Raw Garlic Benefits : వెలుల్లిలో ఎన్నో శతాబ్దాలుగా అనేక వంటల్లో ప్రధానంగా వినియోగిస్తున్నారు. అయితే ఇది వంటలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. ఆరోగ్యానికి, అందానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అయితే ఈ వెల్లుల్లిని కొందరు పచ్చిగా తినేస్తారు. మరికొందరేమో వంటల్లో రుచికోసం, ఆరోగ్యం కోసం అని వినియోగిస్తారు. ఇంతకీ వెల్లుల్లిని పచ్చిగా తినొచ్చా? పచ్చిగా తింటే బెనిఫిట్ ఉంటుందా? లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నిపుణులు ఇచ్చే సలహా ఏంటి? తెలుసుకునేముందు వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూసేద్దాం. 


వెల్లుల్లితో కలిగే ప్రయోజనాలు


వెల్లుల్లిలో అల్లిసిన్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి జలుబు, ఫ్లూ, ఇతర ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె ప్రమాదాలు తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పలురకాల క్యాన్సర్​లను నిరోధించడంలో సహాయం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, ఫ్లూ వంటి ఇతర ఇన్​ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. గట్ బ్యాక్టీరియాను మెరుగుపరిచి పలు రకాల జీర్ణ ప్రయోజనాలు కూడా అందిస్తాయి. ఇన్ని ప్రయోజనాలిచ్చే వెల్లుల్లిని పచ్చిగా తినొచ్చా?


పచ్చివెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలు (Benefits of Raw Garlic)


రోగనిరోధక శక్తి : పచ్చి వెల్లుల్లిని తింటే దానిలోని కాంపౌండ్స్, యాంటీమైక్రోబయాల్, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. చలికాలంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. 


యాంటీఆక్సిడెంట్లు : పచ్చి వెల్లుల్లిని నేరుగాతింటే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బతినకుండా హెల్ప్ చేస్తాయి. ఒత్తిడిని దూరం చేస్తాయి. 


గుండె ఆరోగ్యం : పచ్చి వెల్లుల్లిని తింటే కొలెస్ట్రాల్​ స్థాయిలు కంట్రోల్ ఉంటాయి. ఇవి గుండె సమస్యలను దూరం చేస్తాయి. 


బ్యూటీ టిప్స్ : వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. వెల్లుల్లిలోని సల్ఫర్ కంటెంట్ జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. 


Also Read : వెల్లుల్లి పచ్చడితో క్యాన్సర్, కొలెస్ట్రాల్​కు చెక్​.. మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా, ఇన్​స్టాంట్ రెసిపీ ఇదే


రోజుకి ఎంత తినొచ్చంటే.. 


పచ్చివెల్లుల్లిని రోజూ తీసుకోవాలనుకుంటే 1 లేదా 2 రెబ్బలు తీసుకుంటే మంచిది. ఫ్రెష్​గా, ఆర్గానిక్​గా ఉండే వెల్లుల్లిని తింటే మంచి ప్రయోజనాలు అందుతాయి. పాతవి లేదా మొలకెత్తిన వెల్లుల్లిని తినకూడదు. క్రష్ చేసి లేదా చాప్ చేసి తింటే దానినుంచి ఎంజైమ్లు విడుదలవుతాయి. వీటిని ఎక్కువగా ప్రాసెస్​ చేస్తే న్యూట్రింట్స్ తగ్గిపోతాయి. ఇతర ఫుడ్స్​తో కలిపి తినడం కంటే.. తేనెలో ముంచుకుని తింటే మంచిది. 



పచ్చివెల్లుల్లి తింటే కలిగే నష్టాలు


వెల్లుల్లిని పచ్చిగా తింటే కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. మరికొందరిలో దురద, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. మెడిసిన్స్ ఉపయోగించేవారు కచ్చితంగా వైద్యుల సలహాతో తీసుకుంటే మంచిది. 



Also Read : యాపిల్స్​తో ఆ సామర్థ్యం పెరుగుతుందట.. ఫస్ట్​ నైట్ గదిలో పండ్లు పెట్టేది అందుకేనా?



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.