చక్కెర దాగున్న ఏ ఆహారాన్ని డయాబెటిక్ రోగులు తినకూడదు. అన్నం లాంటివి తిన్నా చాలా తక్కువ మోతాదులోనే తినాలి. అలాగే గ్లూటెన్ ఉన్న ఆహారం గురించి కూడా చర్చలు బాగానే సాగుతున్నాయి. మార్కెట్లలో గ్లూటెన్  ఫ్రీ ఫుడ్ అని ప్యాకెట్ల మీద రాసి మరీ అమ్మతున్నారు. అసలేంటీ గ్లూటెన్? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి? డయాబెటిస్ ఉన్న తినవచ్చా?


ఏంటీ గ్లూటెన్?
గ్లూటెన్ అనేది ఒకరకమైన ప్రొటీన్. ఇది గోధుమ, బార్లీ వంటి వాటిల్లో లభిస్తుంది. బ్రెడ్, పాస్తా, పిజ్జా, నూడుల్స్, తృణధాన్యాలు, బీర్, బేకరీ ఐటెమ్స్, బిస్కెట్లు వంటి ఆహారాల్లో ఇది పుష్కలంగా ఉంటుంది. ఇది పెద్దగా పోషకాలను అందించదు. దీని వల్ల పెద్దగా లాభాలు కూడా లేవు. ఇందులో ఉండే గ్లియాడిన్ అనే మరో సబ్ ప్రొటీన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోని కొన్ని చెడు పరిణామాలకు కారణం అవుతుంది. అందుకే చాలా మంది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. గ్లూటెన్ ఉండే పదార్థాలు నీరు తగలగానే జిగటగా, సాగినట్టు అవుతాయి. 


ఆ సమస్య వచ్చే అవకాశం...
గ్లూటెన్ అందరికీ పడాలని లేదు. కొంతమందిలో సెలియక్ వ్యాధికి కారణం అవుతుంది. ఇది రోగినిరోధక వ్యవస్థ సొంత శరీరంపైనే దాడి చేసే విచిత్ర పరిస్థితి. ఇది పూర్తిగా గ్లూటెన్ కారణంగానే వస్తుంది. అయితే అందరిలోనూ రావాలని లేదు. గ్లూటెన్ తినకపోవడం వల్ల శరీరానికి వచ్చే పెద్ద నష్టమేమీ లేదు. కొందరిలో ఈ గ్లూటెన్ గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, తలనొప్పి, అలసట, డిప్రెన్, మల బద్ధకం వంటి సమస్యలకు కూడా కారణం అవుతుంది. 


డయాబెటిస్ ఉన్న  వారు?
అన్నం బదులు చపాతీలు, పరోటాలు తినే వారి సంఖ్య పెరిగింది. అన్నంలో చక్కెర దాక్కుని ఉంటుంది కాబట్టి వాటి బదులు చపాతీలు తింటున్నారు. అయితే గ్లూటెన్ డయాబెటిస్ ఉన్న వారికి నేరుగా ఎలాంటి ప్రమాదాన్ని కలుగజేయదు. చపాతీలు తిన్న తరువాత వారికి ఎలాంటి చెడు మార్పు కనిపించకపోతే, వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు.అయితే గ్లూటెన్ లో పాటూ కలిసే ఇతర ఆహారాల వల్ల మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు చపాతీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో వెంటనే పెరగవు. నెమ్మదిగా జీర్ణం అవుతుంది కాబట్టి, చక్కెర కూడా చాలా నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. కానీ గోధుమలతో చేసే బేకరీ ఐటెమ్స్ తింటే మాత్రం రక్తంలో షుగర్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. గ్లూటెన్ తో డయాబెటిస్ వారికి పెద్ద ప్రమాదమేమీ లేదు. 



Also read: కిలో చికెన్ కన్నా కిలో చింతచిగురు ధరే ఎక్కువ, ఈ సీజన్లో దానికెందుకంత క్రేజ్


Also read: సగ్గుబియ్యంతో టేస్టీ దోశెలు, కొబ్బరి చట్నీతో తింటే ఆ మజానే వేరు