Teachers Day 2024 : ఉపాధ్యాయుల దినోత్సవం 2024 వచ్చేస్తుంది. ఈ సమయంలో టీచర్స్​ గొప్పతనం, వారి స్కిల్స్​ గురించి అందరూ చర్చిస్తారు కానీ.. వారి మెంటల్​ హెల్త్​ గురించి ఎక్కువమంది ఆలోచించరు. అవును టీచింగ్ చేసేవారికి ఇది చాలా ఇంపార్టెంట్​. పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేందుకు.. సిల్​బస్ కంప్లీట్ చేసేందుకు.. తెలియకుండానే వారిలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్​ ఎక్కువైతే ఎంత సింపుల్​ విషయమైన ఎక్స్​ప్లైయిన్ చేయడం కష్టమైపోతుంది. అందుకే ప్రతి ఉపాధ్యాయుడు.. తమ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. 


టీచర్స్​కి ఒత్తిడి ఉంటుందా?


ఉపాధ్యాయుడు స్టూడెంట్స్​కి మంచి భవిష్యత్తునివ్వాడినికి ట్రై చేస్తాడు. స్వార్థం లేకుండా పిల్లలకు పాఠాలు నేర్పించి.. వారు ప్రయోజకులైతే.. తల్లిదండ్రులకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే వారికి కొన్ని ఒత్తిళ్లు ఉంటాయి. చూసేందుకు పని తేలికగా అనిపిస్తుంది. అవే పాఠాలు కదా.. వాటిని చెప్పడానికి ఎందుకో అంత కష్టమనుకుంటారు కానీ.. అదే అంశాలను పిల్లలకు అర్థమయ్యేలా.. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ కొత్త కొత్త టెక్నిక్స్, సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. ఉన్న రీసోర్సెస్​కి అనుగుణంగా అసైన్​మెంట్స్ ఇవ్వండం నుంచి.. పిల్లలకు అర్థమయ్యే ఎగ్జాంపుల్స్, ఎగ్జామ్స్, తన క్లాస్​లో ఉండే ప్రతి పిల్లాడి భవిష్యత్తును ఛాలెంజింగ్​గా తీసుకునే టీచర్స్ ఉంటారు. 


బాధ్యతాయుతమైన పని


ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయులు మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. పిల్లలందరూ మంచి మార్కులు తెచ్చుకోవాలని.. సిల్బస్ కంప్లీట్ చేయాలని.. పైనుంచి అధికారుల ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఇవే కాకుండా పిల్లలను ఇంట్లో చదివించని వారు కూడా వచ్చి.. మా పిల్లాడికి మార్కులు తగ్గాయండి అంటూ అడిగే ప్రశ్నలు వారిని మరింత స్ట్రెస్​కి గురిచేస్తాయి. ఒక్కరు చదవకపోతే ఏమైంది అని ఏ టీచర్​ అనుకోదు. వారిని బెటర్​ చేసేందుకే ప్రయత్నిస్తారు. అందుకే టీచింగ్ అనేది బాధ్యతాయుతంగా తీసుకుని వారు ఒత్తిడికి గురవుతారు. 


ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి..


కేవలం స్కూల్​లోనే కాదు.. వారికి ఇంటి దగ్గర కూడా స్కూల్ వర్క్ ఉంటుంది. స్కూల్​కి ఉదయాన్నే వెళ్లాల్లి కాబట్టి లేట్​ నైట్​ పడుకున్న నిద్ర సరిపోకున్నా వెళ్లిపోతారు. ఇది మానసికం ఆరోగ్యంపై ఒత్తిడి కలిగిస్తుంది. పనిగంటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంటికి వెళ్లాక.. పిల్లలకు ఇవ్వాల్సిన, ఇచ్చిన అసైన్​మెంట్స్​తో వర్క్ చేస్తారు. అలాగే వ్యక్తిగత జీవితం కూడా కొందరికి స్ట్రెస్ ఇస్తుంది. ఇవన్నీ వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే ఈ ఒత్తిడిని ఓవర్​ కామ్ చేయొచ్చు. 


