Viral news: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బిడ్డను కనాలని ప్లాన్ చేసుకుంటున్న సమయంలోనే అనుకోని ముప్పు వచ్చి పడింది. భర్త భయంకర వ్యాధితో మరణించాడు. ఆ జంట కలలు కల్లలైపోయాయి. కానీ భర్త చనిపోయిన రెండేళ్ల తరువాత భార్య అతని బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను తన భర్త ప్రతిరూపంగా చూసుకుంటోంది. ఈ  ఘటన బ్రిటన్లోని లివర్ పూల్ నగరంలో జరిగింది. లారెన్, క్రిస్ ఇద్దరూ భార్య భర్తలు. 2020లో క్రిస్ బ్రెయిన్ ట్యూమర్ తో చనిపోయాడు. అంతకుముందే వారు పిల్లల గురించి కలలు కనడం మొదలుపెట్టారు. కానీ ఊహించని రీతిలో ఇలా జరగడంతో లారెన్ కుప్పకూలిపోయింది. తన భర్త ఆఖరి కోరిక మాత్రం తీర్చాలనుకుంది. 


చనిపోయే ముందు
క్రిస్ అంతిమ ఘడియల్లో లారెన్ వైద్యుల సాయంతో భర్త వీర్యాన్ని భద్రపరిచింది. కృత్రిమ పద్ధతిలో (ఐవీఎఫ్) లారెన్ గర్భం ధరించింది. తొమ్మిది నెలలు నిండాక పండంటి బాబు పుట్టాడు. ఆ బాబుకు సెబ్ అని పేరు పెట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నా భర్తకు సెబ్ ని పరిచయం  చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది. వాళ్లిద్దరూ ఒకరికొకరు ఎప్పుడో కనెక్ట్ అయిపోయినట్టు అనిపిస్తోంది. నా భర్త ఎక్కుడున్నా తనలోని ఓ చిన్న భాగాన్ని కొడుకు రూపంలో నాకు ఇచ్చాడు’ అని చెప్పింది. 


‘నా కొడుకును చూస్తుంటే అతని తండ్రిలాగే కనిపిస్తాడు. అతను పుట్టినప్పుడు మందపాటి జుట్టుతో  తన నాన్నలాగే ఉన్నాడు. నా పెదవులు పలుచగా ఉంటాయి. కానీ సెబ్ పెదవులు వాళ్ల నాన్నలా నిండుగా ఉంటాయి’ అని భావోద్వేగానికి గురైంది.  


క్రిస్ కు ఇంతకుముందే పెళ్లయ్యింది. అతడి మొదటి భార్య కొడుక్కి ఇప్పుడు 18 ఏళ్లు. ఇప్పడు సెబ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లేది, ఎత్తుకుని తిప్పేది అన్నీ అతడే చేస్తాడు. పెద్దన్నయ్యే ఈ చిన్న తమ్ముడి బాధ్యతలు మోస్తున్నాడు అంటూ ఆనందపడుతోంది లారెన్. తండ్రిలా అన్ని బాధ్యతలు చూసుకుంటున్నాడని, ఆ వయసులో ఉన్న పిల్లలు ఇంత బాధ్యతగా ఉంటారనుకోలేదని చెబుతోంది లారెన్. 


చిన్నారి సెబ్‌కు తండ్రి లేకపోయినా, తండ్రిలా ప్రేమ చూపించే అన్నయ్య ఉన్నాడు. ఈ  బిగ్ బ్రదర్ పేరు వాడ్. అతను నిమిషం కూడా చిట్టి తమ్ముడిని వదలడం లేదు. 


Also read: మగవారిలో కోరికలు పెంచే హార్మోన్ టెస్టొస్టెరాన్, అది తగ్గితే కనిపించే లక్షణాలు ఇవే


Also read: డయాబెటిస్‌ రోగులు గ్లూటెన్ ఉన్న పదార్థాలు తినకూడదా? మరి చపాతీలలో గ్లూటెన్ ఉంటుందిగా?