Heart health: ఈ మధ్య గుండెపోటు కేసులు ఎక్కువ అవుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. కోవిడ్-19 తర్వాత ఈ పరిస్థితి క్రమేనా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం చలికాలం నడుస్తోంది. కాబట్టి, ఈ కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గుండెపోటును నివారించేందుకు లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.


అలాగే, గుండెపోటుకు ముందు మీ శరీరంలో జరిగే మార్పులను కూడా మీరు గమనిస్తుండాలి. దానివల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చు. చాతిలో నొప్పి లేదా గుండెపోటు అనేది తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పవచ్చు. దీనికి సత్వరమే చికిత్స అందించాల్సి ఉంటుంది. క్షణాల్లో తేడా వచ్చిన ప్రాణం పోయే అవకాశం ఉంది. గుండెపోటు వచ్చినప్పుడు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గుండెపోటు నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలి.


గుండె నొప్పి వచ్చినప్పుడు ఇలా చేయండి


❤ ఛాతిలో నొప్పి కలిగిన వెంటనే మీరు వైద్య సహాయం పొందేందుకు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకొని చికిత్స ప్రారంభించినట్లయితే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడవచ్చు.


❤ చాతిలో నొప్పి వచ్చినప్పుడు మీ పనులను ఆపేసి రిలాక్స్‌గా కూర్చోవాలి. కంగారు పడకుండా కామ్‌గా ఉండాలి. కాస్త తగ్గినట్లు అనిపిస్తే కంగారు పడక్కర్లేదు. ఇంకా ఎక్కువ అవుతుంటే మాత్రం హాస్పిటల్‌కు వెళ్లాలి. 


❤ ఒక్కోసారి కడుపులో గ్యాస్ ఫామ్ అయినప్పుడు కూడా ఛాతిలో నొప్పి కలుగుతుంది.


❤ మీతోపాటు కుటుంబ సభ్యులకు సీపీఆర్‌పై అవగాహన ఉండాలి. గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే కార్డియో పల్మనరీ రెస్క్యూయేషన్ (సీపీఆర్) నిర్వహించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు.


❤ ఆసుపత్రిలో చేరడం వల్ల చికిత్సను వెంటనే అందించే వీలుంది. ముఖ్యంగా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్  ఫిబ్రిలేటర్ ద్వారా గుండెకు ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఇలా ఇవ్వడం వలన గుండెలో ప్రతిస్పందనలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  


❤ గుండెపోటు వచ్చినప్పుడు కేవలం ఛాతిలో నొప్పి మాత్రమే కాదు కొన్నిసార్లు నరాలు బిగుసుకుపోతాయి. యాంగ్జైటీ కూడా వస్తుంది, అజీర్తి కూడా చేస్తుంది.  


❤ చాలా సందర్భాల్లో చాతిలో నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటిని సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. అయితే ముందస్తుగానే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీరు గుండెపోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియెంట్ ఉనికిలో ఉంది. కాబట్టి, మాస్క్ ధరించండి. ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతున్నా.. ఇదివరకే కోవిడ్‌ వైరస్ సోకి కోలుకున్నా.. అప్రమత్తంగా ఉండాలి.


Also Read : ఇన్​స్టాంట్ ఇడ్లీ రెసిపీ.. మరమరాల(బొరుగులు)తో ఈజీగా చేసేయొచ్చు










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.