GIFT City Exempted From Liquor Ban : నూతన సంవత్సరం (New Year Celebrations ) సమీపిస్తున్న వేళ గుజరాత్ (Gujarath )ప్రభుత్వం (Government) సంచలన నిర్ణయం తీసుకుంది.  గిఫ్ట్‌ సిటీగా (GIFT City) పిలిచుకునే గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌ సిటీలో తొలిసారి మద్యానికి అనుమతి ఇచ్చింది. మద్యపాన నిషేధం అమలౌతున్న గుజరాత్‌ లో ప్రభుత్వం మద్యానికి అనుమతి ఇవ్వడంపై చర్చనీయాంశంగా మారింది. గాంధీనగర్‌లో ఏర్పాటైన గిఫ్ట్‌ సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ఆల్కహాల్‌ వినియోగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయంపై కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


మద్య నిషేధాన్ని ఎత్తివేయడానికే మొదట గిఫ్ట్‌సిటీని ఎంచుకున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్‌ తప్పుపట్టారు. గిఫ్ట్‌ సిటీలో మద్యానికి అనుమతి ఇవ్వడం ప్రభుత్వానికి ఎలాంటి లాభం చేకూరుతుందో అర్థం కావటం లేదని మండిపడ్డారు. గాంధీనగర్‌ గిఫ్ట్‌ సిటీలో మద్య నిషేధం లేకపోతే,  ఇక్కడి ప్రజలు అక్కడికి మద్యం సేవిస్తారని అన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆప్‌ హెచ్చరించింది. 


ఇన్వెస్టర్లను ఆకర్షించాలంటే మద్యం ఉండాల్సిందేనా ?
ఇన్వెస్టర్లను ఆకర్షించాలన్నా... ఆహ్వానించాలన్నా గ్లోబల్‌ బిజినెస్‌ ఎకో సిస్టమ్‌ ఉండాలన్నదే బీజేపీ సర్కార్ ప్రాధాన లక్ష్యం. అందుకే మద్యం వినియోగంపై నిబంధనలను సడలించింది. విదేశాల నుంచి రాష్ట్రానిక వచ్చే పర్యాటకులు, వ్యాపారవేత్తలు గిఫ్ట్‌సిటీలో పనిచేసే ఉద్యోగులు ఆల్కహాల్‌ను సేవించొచ్చు. అయితే ఈ సడలింపులు ఎప్పటి వరకు అమలులో ఉంటాయన్న దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 1960లో గుజరాత్‌ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి  మద్య నిషేధం అమలవుతోంది. జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా,  62 ఏళ్లుగా గుజరాత్ లో మద్యం విక్రయాలపై నిషేధం ఉంది. ఆరు దశాబ్దాల తర్వాత గిఫ్ట్ సిటీలో లిక్కర్ వినియోగంపై బ్యాన్ ఎత్తి వేశారు.


రాష్ట్రంలో పెరిగిన మద్యం విక్రయాలు
గత మూడేళ్లలో గుజరాత్ లో విదేశీ మద్యం, బీర్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.51.84 కోట్లు, తాజా ఆర్థిక సంవత్సరంలో 2022-23లో రూ.78.14 కోట్లకు విక్రయాలు పెరిగాయి. మద్యం అమ్మకాల ద్వారా రూ.200 కోట్ల ఆదాయం సమకూరింది. మార్చి 2023 నాటికి, విదేశీ మద్యం, బీరు విక్రయాల కోసం 76 లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. ఇందులో అహ్మదాబాద్ నగరంలోనే అత్యధికంగా 19 మంది లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. 


బీర్ కే మొదటి ప్రాధాన్యత
బీర్ అత్యంత ఇష్టపడే ఆల్కహాలిక్ మత్తు పానీయం. మద్యంప్రియుల్లో 63% మంది దీన్ని ఎంచుకుంటారు, తర్వాత 11% వైన్,  10% స్పిరిట్‌లు. అదనంగా, 16% మంది ఇతర రకాల ఆల్కహాల్‌ను ఇష్టపడతారు. దేశంలో ఇండియన్ మేడ్ ఇండియన్ లిక్కర్ , కంట్రీ లిక్కర్ 67% మార్కెట్ వాటా ఉంది. కంట్రీ లిక్కర్ మొత్తం మార్కెట్ విలువ రూ. 2.62 లక్షల కోట్లు. భారత్ జనాభాలో 33% మంది మద్యం సేవిస్తున్నారు. 2025 నాటికి ఇది 40%కి పెరగవచ్చని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ అంచనా వేసింది.