Death Clock App : మనిషి చేతిలో లేనివి రెండే రెండు. ఒకటి పుట్టుక. రెండు మరణం. ఎప్పుడు తాను పుడతాడో తెలీదు.. అలాగే ఎప్పుడూ చచ్చిపోతాడో కూడా తెలీదు. మధ్యలో లైఫ్ అనే జర్నీని సుఖంగానో, కష్టంగానో ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కానీ రోజులు గడిచే కొద్ది.. లేదా కష్టాలు, బరువులు, బాధ్యతలు పెరిగే కొద్ది మరణ భయం వస్తుంది. ఆ సమయంలో తన లైఫ్​స్టైల్​ని మార్చుకుంటూ.. కూసింత ఎక్కువ బతికేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. యాక్సిడెంట్లు, ఇతర ప్రమాదాలు జరగకుండా ఉంటే.. సహజంగా ఎప్పుడు చనిపోతాడో తెలిస్తే.. అలెర్ట్​గా ఉంటారంటూ.. ఓ యాప్​ని మార్కెట్​లోకి తీసుకువచ్చారు. 


మరణ భయం అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ఎప్పుడు చనిపోతామో తెలుస్తే బాగుంటుందనే క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే తమ జీవనశైలి బట్టి ఎంతకాలం జీవిస్తారో అనేది నిపుణుల, వైద్యుల సహాయంతో ఎంతకాలం బతుకుతారో తెలుసుకుంటారు. మరికొందరు జాతకాలు, చేతి రేఖలు అంటూ ఆయుష్షు గురించి తెలుసుకుంటారు. ఎన్నో శతాబ్ధాలుగా దీనిని కొందరు ఫాలో అవుతున్నారు. అయితే మనుషుల సహాయం లేకుండా ఈసారి AI మీ ఆయుష్షు చెప్పేస్తుంది. మీరు ఎంతకాలం బతుకారో అనే చెప్పే 'డెత్ క్లాక్' ప్రస్తుతం మార్కెట్​లోకి వచ్చింది. 


డెత్ క్లాక్


డెత్ క్లాక్ అనేది కృత్రిమ మేథస్సు (AI) ఆధారిత యాప్. యాప్ లాంచ్​ అయిన కొద్దిరోజులకే ఇది సక్సెస్​ని అందుకుంది. జూలైలో దీనిని లాంఛ్​ చేస్తే.. ఇప్పుడు దానికి 1,25,000 మంది డౌన్​లోడ్ చేసుకున్నారు. దీనిని సబ్​స్క్రైబ్​ చేసుకుంటేనే సేవలు వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ AI దాదాపు 53 మిలియన్ల మంది పాల్గొన్న 1,200కు పైగా అధ్యయనాల డేటాను కలిగి ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇది మన డెత్​ని ఎలా చెప్తుందంటే.. 


డెత్ క్లాక్ పనితీరు.. 


మీరు చనిపోయే రోజు తెలుసుకోవాలనుకుంటే.. AI మీ ఆయుష్షును అంచనా వేయడానికి కొన్ని విషయాలు AIకి ఇవ్వాలి. మీరు తీసుకునే ఆహారం, ఒత్తిడి, నిద్ర సమచారం తీసుకుంటుంది. దీనిని ఉపయోగించి మీ ప్రామాణిక ఫ్​స్టైల్ ప్రకారం మీరు డెత్ గురించి చెప్తుంది. ఇది కేవలం డెత్ డే గురించి చెప్పడమే కాకుండా.. ఆరోగ్యం, ఫిట్​నెస్ విషయంలో కొన్ని మార్పులు చెప్పి.. మీ ఆయుష్షును పెంచుకునే మార్గాలు కూడా సూచిస్తుంది. ఇదే ఈ యాప్ ప్రత్యేకత. 


చాలామంది ఇలా డెత్ డే ని తెలుసుకోవడం ఒక నెగిటివ్​ రూపంలో చూస్తారు కానీ.. పాజిటివ్​గా దీని సేవలు వినియోగించుకోవచ్చనే వాదన ఈ యాప్​ విషయంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే.. కచ్చితంగా యాప్​ని డౌన్​లోడ్ చేసి సబ్​స్క్రైబ్ చేసుకోవాలట. సంవత్సరానికి 40 డాలర్లు చెల్లించాలి. ఇండియన్ కరెన్సీలో దీని ధర మూడువేలకు పైమాటే. 



కొన్ని మనచేతిలో ఉండవు. ఎవరు ఎప్పుడు చనిపోతారో.. ఎవరు ఎలా చనిపోతారో చెప్పడం నిజంగా కష్టమే. కానీ ఇలాంటిది ఒక యాప్ వినియోగించి.. జీవనశైలిలో మార్పులు చేస్తే.. చనిపోవడం గురించి కాదు.. ఆరోగ్యంగా బతకడం ఎలా అనేది తెలుస్తుందని కొందరు నిపుణులు చెప్తున్నారు. మరికొందరు మాత్రం డెత్ డే దగ్గరకు వచ్చేసరికి భయంతోనే కొందరు ఫట్ అయిపోతారంటూ.. నెటిజన్లు స్పందిస్తున్నారు. సరిగ్గా వినియోగించుకోగలిగితే ఇలాంటి డెత్ క్లాక్​లు ఆరోగ్యాన్ని కాపాడుకునే మూలికలగా మరికొందరు చెప్తున్నారు. 



Also Read : ఆరోగ్యానికి మంచిదని పచ్చివెల్లుల్లి తింటున్నారా? సైడ్ ఎఫెక్ట్స్, రోజుకు ఎన్ని తినాలో తెలుసుకోండి