాలు ఉండవచ్చు. అతిథుల ఆకస్మిక రాకతో మీరు కంగారుపడతారు. వ్యాపారానికి సంబంధించి నిపుణుల నుంచి సలహా తీసుకోవచ్చు:

కన్యా రాశి

ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  కొత్తగా, ప్రయోగాత్మకంగా ఏదైనా చేయాలనుకుంటారు. మీరు రోజువారీ పనులకు అనుకున్న టైమ్ కి పూర్తిచేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా అడుగువేస్తారు. వ్యాపారంలో లాభపడతారు. 

తులా రాశి

ఈరోజు కుటుంబ వాతావరణం బాగుంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారానికి సంబంధించి కొనసాగుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. 

Also Read: పాపం చేసిన వెంటనే దేవుడు శిక్ష వేసేయొచ్చు కదా..వచ్చే జన్మవరకూ ఎందుకు ఆగాలి!

వృశ్చిక రాశి

ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు మరింత ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. నియమ, నిబంధనల విషయంలో రాజీ పడొద్దు. సన్నిహితులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి

ఈ రోజు మీ ఆరోగ్యం బలహీనపడవచ్చు.  ప్రైవేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులు చాలా కష్టపడవలసి ఉంటుంది. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. కొత్త పనులు ఈరోజు  ప్రారంభించడం సరికాదు. వ్యాపార లావాదేవీలు విజయవంతమవుతాయి. 

మకర రాశి

ఈ రోజు మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు ఈ రోజు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కార్యాలయంలో మంచి నిర్వహణ కారణంగా మీరు ఒత్తిడిని అనుభవించవచ్చు. మీరు మీ భావాలను మీ ప్రేమికుడికి తెలియజేస్తారు 

కుంభ రాశి

ఈ రోజు వ్యాపార పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ ప్రవర్తనను మార్చుకోవడం మంచిది.  నిర్మాణ పనులకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. మీ ఆరోగ్యం మెరుగుపడేందుకు విశ్రాంతి అవసరం అని గుర్తించండి. 

Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!

మీన రాశి

ఈ రోజు వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. నిపుణుల మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఇదే మంచి సమయం. ఉన్నత విద్యకోసం విద్యార్థులు ప్రయత్నాలు సఫలం అవుతాయి.