Male Masturbation : హస్తప్రయోగం(Masturbation) అనేది కొన్ని సందర్భాల్లో మంచిదే అయినా.. ఎక్కువసార్లు చేస్తే దీనివల్ల కొన్ని అనర్థాలు కలుగుతాయి. ఈ విషయాన్ని నిపుణులే చెప్తున్నారు. అయితే హస్తప్రయోగం జరిగే నష్టాలు ఏంటి? అపోహలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిని చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


అపోహ


చాలామంది హస్తప్రయోగం చేస్తే పింపుల్స్ (మొటిమలు) ఎక్కువగా వస్తాయి అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహనే అని చెప్తున్నారు నిపుణులు. అయితే కొన్ని నియమాలు పాటించకపోతే మొటిమలు వస్తాయని చెప్తున్నారు. హస్తప్రయోగం తప్పు కాదని.. అదొక ఆర్గాజం మాత్రమే అంటున్నారు. కానీ ఆ పని తర్వాత శుభ్రత పాటించకుంటే మాత్రం మొటిమలు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. చేతులు వాష్ చేసుకోకుండా మొఖంపై పెడితే.. కచ్చితంగా మొటిమల సమస్య వస్తుందని చెప్తున్నారు. 


ఎక్కువసార్లు చేస్తే..


కొందరు హస్తప్రయోగం ఎక్కువసార్లు చేస్తారని.. ఇలా చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శారీరకంగా పాల్గొనే సమయంలో మగవారికి శరీరమంతా కదలికలు ఉంటాయని.. దానివల్ల రక్తప్రసరణ పెరుగుతుందని చెప్తున్నారు. మెరుగైన రక్తప్రసరణ ఆరోగ్యానికి మంచిదని.. కానీ హస్త ప్రయోగమనేది శరీరంలో కదలికలు లేకుండా చేసే పని కాబట్టి పలు సైడ్ ఎఫెక్ట్ ఉంటాయంటున్నారు. 


ఆ సమస్యలు తప్పవు


లైంగిక సమయంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలై ఒత్తిడి తగ్గి రిలాక్స్​గా ఉంటుంది. హస్తప్రయోగంతో కాస్త రిలీఫ్ వచ్చినా.. శరీరం యాక్టివ్​గా లేకపోవడం వల్ల కండరాలు వదులైపోయే అవకాశముందని చెప్తున్నారు. బాడీ షేప్​ కూడా మారిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఇది ఫ్యూచర్​లో లైంగిక సమస్యలు తీసుకొస్తాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కండరాలు కదలకపోవడం వల్ల, వదులుగా మారడం వల్ల శరీరంలో ఫ్యాట్​ కూడా ఎక్కువ పేరుకుపోతుందని వెల్లడించారు.


హార్మోనల్ సమస్యలు


ఇవేకాకుండా ఎక్కువగా హస్తప్రయోగం చేయడం టెస్టోస్టిరాన్ ఎక్కువగా విడుదలవుతుందని.. ఇది జుట్టు కుదుళ్లపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. దీనివల్ల జుట్టురాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఎక్కువ అవుతుందని వెల్లడించారు. మగవారిలో హార్మోన్స్ వల్ల కలిగే అన్నిరకాల సమస్యలు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంపై వెంటుక్రలు పెరగడం వంటి ఎఫెక్ట్​లు, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. 


అయితే హస్తప్రయోగం అనేది రోజుకి ఒకసారి చేసుకుంటే మంచిదని.. ఎక్కువసార్లు చేస్తే అస్సలు మంచిది కాదని చెప్తున్నారు. హస్తప్రయోగం చేసేముందు, చేసిన తర్వాత కూడా కనీస శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల మొటిమలు, బట్టతల వంటివాటిని దూరం చేసుకోవచ్చని అంటున్నారు. 


Also Read : పిల్లలు పుట్టేందుకు ఏజ్ లిమిట్ ఉందా? ఆ వయసు దాటితే పేరెంట్స్ కాలేరా?








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.