Top Headlines In AP And Telangana:


1. అమెరికా కేసుతో జగన్‌కు రాజకీయంగా మరిన్ని సమస్యలు


అధికారం పోయి ఇబ్బంది పడుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అమెరికా నుంచి వచ్చి పడిన అదానీ కేసు సమస్యగా మారింది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. విషయం బయటపడిన దాదాపు వారం రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసలు తనకు ఆ కేసు గురించే తెలియదన్నారు. ఎఫ్‌బీఐ చార్జిషీట్‌లో తన పేరు లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని కూడా హెచ్చరించారు. ఇంకా చదవండి.


2. సచివాలయ ఉద్యోగ సంఘం నేత మందు పార్టీ


 సచివాలయం ఉద్యోగులు సంఘం నేత వెంకటరామిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా ఉద్యోగులకు మందుపార్టీ ఇస్తూ సమస్యలు కొనితెచ్చుకున్నారు. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు చేసిన ఎక్సైజ్‌, పోలీసు అధికారులు వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయం క్యాంటిన్ ఎన్నికల వేళ వెంకటరామిరెడ్డి చర్యలు వివాదానికి కారణమయ్యాయి. కొందరు సిబ్బందితో ఆయన మందుపార్టీ చేసుకున్నారు. కొంత మంది సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇంకా చదవండి.


3. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం


తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన లగచర్ల భూ వివాదంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా లగచర్ల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అక్కడ పారిశ్రామిక వాడ నిర్మించాలని భావించిన ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. భూసేకరణ విషయంపై చర్చించేందుకు రావాలని స్థానికులు పిలుపు మేరకు వెళ్లిన జిల్లా కలెక్టర్ ఇతర సిబ్బందిపై ప్రజలు దాడి చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. ఇంకా చదవండి.


4. కొమురంభీం జిల్లాలో దారుణం


కొమురంభీం జిల్లాలో దారుణం జరిగింది. కొన్ని రోజులు భయాందోళనలకు గురి చేస్తున్న పెద్ద పులి మనుషులపై పడింది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తూ వస్తున్న పెద్ద పులి ఈ ఉదయం కాగజ్‌నగర్ మండలం గన్నారంలో మహిళపై అటాక్ చేసింది. పెద్దపులి దాడిలో ఆ మహిళ స్పాట్‌లోనే చనిపోయింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్‌లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ పై పులి దాడి చేసింది. పులి దాడిలో గాయపడిన మొర్లే లక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. ఇంకా చదవండి.


5. మిర్యాలగూడ నుంచి సైబర్ నేరాలు


తెలంగాణలో నమోదు అవుతున్న సైబర్ కేసుల్లో మరో సంచలనం నమోదు అయింది. నేరగాళ్లతో చేతులు కలిపిన తెలుగు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానాస్పదంగా ఓ ప్రాంతంలో ఖాతాల్లోకి లక్షల్లో నగదు వచ్చి పడటాన్ని గుర్తించి విచారిస్తే అసలు గుట్టు వెలుగు చూసింది. వేర్వేరు రాష్ట్రాల్లో ఉంటూ వేలి కొనలతోనే వేల మందిని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఇలాంటి సైబర్ కేటుగాళ్లకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యక్తి సహాయం చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇంకా చదవండి.