ప్రణాళిక అవసరం.. 


టైమ్ మ్యానేజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సిల్​బస్​ని మీ టార్గెట్​లోపు కంప్లీట్ చేయాలి. పిల్లలకు ఈరోజు ఏమి సబ్జెక్ట్ చెప్పాలనేది ముందుగానే ప్లాన్ చేసుకుంటే మీపై స్ట్రెస్ ఉండదు. కిడ్స్​కి కూడా వాటిని రివ్యూ చేయడానికి టైమ్ సరిపోతుంది. 


వర్క్​కి లిమిట్.. 


టీచర్లు పేపర్స్ కరెక్ట్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి వాటిని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. వాటిని ముందు వేసుకుని టైమ్​ తెలియకుండా పనిచేస్తారు. అలాంటివారు ఈ పనికి టైమ్ లిమిట్ పెట్టుకోవాలి. దీనివల్ల మీ పర్సనల్​ లైఫ్​కి కాస్త సమయం దొరుకుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. 


తక్కువగా చూసుకోకండి.. 


కొందరు తమని తామే విమర్శించుకుంటారు. మారుతున్న కాలం, సాంకేతికత, బోధనా శైలుల్లో మార్పులు ఉంటూనే ఉంటాయి. వాటికి తగ్గట్టే స్కిల్స్ పెంచుకోవడం, అప్​గ్రేడ్ అవ్వడం, సరిహద్దులను అధిగమించడం వంటివి చేస్తారు. ఈ క్రమంలో కొందరు స్వీయ విమర్శలు చేసుకుంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్​లో విమర్శలు కాకుండా.. మిమ్మల్ని మీరు డెవలెప్ చేసుకునే విధానానికి కంగ్రాట్స్ చెప్పుకోండి. 


సానుకూలమైన వాతావరణం


మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటే మనం తెలియకుండానే హ్యాపీగా ఉంటాము. కాబట్టి ఇంట్లో, స్కూళ్లో కూడా ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ చుట్టూ సానుకూలమైన వ్యక్తులు ఉన్నప్పుడు ఒత్తిడి తగ్గిపోతుంది. మీకున్న సమస్యలను వారితో డిస్కస్ చేయడం వల్ల మీకు రిలీఫ్ ఉంటుంది. లేదంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి పని విషయంలో సీరియస్​గా కాకుండా.. కాస్త సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించండి. 


హెల్తీ లైఫ్ స్టైల్


ఇది అన్నింటికన్నా ఇంపార్టెంట్. క్లాస్​ చెప్పేప్పుడు చాలాసేపు నిల్చోవాల్సి వస్తుంది. అలాగే స్టూడెంట్స్ అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాలి. కాబట్టి హెల్తీ లైఫ్​ స్టైల్ లీడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. వ్యాయామం, యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​లు చేయాలి. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా, ఫిట్​గా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఇవి ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. అలాగే సమతుల్యమైన ఆహారం కూడా మీరు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 



మిమల్ని యాక్టివ్​గా ఉంచుకునేందుకు టీ లేదా కాఫీ తీసుకోండి. క్లాస్​లోకి వెళ్లే ముందు బ్రీతింగ్ ఎక్సర్​ సైజ్​లు చేస్తే మంచిది. మీరు హ్యాపీగా ఉంటే.. కిడ్స్ భవిష్యత్తు బాగుంటుంది. స్టూడెంట్​ మంచి స్కిల్స్ నేర్చుకుంటే సామాజికంగా మంచి మార్పులు జరుగుతాయి. కాబట్టి టీచర్స్ మీ మెంటల్​ హెల్త్​ని ఇగ్నోర్ చేయకండి. హ్యాపీ టీచర్స్ డే. 


Also Read : భారత్​లోనూ పెరిగిపోతున్న DINK కల్చర్.. పిల్లలు వద్దు, ఆదాయమే ముద్దు అంటోన్న కపుల్స్