Lucky Foods: ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య లేదా కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని తీర్చే దారులు వెతుకుతుంటారు. హిందూ సాంప్రదాయంలో కొన్ని రకాల పనులు చేయడం ద్వారా కష్టాలు తీర్చుకోవచ్చనే నమ్మకాలు ఉన్నాయి. మనసును ప్రశాంతంగా ఉంటే ఏ సమస్య అయినా తీర్చే ఆలోచనలు వస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచుతూ మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని కష్టకాలంలో తింటే మంచి ఫలితాలు వస్తాయని అంటారు. 


పసుపు
హిందూ సంప్రదాయాల ప్రకారం పసుపు చాలా పవిత్రమైనది. ఇది బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ గ్రహం ఇచ్చే శక్తిని పసుపు కూడా ఇస్తుందని అంటారు. దీన్ని హిందీలో హల్దీ అని,సంస్కృతంలో హరిద్ర అని పిలుస్తారు. భారతీయ వంటల్లో ఉపయోగించే ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటి. వీటిలో చాలా  ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వంటల్లో పసుపును ఉపయోగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. జీవితంలో సంపదను స్వాగతించడానికి ఆహారంలో పసుపును కలుపుకుని తినడం మంచిదని అంటారు. 


పచ్చ యాలకులు
యాలకులను'క్వీన్ ఆఫ్ స్పైసెస్' అని పిలుస్తారు. ఈ సుగంధ ద్రవ్యం వీనస్ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. యాలకును తినడం అలవాటు చేసుకుని చాలా మంచిది. దీనికి మనసును శాంతపరిచే, గందరగోళాన్ని తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. మీకు ఆలోచన పట్ల స్పష్టతను ఇస్తుంది. భారమైన భావాలను మనసు నుంచి తొలగిస్తుంది. వారి జీవితంలో కెరీర్ వృద్ధి అవకాశాలను ఆహ్వానించడానికి ఈ మసాలాను తినాలి. 


పెరుగు పంచదార
పరీక్షలు రాయడానికి బయల్దేరే ముందు, కొత్త వ్యాపారం ప్రారంభానికి ముందు, ఏదైనా ప్రయాణానికి ముందు పెరగులో చక్కెర కలుపుకుని తింటే చాలా మంచిది. ఇది అదృష్టాన్ని తెస్తుంది. మానసిక కల్లోలాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే, పెరుగు ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే  బ్యాక్టీరియాను పొట్టలో పెంచుతుంది. కష్ట సమయాల్లో పెరుగు, పంచదార కలిపి తింటే మీకు అంతా మంచే జరిగే అవకాశం ఉంది. 


అరటిపండు
ఈ పండులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం అరటిపండు మీ జీవితానికి ఆనందాన్ని తెస్తుంది. ఎవరైనా కుటుంబకలహాల బారిన పడితే అరటి పండ్లు రోజూ తినాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి.


నల్ల మిరియాలు
మిరియాలు చాలా శక్తిని కలిగి ఉంటాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం నల్ల మిరియాలు దిష్టి తగలకుండా కాపాడతాయి. ఇవి శనిగ్రహంతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటిని కాలీ మిర్చ్ అని పిలుస్తారు. 


Also read: ఈ లక్షణాలు కనిపిస్తే మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ వ్యసనంగా మారినట్టే, జాగ్రత్తపడక తప్పదు











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.