Processed Food Is Harmful To Health A Study Report Says : బయట ఫుడ్​తో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని.. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అధికమవుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రాసెస్డ్, ఆల్డా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు వినియోగం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడుగురు పెద్దల్లో ఒకరు, ప్రతి ఎనిమిది మంది చిన్నారుల్లో ఒకరిని ప్రాసెస్డ్ ఫుడ్ వ్యసనానికి కారణమవుతోంది. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్, రెడీ మీల్స్, ప్రాసెస్ చేసిన మాంసపు ఉత్పత్తులతో క్యాన్సర్, అధిక బరువు పెరుగుదల, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధులు బారిన పడే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 36 దేశాలకు చెందిన 281 అధ్యయనాలు విశ్లేషించడం ద్వారా ఆల్ట్రా ఫుడ్ అడిక్షన్ ప్రమాదాలను కనుగొన్నారు. మొత్తం జనాభాలో 14 శాతం మంది పెద్దలు, 12 శాతం మంది చిన్నారులు నిత్యం ప్రాసెస్డ్ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడయింది. ఈ అధ్యయనం ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 


శారీరక, మానసిక అనారోగ్య సమస్యలకు కారణం..


ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను అతిగా తీసుకునే వారిలోనూ, ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తులలోనూ మెదడు స్ట్రియాటమ్ లో ఎక్స్ట్రా  సెల్యులర్ డోపమైన్ ను ఒకే స్థాయిలో ప్రేరేపిస్తున్నట్లు తేల్చారు. దీనివల్ల తీవ్రమైన కోరికలు, స్థూల కాయం, తిండిపై నియంత్రణ లేకపోవడం, అతిగా తినే రుగ్మత, శారీరక, మానసిక అనారోగ్యం తదితర ఇబ్బందులు తలెత్తుతాయని ఈ అధ్యయనం వెల్లడించింది. యూకే, యూఎస్ లో సగటు వ్యక్తి ఆహారంలో సగానికిపైగా ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగిస్తున్నట్లు తేల్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అసమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో వైద్యం, పర్యావరణం కోసం ఏడాదికి 7 ట్రిలియన్ డాలర్లకుపైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించి ఆందోళన వ్యక్తం చేసింది.


ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా స్థూలకాయం, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు ఉన్నత, మధ్య ఆదాయ దేశాల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. పట్టణీకరణ, జీవన శైలిలో మార్పులతోపాటు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, ప్రయాణ సమయాలు పెరగడంతో అనేక దేశాల్లో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రాసెస్ చేసిన జంతు ఆధారిత ఉత్పత్తులు, న్యుడుల్స్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వ్యాప్తి చెందుతున్నాయి. రొట్టెలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఉత్పత్తులు వంటి ఇతర ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉండవని ఈ నివేదిక వెల్లడించింది. 


ఆఫ్రికా దేశాలకు వ్యాప్తి 


ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వినియోగం ఇప్పటి వరకు ఆసియా లాటిన్ అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉంది. గడచిన కొన్నాళ్లుగా ఈ ఆహార పదార్థాలు వినియోగం ఆప్రికా కూడా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనిపట్ల అధ్యయన సంస్థలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు స్థాయిలు కంటే చాలా ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వినియోగం ఆప్రికా దేశాల్లో పెరిగినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వినియోగంతో పౌష్టికాహార లోపం కూడా పెరగనుందని, ఆఫ్రికా అలాంటి దేశాల్లో ఇప్పటికే పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని, ఈ తరహా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అది మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని అధ్యయన సంస్థ వివరించింది.


ప్రపంచ జనాభాలో దాదాపు 29.6% మంది 2022లో తీవ్రంగా ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. వీరిలో దాదాపు 11.3 శాతం మంది ఆహార అభద్రతలో తీవ్రంగా కూరుకుపోయారు. 2030లో దా ఈ నేపథ్యంలో ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను తీసుకునేవారు కొనరా ఆలోచన చేయాల్సిందిగా అధ్యయన సంస్థ వెల్లడించింది. దాదాపు 60 కోట్ల మంది దీర్ఘకాలికంగా పౌష్టికాహార లోపంతో బాధపడతారని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకునేవారు పునరాలోచన చేయాలని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. 


ఇప్పటికైనా దూరంగా ఉంచడం మేలు 


ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో పునరాలోచన చేయడం మంచిదన్న భావనను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బందులు గురిచేస్తాయని చెబుతున్నారు. ఇంట్లోనే వండుకుని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు పౌష్టికాహార లోపాన్ని కూడా అధిగమించేందుకు అవకాశం ఉంటుందని, ప్రాసెస్ చేసిన ఫుడ్ తో పోషకాహార లోపం కూడా తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ ఫుడ్ పిల్లలకి ఇచ్చే తల్లిదండ్రులు పునరాలోచన చేయాల్సిందిగా పలువురు సూచిస్తున్నారు.


Also Read : రాత్రుళ్లు త్వరగా నిద్రరావట్లేదా? అయితే ఈ టిప్స్​తో హాయిగా నిద్రపోండి